Sep 10, 2010

దేవుళ్ళు

తారాగణం: పృధ్వి,రాజేంద్రప్రసాద్,శ్రీకాంత్,సుమన్,రాశి,రమ్యకృష్ణ,లయ
గాత్రం: బాలు
సాహిత్యం: జొన్నవిత్తుల
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంస్థ: బాబు పిక్చర్స్
విడుదల: 2000




పల్లవి:

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం1:

బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనదీ వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్యప్రమాణం
ధర్మదేవతకు నిలపును ప్రాణం
విజయకారణం విఘ్న నాశనం
కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

చరణం2:

పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజ ముఖ గణపతివైనావు
బ్రహ్మండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీగణపతివైనావు
వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

||

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

విహారి(KBL) గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

హారం

Nagaraju said...

తిరుమల ఏడుకొండలలో దాగిన రూపం నేనైతే నా భావ స్వరూపాన్ని విశ్వం తిలకిస్తే -
ఏడుకొండలు కలసిన మధ్య భాగాన్ని మోహన త్రినేత్ర తేజస్సుతో దివ్య ప్రభావాలతో -
నక్షత్ర ప్రకాశములతో మెరుగు పరచి మహా లోకములు చూడలేనంతగా రూపమిచ్చి -
సృష్టిలోనే దివ్య శక్తులతో కూడిన అత్యంత ఉన్నతమైన ప్రదేశాన నిటారుగా నిలిపి -
ప్రకృతి పొరలలో వేకువజామున సన్నగా జారువాలే హిమబిందువులను శంఖమున సేకరించి -
సన్నని గాలి వీస్తున్న వేళ రూపానికి అంగుళం ఎత్తున శంఖపు నీటితో స్నాన పరచగా -
తేనీయ పంచామృతంతో కొబ్బరి నీటిని చిలకరించగా మేఘమలినములు వదిలి శుభ్రతతో -
ప్రతి పుష్ప సుమగంధ మనోహర సువాసనముల సంగీత స్వర మాధుర్య మంత్రములతో -
కోకిల కుహూ రాగ సమ్మేళనాలతో ఓంకార నాధములతో విచక్షనీయ గమన వినికిడితో -
సువర్ణ వజ్ర వైడూర్య నక్షత్ర ప్రకాశములతో కూడిన ఆభరణములను సునాయసంగా అలంకరించి -
నవ దివ్య గంధాల సాంబ్రాణి వేసి మై మరపించే సుమముగల కర్పూర హారతిని ఇవ్వగా -
పరమాత్మ జ్యోతితో జీవము కలుగునట్లు పరిశుద్ధ పరిపూర్ణ పవిత్ర ప్రజ్ఞాన సత్య భావముల -
సూర్యోదయ తొలికిరణాలు నేత్ర తాకిడితో చక్రదారిగా ఒక స్వప్నక్షణమున ప్రత్యక్షమయ్యెను -

Hi
welcome to my blog
gsystime.blogspot.com
Read for Universal knowledge and spiritual information
Thanks
Nagaraju