Dec 29, 2010

అయ్యప్పస్వామి మహత్యం

గాత్రం: బాలు



పల్లవి:

స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప

శబరిమలై సందీప అయ్యప్ప
అభయహస్తమిచ్చేదెవరు నువు తప్ప అయ్యప్పా
శబరిమలై సందీప అయ్యప్ప
అభయహస్తమిచ్చేదెవరు నువు తప్ప అయ్యప్పా
శబరిమలై సందీప అయ్యప్ప

చరణం1:

వేదశాస్త్రము ఎరుగను బ్రహ్మసూత్రము
తలపను జ్ఞానయోగము విధివినిత మోక్షమార్గము
కలియుగపు కామ లోభ పంజరాన పామరుండనై
పూజలెరుగని పువ్వునై, పుణ్యమెరుగని జీవినై
ఆత్మనెరుగని దేహినై, అంధ మత సందేహినై
విషయ వాదముల విషతరువైతిని
విలయ పవనముల విలవిలలాడితి

శబరిమలై సందీప అయ్యప్ప
అభయహస్తమిచ్చేదెవరు నువు తప్ప అయ్యప్పా
శబరిమలై సందీప అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

చరణం2:

ఇంద్రియాలతో కలబడి ఈషణత్రయినై
కలుషిత జీవభావము కడవరకు మోయువాడను
శబరిగిరికందరాలనందలేని మందభాగ్యినై
చైత్ర వనముల కాంతినై, గ్రీష్మఋతువున కోకిలై
వెల్లువెరుగని వేణువై, వెన్ను చూడని కన్నునై
మనుజ జన్మమిది మలినము చేసితి
మదన కదనమున మలమల మాడితి

శబరిమలై సందీప అయ్యప్ప
అభయహస్తమిచ్చేదెవరు నువు తప్ప అయ్యప్పా
శబరిమలై సందీప అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2 comments:

జర్నో ముచ్చట్లు said...

మిత్రమా..
ఇంద్రియాలలో కలబడి ఈశనత్రినై కాదు..
ఈషణత్రయినై అని ఉండాలి. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ ఈ మూడింటిని ఈషణత్రయాలు అంటారు.

విజయ్‌

విహారి(KBL) said...

ధన్యవాదాలు. తప్పును తెలిపినందుకు.