Oct 15, 2010

అల్లరి ప్రియుడు

గాత్రం: బాలు,చిత్ర
సాహిత్యం: వేటూరి
సంగీతం: కీరవాణి



పల్లవి:

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

చరణం1:

చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే
మోహపు తెరలిక తొలిగేనా అహ అహ
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా అహ అహ
పదాలతోనే వరించనా
సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల
రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

చరణం2:

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ
తెల్లారనీకే వయ్యారమా
అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు
నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే

చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

||

No comments: