Oct 20, 2009

లిటిల్ సోల్జర్స్

గాత్రం: బాలు



పల్లవి:

సరేలే ఊరుకో పరేషానెందుకు
సరేలే ఊరుకో పరేషానెందుకు
చలేసే ఊరిలో జనాలే ఉండరా
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్తా మారిపొతే
మూతిముడుచుకునుంటారా
ఆటలోనూ పాటలోనూ మూడు మళ్ళీ మార్చుకోరా
మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరు
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరు
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

చరణం1:

పిల్లిపిల్లదెపుడూ ఒకే మాటకదా
మియావ్ మియావ్ మియావ్ మియావ్ మియావ్ మియావ్
కోడి పెట్టదెపుడూ ఒకే కూతకదా
కొకో కొక్కొరొకో కొకో కొక్కొరొకో
కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలుక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వునెప్పుడు మారనీయకే ఏమైనా
కష్టమొస్తే కేరుచేయక నవ్వుతో తరివేయవమ్మ

మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరు
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరు
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

చరణం2:

గూటిబిళ్ళ ఆడదాం సిక్సరుకొడదాం
క్రికెట్ కాదుగాని ఫన్నీగానే ఉంది
ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం
బఫెల్లోసుకది బాత్రూంకాదా మరి
రాణిగారి పోజులో నువు కూరుసోమ్మ ఠీవిగా
గేదెగారి వీపుమీద షైరు కెళదాం స్టైలుగా
జురాసిక్ పార్కుకన్నా బెస్టు ప్లేసీ పల్లెటూరే బుల్లెమ్మ
బోలెడన్ని వింతలున్నాయ్ బోరులేక చూడవమ్మ

మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరు
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరు
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

వెన్నెల said...

విహారి గారు ముందుగా మీ ఓపికకి హ్యాట్సాప్.
అబ్బా! ఇక్కడున్న మీ ఆణిముత్యాలన్నీ నాకు నచ్చిన పాటలే.
ఇందులో i am very good girl.... కూడా బాగుంటుంది వీలుంటే అదీ చూడండి.