Nov 9, 2009

మురారి

తారాగణం: మహేష్‌బాబు,సోనాలిబింద్రే,లక్ష్మి
గాత్రం: ఎస్.పి.చరణ్,హరిణి
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: ఎన్.దేవీప్రసాద్,రామలింగేశ్వరరావు
సంస్థ: రామ్ ప్రసాద్ ఆర్ట్స్
విడుదల: 2001




పల్లవి:

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఒహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

చరణం1:

కులుకులో ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన చురకత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహా పోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది

ఒహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

చరణం2:

ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
ఏ తోటలో తనుందోనని ఎటు పంపను నా మనసుని
ఏనాడు ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
నాకోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మ
ఏ ఊరే అందమా ఆచూకి అందుమా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: