Nov 5, 2010

అయ్యప్పస్వామి మహత్యం

గాత్రం: బాలు
సాహిత్యం: వేటూరి




పల్లవి:

ధన్యోహం ఓ శబరీశ
ధన్యోహం ఓ శబరీశ
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగమంగళాంగ
పంపాతరంగ పుణ్యానుషంగ మునిహృదయ జలజబృంగ
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశ

చరణం1:

బ్రహ్మచారినై భక్తియోగినై ద్వంద్వము అన్నది వీడి
విగతకామినై మోక్షగామినై తాపత్రయమును విడిచి
కన్నెస్వామినై కర్మధారినై కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా బంధము తెంచితి పందలవాస

ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశ

చరణం2:

శరణం శరణం భవతరణ శబరిగిరీశా అయ్యప్ప
శుభదం శుభదం నీ చరణం హరిహరపుత్ర అయ్యప్ప
అయినరేఖల సంగమవేళ మిధ్యావాసపు మధ్యస్థలిలో
శూన్యజగతిలో సూక్ష్మ పరిధిలో శిఖరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచర సృష్టిదీపమై మకరజ్యోతిగ వెలిగేది
నీ మహిమ ఒక్కటే అయ్యప్ప
ఈ మహికి దేవుడే అయ్యప్ప
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
శబరిగిరీశా ధన్యోహం
శబరిగిరీశా ధన్యోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: