Apr 19, 2010

లక్ష్యం

తారాగణం: గోపిచంద్,జగపతిబాబు,అనుష్క,కళ్యాణి
గాత్రం: మధు బాలకృష్ణ
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి)
విడుదల: 2007




పల్లవి:

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా
అలుపే రాని కేరింతలో తను మురిసీ
మరుపే లేని ఈ మమతలో రుచి తెలిసీ
మన రాగాలలో అనురగాలలో తను కూడా
మనలాగే మురిసీ
గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా

చరణం 1:

ఇందరుండడగా ఇరుకైన ఇంటిలో
కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా
కాంతులుండగా ప్రతి వారి కంటిలో
ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా
సెలవులు లేని సంతోషం
అలకలు ఉన్నా అరనిమిషం
ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా

చరణం 2:

అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి
ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి
అన్న గోపురం వదినమ్మ గుమ్మమై
ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి
మనసే ఉన్నా మా ఇల్లు
మమకారాల దోసిళ్ళు
లేవంట ఏ తిధులు లోకాలే అతిధులు

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: