Aug 30, 2010

బుల్లెమ్మ బుల్లోడు

గాత్రం: బాలు
సాహిత్యం: రాజశ్రీ




పల్లవి:

నీ పాపం పండెను నేడు
నీ భరతం పడతా చూడు
నీ పాలిట యముణ్ణి నేను
నీ కరక్టు మొగుణ్ణి నేను
నీ పాపం పండెను నేడు
నీ భరతం పడతా చూడు
నీ పాలిట యముణ్ణి నేను
నీ కరక్టు మొగుణ్ణి నేను

చరణం1:

నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష
ఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్ష
నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష
ఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్ష
నీ డొక్క చించి నే డోలు కట్టి వాయించుటే నా దీక్ష
నీ పాపం పండెను నేడు
నీ భరతం పడతా చూడు
నీ పాలిట యముణ్ణి నేను
నీ కరక్టు మొగుణ్ణి నేను

చరణం2:

దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము
తలపొగరంతా తగ్గేదాక దులుపుతాను నీ దుమ్ము
దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము
తలపొగరంతా తగ్గేదాక దులుపుతాను నీ దుమ్ము
నీకోసమే నేనీ దినం ఎత్తేను ఈ అవతారం

నీ పాపం పండెను నేడు
నీ భరతం పడతా చూడు
నీ పాలిట యముణ్ణి నేను
నీ కరక్టు మొగుణ్ణి నేను యా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: