Mar 6, 2010

చక్రం

తారాగణం: ప్రభాస్,అసిన్,ఛార్మి
గాత్రం: శ్రీ
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: చక్రి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: సి.వెంకటరాజు,జి.శివరాజు
సంస్థ: గీతాచిత్ర ఇంటర్నేషనల్స్
విడుదల: 2005




పల్లవి:

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం1:

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవతరం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని
కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం2:

మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం3:

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: