31-Aug-2009

యువరాజు

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: దాసరి నారాయణరావు




పల్లవి:

నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా

నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా

చరణం1:

పయనించు మేఘాలు పయనాలు ఆపి
చిరునవ్వు నవ్వి చిరుజల్లు చల్లి
కదలి వెడలిపోతే అదే ముచ్చట
సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి
సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి
సిగ్గుల్లో నిన్ను మైకంలో నన్ను
చూసి చూడలేక ఉండీ ఉండలేక
కదలి వెడలిపోతే అదే ముచ్చట అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా

నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా

చరణం2:

నిదురించు అందాలు ఒకసారి లేచి
పైపైకి వచ్చి పరువాలు చూసి
నిదుర మరచిపోతే అదే ముచ్చట
లోలోని కోరికలు లోకాలు మరిచి
లోలోని కోరికలు లోకాలు మరిచి
కళ్ళల్లో నిన్ను కౌగిళ్ళో నన్ను
ఉంచీ ఉంచలేక వదలీ వదలలేక
కదలి వెడలిపోతే అదే ముచ్చట అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా

ఆ ఆ ఆ నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

30-Aug-2009

రక్షరేఖ

తారాగణం: నాగేశ్వరరావు,భానుమతి,అంజలీదేవి
గాత్రం: ఘంటసాల,భానుమతి
సాహిత్యం: బలిజేపల్లి
సంగీతం: హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
దర్శకత్వం: ఆర్.పద్మనాభం
విడుదల: ఏప్రిల్ 30, 1949




పల్లవి:

జీవనడోలి
జీవనడోలి మధుర జీవన కేళి
ఇదే ప్రేమ సుధావాహిని
ఓ ఓ ఓ ప్రియా తేలుదమే హాయిగా
జీవనడోలి
జీవనడోలి మధుర జీవన కేళి
ఇదే ప్రేమ సుధావాహిని
ఓ ఓ ఓ ప్రియా తేలుదమే హాయిగా
జీవనడోలి

చరణం1:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నీవే సారంగువి ప్రేమ కేళి డోలికి
నీవే సారంగువి ప్రేమ కేళి డోలికి
ఆనందవాహిని హాయి సాగిపోవగా

ఓ ఓ ఓ ప్రియా తేలుదమే హాయిగా
జీవనడోలి

చరణం2:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీవే చుక్కానివిగా నడుపు అదో ప్రేమనగరి
నీవే చుక్కానివిగా నడుపు అదో ప్రేమనగరి

ఓ ఓ ఓ చెలి చేరుదమే హాయిగా
జీవనడోలి

చరణం3:

పున్నమిరేయి పాల వెన్నెలలో హాయి
పున్నమిరేయి పాల వెన్నెలలో హాయి
పోనిమ్మ సరాసరి డొలిక
ఓ ఓ ఓ మనోహర
ఓ ఓ ఓ మనోహర
ఓ ఓ ఓ మనోహర

ఓ ఓ ఓ ప్రియా తేలుదమే హాయిగా
జీవనడోలి

చరణం4:

చలిపూల గాలి సాగే
సుమడోలి ఉయ్యాలూగే
చలిపూల గాలి సాగే
సుమడోలి ఉయ్యాలూగే
చెలి చంద్రికా అదే ప్రేమనగరి
చెలి చంద్రికా అదే ప్రేమనగరి
ప్రేమ సఖా ప్రేమ సఖి
ప్రేమ సఖ చేరుదమా
ప్రేమ సఖి చేరుదమే

ఓ ఓ ఓ ప్రియా తేలుదమే హాయిగా
జీవనడోలి
జీవనడోలి మధుర జీవన కేళి
ఇదే ప్రేమ సుధావాహిని
ఓ ఓ ఓ ప్రియా తేలుదమే హాయిగా
జీవనడోలి


||

29-Aug-2009

వెంగమాంబ

గాత్రం: కీరవాణి,సునీత
సాహిత్యం: వెంగమాంబ



శ్రీకరముగాను తరికొండ శ్రీనృసింహుడైన శేషాచలేంద్రుని అనుమతమున
లలితమగు ముక్తికాంతా విలాసకృతిని వెలయ రచియించె తరిగొండ వేంగమాంబ

ముక్తికాంతా విలాసము
బాలకృష్ణ నాటకం అష్టాంగ యోగ సారం

రసికుడౌ కృష్ణార్యు రమణి మంగాంబ సుత వేంగమాంబ భాసుర భక్తి తోడ
రతిలేని శ్రీరమా పరిణయమ్మనెడి వరకృతిని ద్విపదకావ్యముగా రచించి
వేంకటాచలపతి పదయుగళికే సమర్పణము కావించె

గోవింద గోవింద జయ గోవింద
గోవింద గోవింద హరి గోవింద
గోవింద గోవింద జయ గోవింద
గోవింద గోవింద హరి గోవింద

నీవు నా స్వామివే నీ సొమ్ము నేను
కావున పాద్యమెక్కడపోదు కృష్ణ
శేషభూతను నేను శేషివే నీవు
కావున పాద్యమెక్కడపోదు కృష్ణ
వేటికైనను గాని నీ కటాక్షమున
నీ పాద్యమెరిగితి నిజముగా కృష్ణా
నా దద పాపసంగముల పోగొట్టి
పరమపదమును ఇచ్చి పాలించు కృష్ణ

సరోజ పత్రలోచనం
సుసాధు ఖేద మోచనం
చరాచరాత్మకం ప్రపంచసాక్షిభూతమవ్యయం
పురారి పద్మజా మరేంద్ర పూజితం ద్విపంకజం
స్మరామి వేంకటేశ్వరంచ సాగరాత్మజేశ్వరం
నమామి వేంకటేశ్వరం
నమామి వేంకటేశ్వరం
నమామి వేంకటేశ్వరం

శరణు శరణు పావననామ జగదభిరామా...జగదభిరామా
సంపూర్ణకామ...సంపూర్ణకామ
జయ నిగమ విహారా ధీర జయ సుజనాధార...జయ సుజనాధార
జగదేకవీర...జగదేకవీర
జయ పరమ పవిత్ర సత్య చరిత్ర
జయ వికుంఠ క్షేత్ర సన్ముని స్తొత్ర

రామాయణార్ధ సారమును గ్రహించి
సుజాన వాశిష్ట రామాయణమును రచియించె వేంగమాంబ
రచియించె వేంగమాంబ

గోవింద గోవింద జయ గోవింద
గోవింద గోవింద హరి గోవింద
గోవింద గోవింద జయ గోవింద
గోవింద గోవింద హరి గోవింద
గోవింద గోవింద జయ గోవింద
గోవింద గోవింద హరి గోవింద

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28-Aug-2009

పెళ్ళిసందడి

గాత్రం: కీరవాణి,చంద్రబోస్
సాహిత్యం: చంద్రబోస్



పల్లవి:

బిక్కుబిక్కుమంటు వంట ఇంట నక్కాము
లక్కు మాకు దక్కునంటు ఇక్కడొచ్చి పడ్డాము
కొంటెదాని జాడ లేక గరిట చేతపట్టాము
పిట్ట నేడు కానరాక పిండి రుబ్బుతున్నాము
అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి
చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి

చరణం1:

దప్పలాలు గుప్పుమంటు గొప్పగుంది మావంట
అప్పడాలు చేయకుండ తప్పలేదు ఈపూట
మక్కువైన చెక్కిలాలు సుబ్బరంగ బొబ్బట్లు
చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు
పెరుగు పచ్చడి పులిహోర పొంగలి
సాపాటు రెప్పపాటులో రెడీ
నాభి సుందరి నాలోని ఊపిరి
వరించి చేరుటెప్పుడో ఒడి
స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము
రొస్టులోన తేస్టులెన్నొ రెస్టులేక నింపినాము

అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి
హ చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి

చరణం2:

చిటెకలోనె సిద్దమయ్యే జాంగిరీలు ఎంచక్కా
గుటకలోన కరిగిపోవు గులాబ్‌జాము ఈపక్క
పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గా
పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా
నేతి బూరెలు లేలేత గారెలు
భలేగ కొలువుతీరి ఉన్నవి
పూతరేకులు కచోరి అరిసెలు
ఊరించి రుచులు పెంచుతున్నవి
మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము
స్వచ్చమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము

చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి
రుబ్బురుబ్బి రుబ్బలేక హబ్బబ్బో
బొబ్బలెక్కి చేతులన్ని ఓయబ్బో
పిల్లమాట దేవుడెరుగు బామ్మర్ది
ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

27-Aug-2009

విలన్

తారాగణం: రాజశేఖర్,నేహా దూపియ,తులిప్ జోషి
గాత్రం: ఉన్నికృష్ణన్,సుజాత
సాహిత్యం: భువనచంద్ర
సంగీతం: విద్యాసాగర్
విడుదల: 2003



పల్లవి:

నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా
నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా
నీ కనుల ఒడిలో నే కలనా కాటుకనా
నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా
నీ సొగసు పొగడ నే కవినా కల్పననా
నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా

చరణం1:

నే బిడియపడితే నువు గిలివా చెక్కిలివా
ఆ ఆ ఆ నే విరహమైతే నువు రతివా కోరికవా
ఆ ఆ ఆ నే పాపనైతే నువు ఒడివా ఊయలవా
ఆ అహ నే నిదురనైతే నువు కలవా కౌగిలివా
ఆ ఆ ఆ నే హృదయమైతే నువు వూపిరివా సవ్వడివా
ఆహా నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా

చరణం2:

నే గగనమైతే వేసవివా వెన్నెలవా
ఆ ఆ నే నదిని ఐతే నువు అలవా అలజడివా
ఆ ఆ నే విందునైతే నువు రుచివా ఆకలివా
ఆ అహ నే భాషనైతే నువు స్వరమా అక్షరమా
ఆహహ నే పాటనైతే నువు శృతివా పల్లవివా

నే తోటనైతే ఆమనివా కోయిలవా
నే జంటకొస్తే నువు ఋషివా మదనుడివా
నీ ఎదుటపడితే పిలిచేవా వలచేవా
ఆ ఆ నిను నేను పిలువకుంటే నువు అలగవా అడగవా
ఆ ఆ నను ప్రేమించమంటే తప్పా ఒప్పా

నీలోన వుందీ నేనే కదా
నాలోన వుందీ నీవే కదా
ఎదలోని వలపే ఎదురెదురు చూసి వానలాగా కురిసేనులే

~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~

26-Aug-2009

మిత్రుడు

తారాగణం: బాలకృష్ణ,దీపక్,ప్రియమణి
గాత్రం: విజయ్ యేసుదాస్,కౌసల్య
సాహిత్యం: వెన్నెలకంటి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: మహదేవ్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
సంస్థ: వైష్ణవి సినిమా
విడుదల: 2009



పల్లవి:

ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట
కోయిల గొంతున సరిగమలే అల్లరి పాటకు పల్లవులైతే
చల్లని మనసుల మధురిమలే అల్లిన పల్లవి చరణాలైతే
కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య
ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట

చరణం1:

ఆనందం అభిమానం మా తోట పువ్వులులే
అనురాగం అనుబంధం మా గూటి గువ్వలులే
సంతోషం సల్లాపం మా ఇంటి దివ్వెలులే
ఉల్లాసం ఉత్సాహం మా కంటి నవ్వులులే
మా సాటి ఎవ్వరు మా పోటి లేరెవరు
గుండెల చప్పుడు వింటుంటే కొండలు కోనలు పలికేనంట
పండిన మమతలు పలికెలే ఎండలు కూడా వెన్నెలలే
కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య

ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట

చరణం2:

ఆశలు ఎన్నో అందరిలోన వుంటాయిలే
కన్నులు ఎన్నో తీయని కలలు కంటాయిలే
ఊహలలోన ఎదలే ఊయల ఊగాలిలే
ఓ కధలాగ జీవితమంతా సాగలిలే
ఈ కమ్మని రోజు ఇక మళ్ళి మళ్ళి రాదంట
మా మనసుల మమత ఇక మాసి పోనే పోదంట
కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

25-Aug-2009

అరుంధతి

గాత్రం: సందీప్,శ్రీకృష్ణ,ఖుషి మురళి,నాగ సాహితి,రేణుక
సాహిత్యం: అనంత్‌శ్రీరాం



పల్లవి:

చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కల్లే ముత్యాలల్లి మెళ్ళో వేసావే
డోలారే డోలారే డం
కోలాటాలాడే క్షణం
డోలారే డోలారే డం
ఇళ్ళంతా బృందావనం
పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం
దుమికే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామ తొంగి మనం
డోలారే డోలారే డం
కోలాటాలాడే క్షణం
డోలారే డోలారే డం
ఇళ్ళంతా బృందావనం
ఇళ్ళంతా బృందావనం

చరణం1:

ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి ఇలా సందళ్ళే రావాలని
ఇన్నేళ్ళు చూసింది మా మావిడి ఇలా గుమ్మంలో ఉండాలని
మురిసే ప్రేమల్లో ఉయ్యాలూపంగా
తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా
సిరులే చిందాయి వైభోగంగా
వరించి తరించే వాడే వస్తున్నాడు అడ్డం లెగండోయ్
హే డోలారే డోలారే డం
వారేవా ఎం సోయగం
డోలారే డోలారే డం
నువ్వేగా నాలో సగం
డోలారే డోలారే డం


కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీగౌరివోలె లేదా
శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద

జేజమ్మా జేజమ్మా
జేజమ్మా జేజమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా

చరణం2:

నాచోరే నాచోరే ఓ సోనియే
నువ్వే పుట్టావే మేరే లియే
నాకంటి పాపల్లే చూస్తానులే
అనే మాటిచ్చుకుంటానులే
మనసే బంగారం అంటారోయ్ అంతా
ఇహ పో నీ పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం నీవెంట
కలలోనైనా నిను విడిపోదంట
ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంతా చూడండోయ్

డోలారే డోలారే డం
నాచుట్టు ఈ సంబరం
డోలారే డోలారే డం
ఏజన్మదో ఈ వరం
ప్రాణంలో నే దాచుకుంటాను పంచేటి ఆ ప్రాయము
జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము

డోలారే డోలారే డం
ఇళ్ళంతా బృందావనం
ఇళ్ళంతా బృందావనం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

24-Aug-2009

నింగి నేల నాదే

తారాగణం: లీచింగ్ మావ్,యాహుహు
గాత్రం: చిత్ర
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నిర్మాత: చావ సుధారాణి
దర్శకత్వం: ఫెంగ్ జెంజి
సంస్థ: సుజన మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల: 2009





పల్లవి:

ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత
నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా
ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా
ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత

చరణం1:

చేజారెను చేతులు చెదిరేను గీతలు
చేజారెను చేతులు చెదిరేను గీతలు
బెదిరించిన భాదలే వివరించెను భోదలు
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా
మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా

ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత

చరణం2:

పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం
అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం
సహనంతో ఉంటే దొరికింది సైన్యం
చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం

పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం
అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం
సహనంతో ఉంటే దొరికింది సైన్యం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23-Aug-2009

కూలీ నెం1

గాత్రం: బాలు & కోరస్
సాహిత్యం: సీతారామశాస్త్రి




అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు



పల్లవి:

జైజైజై జై గణేష జైజైజై
జైజైజై జై వినాయకా జైజైజై
జైజైజై జై గణేష జైజైజై
జైజైజై జై వినాయకా జైజైజై

దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవా
నీ అండాదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ
పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్య
తండ్రివలె ఆదరించి తోడునీడ అందించయ్య
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవా
నీ అండాదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ

చరణం1:

చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓహొహొ జన్మ ధన్యం
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓహొహొ జన్మ ధన్యం
అంబారిగా ఉండగల ఇంతటి వరం
అంబాసుత ఎందరికి లభించురా
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా

దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవా
నీ అండాదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ

చరణం2:

శివుని శిరసు సింహాసనం ఎక్కిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
హొయ్ హొయ్ హొయ్
శివుని శిరసు సింహాసనం ఎక్కిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
హొయ్ హొయ్ హొయ్
త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యొర అయ్య
నిరంతరం మహిమలు కీర్తించరా అయ్యొర అయ్య
నువ్వెంతనే అహం నువ్వే దండించరా

దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవా
నీ అండాదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ
అరెరెరె పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్య
తండ్రివలె ఆదరించి తోడునీడ అందించయ్య
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవా
నీ అండాదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ
జైజైజై జైజై జైజై జైజైజై జై
దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవా
నీ అండాదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22-Aug-2009

వీరాభిమన్యు

తారాగణం :రామారావు,శోభన్ బాబు,కాంచన,గీతాంజలి,కాంతారావు
గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
దర్శకత్వం :వి. మధుసూదన రావు
నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, డూండీ
సంస్థ: రాజ్యలక్ష్మి ప్రొడక్సన్స్
విడుదల:1965



పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అదిగో నవలోకం వెలసే మన కోసం
అహహాహాహా ఓహొహొహొ
అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం

చరణం1:

నీలినీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలినీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో ఎచట సుధ కలదో
అచట మనముందామా ఆఆఆఆ
అదిగో నవలోకం వెలసే మనకోసం

చరణం2:

పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచట మనముందామా ఆఆఆఆ
అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

21-Aug-2009

కన్నె వయసు

తారాగణం :రోజారమణి,లక్ష్మీకాంత్
గాత్రం:బాలు
సంగీతం:సత్యం
సాహిత్యం:దాశరధి
దర్శకత్వం: బి.ఎస్.ఆంజనేయులు
సంస్థ: శ్రీగౌరి ఎంటర్‌ప్రైజెస్
విడుదల:1973



పల్లవి:

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మధిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమె దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే
ఏ దివిలో విరిసిన పారిజాజమో

చరణం1:

పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియెలు ఘల్లు ఘల్లుమన రాజహంసల రావె
ఏ దివిలో విరిసిన పారిజాజమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

చరణం2:

నిదురమబ్బులను మెరుపు తీగవై కళలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్య కన్యవై రావె

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

20-Aug-2009

మురారి

గాత్రం: శంకర్ మహదేవన్
సాహిత్యం: చంద్రబోస్



పల్లవి:

గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి
గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి
పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు ఉహుహు ఉహు ఓ లచ్చా

అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చేయి ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవ చుట్టేసేందుకే ఉంది
ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే

చరణం1:

నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నది
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నది
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నది
ఒక్కట్టయేందుకే ఇద్దరం ఉన్నది
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నవి

చరణం2:

మిలమిల మిలమిల ఉప్పెన నేనై వస్తా
నీ కలకల కలకల మోముని చూస్తూ ఉంటా
గలగల గలగల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా

నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లొ చోటున్నది
నీవాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటు నా చేయి ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవ చుట్టేసేందుకే ఉంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19-Aug-2009

శివరంజని

గాత్రం: బాలు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి





పల్లవి:

అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో
అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
శివరంజనని శివరంజని

చరణం1:

అది దరహాసమా మరి మధుమాసమా
అది దరహాసమా మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశి కిరణమ్ములా
అవి చరణమ్ములా శశి కిరణమ్ములా
నా తరుణభావనా హరిణమ్ములా

అభినవ తారవో నా అభిమాన తారవో ఓ ఓ ఓ
అభినవ తారవో
శివరంజని శివరంజనని

చరణం2:

ఆ నయనాలు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడిన చాలు
ఆ నెన్నడుము ఆడిన చాలు
రవళించు పదకవితా ప్రభంధాలు

అభినవ తారవో నా అభిమాన తారవో ఓ ఓ ఓ
అభినవ తారవో
శివరంజని శివరంజనని

చరణం3:

నీ శృంగార లలిత భంగిమలో పొంగి పోదురే ఋషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగి పోదురే కర్కసులైనా
వీరమా నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ
మిన్నులందుకున్నవాడ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తడను
నీ ప్రియభక్తుడను

అభినవ తారవో నా అభిమాన తారవో ఓ ఓ ఓ
అభినవ తారవో
శివరంజని శివరంజనని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

18-Aug-2009

సత్యం

గాత్రం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల



పల్లవి:

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా
కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికి వెతికీ నీకే లైనేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా
కాళిదాసులాగ మారి కవితే రాసేశా

చరణం1:

ట్రిపులెక్స్ రమ్ములోన కిక్కు లేదు హల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్ లైట్ వేళ నుంచి మూన్ లైట్ వెళ్ళేదాకా
ఫుల్ టైం నా గుండెల్లో హాటులైన్ నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే
నువు నమ్మవు గాని కలవరమాయే
మగువా ఓ మగువా ఓ మగువా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా
కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

చరణం2:

కో అంటే కోటిమంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుకుంటే దంచుతావే కారాన్ని
క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి
ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా
ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె
నీ మాటలు లేక మోడైపోయే
మగువా ఓ మగువా ఓ మగువా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా
కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17-Aug-2009

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్

గాత్రం: విజయ్ యేసుదాస్
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప

చరణం1:

మనసూ ఉంది మమతా ఉంది
పంచుకునే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది
ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధి యుగ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

చరణం2:

వెనకొస్తానన్నావు వెళ్లొస్తానన్నావు
జంటై ఒకరిపంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్నుతప్ప

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Aug-2009

జై

తారాగణం: నవదీప్,సంతోషి,ఆయేషా జుల్కా
గాత్రం: బేబి ప్రీతి,శ్రీనివాస్
సాహిత్యం: కులశేఖర్
సంగీతం: అనూప్ రుబెన్స్
నిర్మాత & దర్శకత్వం: తేజ
విడుదల: 2004





దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉన్న ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉన్న ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం

దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉన్న ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉన్న ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా

ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ అంటామందరం
వందెమాతరం వందెమాతరం
వందెమాతరం వందెమాతరం
వందెమాతరం వందెమాతరం
వందెమాతరం వందెమాతరం
వందెమాతరం వందెమాతరం
వందెమాతరం వందెమాతరం
వందెమాతరం వందెమాతరం
వందెమాతరం వందెమాతరం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14-Aug-2009

వెంగమాంబ

గాత్రం: చిత్ర
సాహిత్యం: వెంగమాంబ




శ్రీరఘురామ నీ కృపను చెల్వము మీరగ
శ్రీగణేషునిన్ వారిజగర్భునిన్
భవుని వాణిని దుర్గను క్షేత్రపాలకున్
సారెకు సర్వదేవతల సత్కవిశూరెలనెల్ల
భక్తి నిన్ కోరి భజింతునయ్య
తరిగొండ నృసింహ దైవాపయోనిధి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రారా గోపాలస్వామి రారా
ఊరకే వగలేల చేసేవురా
రారా గోపాలస్వామి రారా
మారుడు నిర్దయను సారె సారెకు బాణవర్ష ధారలు కురిసి
నాతో పోరాటమ్మునకు వచ్చే
రారా గోపాలస్వామి రారా

నాగాభరణా తే నమోనమో
భవ నాగ మృగేంద్రతే నమోనమో
నాగాభరణా తే నమోనమో
గరళకందరా గంగాధర హర స్మర సంహర శ్రీ మహితాత్మ
గురువర శ్రీ తరిగొండ పురాధిప నరహరి సఖతే నమోనమో
నాగాభరణా తే నమోనమో

ఎందుకే నీకింత మోహము
చిత్తమా పరమానందమా
కైవల్యమా ఈ దేహము
అందమై ఇంద్రియ విషయ బృందములను విరిగి
కిందు మీదు తెలియలేక అందమా చందమా ఆనందమా
ఎందుకే ఎందుకే చిత్తమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13-Aug-2009

పాండురంగ మహత్యం

తారాగణం: రామారావు,అంజలీదేవి,బి.సరోజాదేవి
గాత్రం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్య(జూనియర్)
సంగీతం: టి.వి.రాజు
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: త్రివిక్రమరావు
సంస్థ: ఎన్.ఎ.టి. పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల: 1957




అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు



పల్లవి:

హే కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారి
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారి
కృష్ణా ముకుందా మురారి

చరణం1:

దేవకి పంట వసుదేవు వెంట
దేవకి పంట వసుదేవు వెంట
యమునను నడిరేయి దాటితివంట ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వెలసితివంట నందుని ఇంట
వెలసితివంట నందుని ఇంట
వ్రేపల్లె ఇల్లాయెనంట

కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారి
కృష్ణా ముకుందా మురారి

చరణం2:

నీ పలుగాకి పనులకు గోపెమ్మ
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నిను రోట బంధించెనంట ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఊపున బోయి మాకుల గూలిచి
ఊపున బోయి మాకుల గూలిచి
శాపాలు బాపితివంట

కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారి
కృష్ణా ముకుందా మురారి

చరణం3:

అమ్మా తమ్ముడు మన్ను తినేను
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద
ఏదన్నా నీ నోరు చూపుమనగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్

జయ కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారి
కృష్ణా ముకుందా మురారి

చరణం4:

కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ
కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ
కేళీఘటించిన గోప కిశోరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కంసాది దానవ గర్వాపహార
కంసాది దానవ గర్వాపహార
హింసా విదూరా పాప విదారా

కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారి
కృష్ణా ముకుందా మురారి

చరణం5:

కస్తూరి తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌఖ్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనంచ కలయం
కంఠేచ ముక్తావళీమ్
గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణి
విజయతే గోపాల చూడామణి

లలిత లలిత మురళీ స్వరాళి
లలిత లలిత మురళీ స్వరాళి
పులకిత వనపాలి గోపాలీ
పులకిత వనపాలీ
విరలీకృత నవరాసకేళి
విరలీకృత నవరాసకేళి
వనమాలీ శిఖిపించమౌళి
వనమాలీ శిఖిపించమౌళి

కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారి
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారి
కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి

హే కృష్ణా ముకుందా మురారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Aug-2009

మహామంత్రి తిమ్మరుసు

గాత్రం: ఘంటశాల,సుశీల
సాహిత్యం: పింగళి




పల్లవి:

మోహనరాగమహా మూర్తిమంతమాయే
మోహనరాగమహా మూర్తిమంతమాయే
నీ ప్రియరూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
మోహనరాగమహా మూర్తిమంతమాయే

చరణం1:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవముపోసి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవముపోసి
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా
మోహనరాగమహా మూర్తిమంతమాయే

చరణం2:

నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకే రూపమురాగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకే రూపమురాగా
ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా
మోహనరాగమహా మూర్తిమంతమాయే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11-Aug-2009

చంటి

గాత్రం: బాలు




పల్లవి:

ఓ ప్రేమ నా ప్రేమ
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం
ఓ ప్రేమ నా ప్రేమ
నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం
రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమ నా ప్రేమ
నా పాటే వినరావా

చరణం1:

గడిచిన దినముల కథలను మరువకు మనసులో ప్రియతమ
శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా
ప్రణయపు పిలుపులు ప్రళయపు బిగువులు తెలుసుకో ప్రియతమ
విధికిక విలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా
నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం
సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం
గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం

ఓ ప్రేమ నా ప్రేమ
నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం
రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమ నా ప్రేమ
నా పాటే వినరావా

| |

10-Aug-2009

గృహప్రవేశం

తారాగణం :మోహన్‌బాబు,జయసుధ,కవిత
గాత్రం:యేసుదాసు
సంగీతం:సత్యం
దర్శకత్వం: బి.భాస్కర్
విడుదల:1988



పల్లవి:

దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక
దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక
జన్మ జన్మకు తోడుగా
నా దానివై నువ్వు నడచి రా
దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక

చరణం1:

మనసులేని శిలను నేను
నువ్వు చూసిన నిన్నలో
మమత తెలిసి మనిషినైతి
చల్లని నీ చేతిలో
కనులు తెరిచిన వేళలో
నీకేమి సేవలు చేతును
దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక

చరణం2:

మరపురాదు మాసిపోదు
నేను చేసిన ద్రోహము
కలను కూడా మరువనమ్మ
నువ్వు చూపిన త్యాగము
ప్రేమ నేర్పిన పెన్నిధి
ఆ ప్రేమ నిను దీవించనీ

దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక
జన్మ జన్మకు తోడుగా
నా దానివై నువ్వు నడచి రా
దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక


||

08-Aug-2009

జగదేకవీరుని కథ

గాత్రం: పి.లీల,పి.సుశీల



పల్లవి:

వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
ఔన చెలి ఔన సఖి ,ఔన చెలి ఔన సఖి
ఐతే వినవే మా మాట
ఐతే వినవే మా మాట

చరణం1:

నీవు చేసిన మాయలు మించి నవ మన్మధుడే ఆయెనే
అహ నవ మన్మధుడా ఆయెనే
ఒహొ మన్మధుడై నిన్ను ఆవేశించి మైమరపించేనే హల
నిను మైమరపించేనే హల
వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
ఔన చెలి ఔన సఖి ,ఔన చెలి ఔన సఖి
ఐతే వినవే మా మాట
ఐతే వినవే మా మాట

చరణం2:

అలిగిన చెలిని లాలన సేయ మళయానిలుడే ఆయెనే
ఒహొ మళయానిలుడే ఆయెనే
ఒహొ ఓ ఓ ఓ మళయానిలుడై చల్లగ చెలిపై వలపులు విసిరేనే హల
అహ వలపులు విసిరేనే హల
వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
ఔన చెలి ఔన సఖి ,ఔన చెలి ఔన సఖి
ఐతే వినవే మా మాట
ఐతే వినవే మా మాట

చరణం3:

చెలి అడుగులలో పూలు జల్లగ లలితవసంతుడె ఆయెనే
అహ లలితవసంతుడె ఆయెనే
కూకూ కుకుకుకూ కు
వసంతుడై నిను కోయిలపాటల చెంతకు పిలిచేనే హల
తన చెంతకు పిలిచేనే హల
వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
ఔన చెలి ఔన సఖి ,ఔన చెలి ఔన సఖి
ఐతే వినవే మా మాట
ఐతే వినవే మా మాట


| |

07-Aug-2009

సూత్రధారులు

గాత్రం: బాలు,శైలజ



పల్లవి:

లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

చరణం1:

ఓ ఓ ఓ ఇంతలేసి కళ్ళున్న
ఇంతి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంత
ఇంతలోనె చెప్పుకుంటె కొంటె వయసు
అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా
ఇంతలేసి కళ్ళున్న
ఇంతి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంత
ఇంతలోనె చెప్పుకుంటె కొంటె వయసు
అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా
కిన్నెడల్లె కన్నె పరువం ఉం ఉం కన్ను గీటి కవ్విస్తే
ఉన్న వేడి ఉప్పెనల్లే ఏ ఏ ఉరకలేసి ఊరిస్తే

లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

చరణం2:

ఓ ఓ ఓ గడుసు గాలి పడుచు మొగ్గ
తడిమిపోతే కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడై లగ్గమెట్టి కబురుపెడితె
వారమేల వర్జమేల వల్లమాలిన వంకలేల
గడుసు గాలి పడుచు మొగ్గ
తడిమిపోతే కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడై లగ్గమెట్టి కబురుపెడితె
వారమేల వర్జమేల వల్లమాలిన వంకలేల
ముసురుకున్న ముద్దులన్నీ ఈ ఈ మూడుముళ్ళ గుత్తులైతే
కలవరించు పొద్దులన్ని ఈ ఈ కాగిపోయి కౌగిలైతే

మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

||

06-Aug-2009

పెళ్ళి సందడి

గాత్రం: బాలు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి




పల్లవి:

సౌందర్యలహరి సౌందర్యలహరి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి ఆ ఆ ఆ
శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురి ఆ ఆ ఆ
వన్నె చిన్నెల్ల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కలనుంచి ఇలచేరి కనిపించు ఓసారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి


చరణం1:

పాల చెక్కిల్లు దీపాల పుట్టిల్లు
పాల చెక్కిల్లు దీపాల పుట్టిల్లు
అదిరేటి అధరాలు హరివిల్లులు
పక్కున చిందిన నవ్వులలో ఆ ఆ ఆ ఆ
లెక్కకు అందని రతనాలు ఆ ఆ ఆ ఆ
యతికైన మతి పోయె ప్రతిభంగిమ
ఏదలోనే పురి విప్పి ఆడింది వయ్యారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

చరణం2:

నీలి కన్నుల్లు నా పాలి సంకెల్లు
నీలి కన్నుల్లు నా పాలి సంకెల్లు
నన్ను చూసి వలవేసి మెలివేయగ
ఊసులు చేప్పిన గుసగుసలు ఆ ఆ ఆ ఆ
శ్వాసకు నేర్పేను సరిగమలు ఆ ఆ ఆ ఆ
సలగంటి తెలుగింటి కలకంటిని
కొలువుంటె చాలంట నా కంట సుకుమారి

సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి ఆ ఆ ఆ
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి ఆ ఆ ఆ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

05-Aug-2009

ఆత్మబంధం

గాత్రం: బాలు,వాణిజయరాం



పల్లవి:

కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
వన్నె పెంచుకుంటా నాకున్నదిచ్చుకుంటా
నీ వన్నె పంచమంటూ నే విన్నవించుకుంటా
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కాదన్నా ఆ బ్రహ్మ ఓ బొమ్మ
నిన్ను కట్టుకోక తప్పదందుకే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీ సిగ్గు అంచువెంట నా ముద్దులేసుకుంటా
కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే

చరణం1:

చూడవయ్య చలాకి లేడినయ్య
చలేసి చేరువయ్యా చులాగ్గ చేదుకో
వేడుకియ్య కసింత వేడినియ్య
కసంత వాడనియ్య మరింత చేరుకో
సందుచేసుకో సరైన సందెపొద్దురంధిలో
చందమామ కందిపోవు సందడందుకో
అందగత్తెరో హుషారు తొందరందుకుందిరో
చెందనాల చందనాల తొందరేందిరో
చిందాడు మైకంలో కథ ఎందాక పోతుందో
మందార సోకుల్లో మతి ఏందారి పడుతుందో
సందిటపడి కందినమది సంబరపడి చెంగుమంది
వంద ఏళ్ళ జంట నా కుందనాల పంట
నీ విందులేరుకుంటా వేయివందనాలు అంట

కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే

చరణం2:

పాలపిట్ట పదారు ప్రాయమిట్టా
పరాయి గాలి వెంట పచారు ఏలనే
పాడు గుట్టే పదంటు పొంగుతుంటే
పరాకు జారుపైటే బజారు ఏలెనే
పంతమాడితే పసందు బొంకమెంతొ పోల్చనా
పొందికైన బంధనాల పంజరాన
కందెమోడితే కసింత కట్టుబడితె పలచన
పిందె ఈడు పిండుకున్న పౌరుషాన
అరె పల్లేరు వానమ్మో అల్లారు ముద్దుబాల ఓ ఓ ఓ
పన్నీటి వాగయ్యో కిల్లారు సంబరాల
పందిరిజత అందిన పసి కందుకు బుసలెందుకుమరి
పొద్దువాలకుండా రేపొద్దు పాల ఎండ
చూపొద్దు వీలుజండా నా ముద్దు పూలచెండా

కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీ వన్నె పంచమంటూ నే విన్నవించుకుంటా
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~




~~~~~~~~~~~~~~~~~~~~~~~~

04-Aug-2009

మురారి

గాత్రం: బాలు,అనురాధాశ్రీరాం
సాహిత్యం: సీతారామశాస్త్రి



పల్లవి:

భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పనీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హత్తుకోవాలి
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి
భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పనీరు అయిపోతావా అల్లుడు

చరణం1:

ఎంచక్కా నీ నడుమెక్కి ఆ సగమై ఉంటా సరదాగా
వాటంగా చెయి వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
వద్దన్నా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా
గారంగా మమకారంగా నిను చుట్టేస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

చరణం2:

అబ్బోసి సొగసొచ్చేసి మహ చెలరేగావే లైనేసి
నను చూసి తెగ సిగ్గేసి తలవంచేసా మనసిచ్చేసి
చుట్టేసి పొగపెట్టేసి నను లాగేసావే ముగ్గేసి
ఒట్టేసి జతకట్టేసి వగలిస్తానయ్యో వలిచేసి
ఓసొసి మహ ముద్దేసి మతి చెడగొట్టావే రాకాసి
హే అడ్డేసి పొగమందేసి నను కాపాడయ్యో దయచేసి

భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ హొయ్ హొయ్ అరె భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పనీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హొయ్ హొయ్ హత్తుకోవాలి హాయ్ హాయ్
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి
భామ భామ డాడ్డడు డండడా అమ్మడు
బావా బావా పనీరు అయిపోతావా అల్లుడు
భామ భామ డాడ్డడ డండడారడండడాడండడా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

03-Aug-2009

సత్యం

గాత్రం: వేణు
సాహిత్యం: కందికొండ



పల్లవి:

I am in Love
I am in Love
I am in Love with u
కన్నులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే
I am in Love
I am in Love
I am in Love with u
కన్నులలో దాచిన కావ్యమే నువ్వు

చరణం1:

కోటి కలలను గుండెలోతులు దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్న ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి
నే నీటి చుక్కై పోవాలి
నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి
నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై
నిన్ను నేను చేరుకుంటె హాయి
నిన్ను నేను చేరుకుంటె హాయి

చరణం2:

నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగ నువ్వు తాకగ
మధువు శోకెను మనసుని
నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి
నే నీలో నిండిపోవాలి
నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానలో
నిలువెల్లా నేనే తడవాలి
నాలోని ప్రేమ ఏనాటికైన
నీకే అంకితమవ్వని
నీకే అంకితమవ్వని

I am in Love
I am in Love
I am in Love with u
కన్నులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

02-Aug-2009

స్నేహబంధం

తారాగణం: కృష్ణ,జమున
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: సత్యం
దర్శకత్వం: పి.సి.రెడ్డి
సంస్థ: విజయ & సురేష్ కంబైన్స్
విడుదల: 1973



Happy Frienship Day



పల్లవి:

స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము
స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము
ఆ అహహ హహహా హ ఆ
లా లాలా లలలాలలల

చరణం1:

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో
ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో
ఒకటే దొరుకుతుంది జీవితంలో
ఒకటే దొరుకుతుంది జీవితంలో
అది ఓడిపోదు వాడిపోదు కష్టసుఖాల్లో

స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

చరణం2:

మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచు కూడ వేడి సెగలు ఎగయువచ్చును
మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచు కూడ వేడి సెగలు ఎగయువచ్చును
పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
చెక్కుచెదరంది స్నేహమని నమ్మవచ్చును

స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము
ఆ అహహ హహహా హ ఆ
లా లాలా లలలాలలల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~