Jan 20, 2010

అరుంధతి

తారాగణం: అనుష్క,దీపక్,సోనూసూద్
గాత్రం: కైలాష్ కేర్
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: కోటి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: ఎమ్.శ్యామ్ ప్రసాద్ రెడ్డి
సంస్థ: మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్
విడుదల: 2009




కమ్ముకున్న చీకట్లోన కుమ్ముకొచ్చే వెలుతురమ్మ
కచ్చకట్టి కత్తిపడితే చిచ్చురేపే కాళివమ్మ
నీ కన్ను ఉరిమి చూడగానే
దూసిన కత్తి వణికిపోవునమ్మ
జేజమ్మా ఆ ఆ
కుంచెపట్టి బొమ్మగీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మ
అందరిని ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మ
ఆలనపాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మ
నువ్వు పలికేదే తిరుగులేని వేదం
నువ్వు చేసేదే ఎదురులేని చట్టం
ఓర్పులోన ధరణీ మాతవమ్మ
తీర్పులోన ధర్మమూర్తివమ్మ
జేజమ్మా మాయమ్మ
జేజమ్మా ఓయమ్మ
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా
జేజమ్మా మాయమ్మ
జేజమ్మా ఓయమ్మ
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా

నువ్వు రుద్రరూపమెత్తగానే కాలమే దద్దరిల్లిపోయెనమ్మ
క్షుద్రశక్తులకు నీ ధాటితో గుండెలే బద్దలైపోయెనమ్మ
కొట్టే కామాందుని కసితీరగ తొక్కావమ్మ
గడ్డనే ఆదుకున్న ఆ అపరభద్రకాళి నీవమ్మ

మాట నిలుపుకుంటివమ్మ జేజమ్మా మళ్ళీ జన్మ ఎత్తినావమ్మ
ఎంత దీక్ష పూనినావమ్మ గుండెలో నిప్పులే నింపినావమ్మ
త్యాగమంటె నీదమ్మ నరకమే కొంగులో ముడిచావమ్మ
నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మా కళ్ళు చెమ్మగిల్లినాయమ్మ
ఈ జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారుతులు పట్టెనమ్మ

దిక్కులన్ని శూన్యమాయే వెలుతురంతా చీకటాయే
ఆశలన్ని ఇంకిపోయే శ్వాస మాత్రం మిగిలిపోయే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: