Oct 25, 2010

పద్మవ్యూహం

గాత్రం: బాలు
సాహిత్యం: రాజశ్రీ



పల్లవి:

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం

చరణం1:

కిరణాలు రవికందం, సెలయేరు భువికందం
మగువలకు కురులందం, మమతలకు మనసందం
పుత్తడికి మెరుపందం, పున్నమికి శశి అందం
పుత్తడికి మెరుపందం, పున్నమికి శశి అందం
నాదాలు శృతికందం, రాగాలు కృతికందం

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం

చరణం2:

వేకువకు వెలుగందం, రేయంత అతివందం
వేసవికి వెన్నెలందం, ఆశలకు వలపందం
తలపులే మదికందం, వయసుకే ప్రేమందం
తలపులే మదికందం, వయసుకే ప్రేమందం
పాటకే తెలుగందం, శ్రీమతికి నేనందం

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: