30-Mar-2010

బొమ్మరిల్లు

గాత్రం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల




పల్లవి:

ఉం ఉం ఉం ఉం
కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు ఉం
పగలె వెన్నెల కాస్తుందంటు ప్రేమికులంటుంటే
అయ్యోపాపం మతిపోయిందని అనుకున్నాను
కాని ఇప్పుడు ఉం
ప్రేమ కోసం ఏకంగ తాజ్‌మహాలే కట్టాడు
షాజహాన్‌కి పనిలేదా అని అనుకున్నాను
ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను
ఓ ఓ ఓ అరే ఇంతలో ఏదేదో జరిగిందిరో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడ తడిసానురో
కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు ఉం
హే పగలె వెన్నెల కాస్తుందంటు ప్రేమికులంటుంటే
అయ్యోపాపం మతిపోయిందని అనుకున్నాను
కాని ఇప్పుడు ఉం

చరణం1:

ఓ ప్రేయసి ఊహల్లో లైఫ్ అంత గడిపేస్తూ
అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను
కాని ఇప్పుడు ఉం
గ్రీటింగ్ కార్డులకీ సెల్‌ఫోన్ బిల్లులకి
వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను
కాని ఇప్పుడు ఉం
గాలిలోన రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను
మాటి మాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను
ఓ ఓ ఓ అది ప్రేమని ఈ రోజే తెలిసిందిరో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడ తడిసానురో

కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు ఉం

చరణం2:

ఓ చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై
తికమక పెట్టె దొకటుందంటే నమ్మనే లేదు
కాని ఇప్పుడు ఉం
నీ కోసం పుట్టి నీ కోసం పెరిగే
హృదయం ఒకటి ఉంటుందంటే వొప్పుకోలేదు
కాని ఇప్పుడు ఉం
ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడ్నే ఎందుకు మిస్సైయాను
ఓ ఓ ఓ ఈ రోజులా ఏ రోజు అవలేదురో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడ తడిసానురో

కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు ఉం
హే పగలె వెన్నెల కాస్తుందంటు ప్రేమికులంటుంటే
అయ్యోపాపం మతిపోయిందని అనుకున్నాను
కాని ఇప్పుడు ఉం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28-Mar-2010

తలంబ్రాలు

తారాగణం: రాజశేఖర్,కళ్యాణ చక్రవర్తి,జీవిత
గాత్రం: సుశీల
సాహిత్యం: రాజశ్రీ
సంగీతం: సత్యం
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి
సంస్థ: ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్
విడుదల: 1986




పల్లవి:

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

చరణం1:

ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు చెంతకు చేరదీసినాడు
అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది తన హృదయం పరిచింది
ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్దపులని తను బలియైపోతినని
ఆ లేడి గుండె కోత నా గాధకు శ్రీకారం
నే పలికే ప్రతి మాట స్త్రీ జాతికి సందేశం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

చరణం2:

ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు కామాంధులు ఉన్నారు
వారి చేతిలో వందలు వేలు బలి అవుతున్నారు అబలలు బలి అవుతున్నారు
నిప్పులు చేరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికి చల్లారేదెప్పటికి
ఆ మంటలారుదాకా నా గానమాగిపోదు
ఆ రోజు వచ్చు దాకా నా గొంతు మూగబోదు

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

26-Mar-2010

లవకుశ

గాత్రం: పి.లీల,పి.సుశీల



పల్లవి:

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

చరణం1:

చెలువు మీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

చరణం2:

రాముగని ప్రేమగొనె రావణు చెల్లి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడా మాట విని పంతము పూని
మైథిలిని కొనిపోయె మాయలు పన్ని
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

చరణం3:

రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

చరణం4:

ఆ ఆ ఆ నాథా రఘునాథా పాహి పాహి
పాహి అని అశోకవనిని శోకించే సీతా
పాహి అని అశోకవనిని శోకించే సీతా
దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

చరణం5:

దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికె
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజపైనే అనుమానమా
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత
కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా వినుడోయమ్మా

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

24-Mar-2010

దేవుళ్ళు

గాత్రం: బాలు
సాహిత్యం: జొన్నవిత్తుల




పల్లవి:

రామా ఆ ఆ ఆ ఆ ఆ రామా
అందరి బంధువయ భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
అందరి బంధువయ భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయ భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
రామా ఆ ఆ ఆ ఆ ఆ రామా ఆ ఆ ఆ ఆ ఆ

చరణం1:

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ
అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ఆ ఆ ఆ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య

అందరి బంధువయ భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య

చరణం2:

భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగ మార్చి కొలువై ఉన్న స్ధలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్ధమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్య
ఈ క్షేత్రం తీర్ధం దర్శించిన జన్మ ధన్యమయ్య

అందరి బంధువయ భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయ భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య


||

22-Mar-2010

శ్రీరామదాసు

గాత్రం: బాలు
సాహిత్యం: వేటూరి



పల్లవి:

ఓం ఓం ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకీ రాయని కధగా సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురి
అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

చరణం1:

రాం రాం రాం రాం
రామనామ జీవన నిర్మిత్రుడు పునఃదర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు

చరణం2:

సాససానిదని సానిదామగమ సాసరిదామప
త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడు
ధరణిపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పోగా
సీతాలక్ష్మణ సహితుడై
కొలువు తీరె కొండంత దేవుడు
శిలగా మళ్ళీ మలచి
శిరమును నీవే నిలచి
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరె భద్రుడు

చరణం3:

వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే
శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాత పత్ర నయనం
భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం
సౌమిత్రి యుక్తం భజే

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

20-Mar-2010

అక్కాచెల్లెలు

తారాగణం: నాగేశ్వరరావు,కృష్ణ,షావుకారు జానకి,విజయనిర్మల
గాత్రం: ఘంటసాల,పి.సుశీల
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం: సంజీవి
నిర్మాతలు: వి.బి.రాజేంద్రప్రసాద్,వి.కృష్ణప్రసాద్
సంస్థ: జగపతి ఆర్ట్స్
విడుదల: 1970




పల్లవి:

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో
తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో

చరణం1:

వచ్చే వచ్చే వానజల్లు
వచ్చే వచ్చే వానజల్లు
జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది
జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది
వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది నీ వేగమే ఇది

కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

చరణం2:

నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి
నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి
ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది
ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో

చరణం3:

మెరిసె మెరిసె రెండు కళ్లు
మెరిసె మెరిసె రెండు కళ్లు
కళ్ళు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్లులే అవి
కళ్ళు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్లులే అవి
వాకిళ్లు కావవి వలపు తేనెలూరే రసగుళ్లులే అవి సెలయేళ్లులే ఇవి

మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

18-Mar-2010

వివాహబంధం

గాత్రం:భానుమతి




పల్లవి:

విన్నావా ఆ విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా ఆ విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా

చరణం1:

తొలిచూపులు నా మదిలో తలుపు తీసెనే
తొలిచూపులు నా మదిలో తలుపు తీసెనే
పెదవులపై చిరునవ్వులు నిదురలేచేనే
పెదవులపై చిరునవ్వులు నిదురలేచేనే
విన్నావా ఆ విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా ఓ విన్నావా

చరణం2:

తలుపులన్ని వేణువులై పిలువసాగెనే
తలుపులన్ని వేణువులై పిలువసాగెనే
హృదయమే యమునానదియై కదలసాగెనే
విన్నావా ఓ విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా ఆ విన్నావా

చరణం3:

అందరాని చందమామ ముందు నిలిచెనే ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందరాని చందమామ ముందు నిలిచెనే
అణువణువున వెన్నెలెలే ఆరబోసెనే
విన్నావా ఆ విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా ఓ విన్నావా

చరణం4:

వలపులు విరజాజులుగా పరిమళించెనే
వలపులు విరజాజులుగా పరిమళించెనే
జగమే బృందావనియై సొగసులొలికెనే
విన్నావా ఓ విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా ఆ విన్నావా


||

16-Mar-2010

మా ఇంటి కథ

తారాగణం: మోహన్‌బాబు,వాణీవిశ్వనాథ్
గాత్రం: ఏసుదాసు,చిత్ర
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: మోహన్‌బాబు
విడుదల: 1990




పల్లవి:

కోయిల కోయిల కోయిలమ్మాలో
ఏ మూల ఉన్నావే కొత్తకొమ్మల్లో
కోయిల కోయిల కోయిలమ్మాలో
ఏ మూల ఉన్నావే కొత్తకొమ్మల్లో
రేపో మాపో మా ఇంటికి
పాపో బాబో వచ్చేనని విన్నావా ఓ

కోయిల కోయిల కోయిలమ్మలో
ఈ మాట చాటాలే కొండకోనల్లో
కోయిల కోయిల కోయిలమ్మలో
ఈ మాట చాటాలే కొండకోనల్లో
ఉయ్యాలూపే సందడని
ఊరూవాడా అందరిని పిలువమ్మా ఆ ఆ ఆ ఆ
కోయిల కోయిల కోయిలమ్మలో

చరణం1:

సంసారవీణ పులకించనీ
రెండు బ్రతుకుల జంట స్వరముల సంతానరాగం పలికిందని
చిట్టిపొట్టి పాదాలే జిలిబిలి పదాలై
పకపక నాదాలే అల్లిబిల్లి గీతాలై
పారాడు పాపాయిని చూసి ప్రాణాలు ఉప్పొంగనీ
ముక్కోటి దేవుళ్ళనీ వచ్చి దీవించి వెళ్ళండనీ
చెప్పమ్మా ఆ ఆ ఆ

కోయిల కోయిల కోయిలమ్మాలో
ఏ మూల ఉన్నావే కొత్తకొమ్మల్లో
కోయిల కోయిల కోయిలమ్మాలో
ఏ మూల ఉన్నావే కొత్తకొమ్మల్లో
ఉయ్యాలూపే సందడని
ఊరూవాడా అందరిని పిలువమ్మా ఆ ఆ ఆ ఆ
కోయిల కోయిల కోయిలమ్మలో

చరణం2:

నీ కలను నన్నే కనిపెంచనీ
జతకలిపిన మన మమతల
తొలిపొద్దు దీపం కనిపించనీ
నేడీ ఊయల్లో ఆడే కన్నయ్య
వచ్చే ఏడాది కాడా అన్నయ్య
ఎంతాశ దొరగారికి మోసి కంటారా ఒకసారికి
ఈ ముద్దు మురిపాలకి హద్దు ఉంటుందా ఏనాటికి
చెప్పమ్మా ఆ ఆ ఆ


కోయిల కోయిల కోయిలమ్మలో
ఈ మాట చాటాలే కొండకోనల్లో
కోయిల కోయిల కోయిలమ్మలో
ఈ మాట చాటాలే కొండకోనల్లో
ఉయ్యాలూపే సందడని
ఊరూవాడా అందరిని పిలువమ్మా ఆ ఆ ఆ ఆ
కోయిల కోయిల కోయిలమ్మలో
ఏ మూల ఉన్నావే కొత్తకొమ్మల్లో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14-Mar-2010

యువరత్న రాణా

తారాగణం: బాలకృష్ణ , హీరా
గాత్రం: బాలు,చిత్ర
సంగీతం: కోటి
దర్శకత్వం : ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణ సంస్థ : ఋగ్వేద క్రియెషన్స్
విడుదల: 1998



పల్లవి:

మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి
మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి
జానకమ్మ చెయ్యిపట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే
లక్షణాల లక్ష్మిదేవినింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే
చల్లరో చల్లరో జాజిపూల చందనాలు
మల్లె పూబంతుల మంగళాలు
మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి
మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి

చరణం1:

పుణ్యరేఖ నీవులే పుట్టినింటివారికి
తులసికోట నీదిలే మెట్టినింటి పూజకి
పేరు నిల్పవమ్మ ప్రేమ కల్పవల్లివై
ఇల్లు నిల్పవమ్మ పిల్లపాప తల్లివై
కుంకుమ పువ్వుల శోభలతో
గుండెను దాటిన ఆశలతో
కొంగుపట్టి కోరుకున్న అన్నగారి దీవెన అదే చాలుగా

చల్లరో చల్లరో జాజిపూల చందనాలు
మల్లె పూబంతుల మంగళాలు
మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి
మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి

చరణం2:

కృష్ణవేణి వాల్జడ కనకదుర్గ వేయగ
గౌతమంత చీరగా కట్టుకోవె సీతగా
వెలిగిపోగదమ్మ వెన్నెలింటి జాబిలై
మసలుకోగదమ్మ మగని తోడు నీడవై
ఊహలకందని సిగ్గులతో
ఊయల కోరిన ఉగ్గులతో
మచ్చలేని చందమామ మేనమామ పోలికై ఒడే చేరగా


మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి
మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి
జానకమ్మ చెయ్యిపట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే
లక్షణాల లక్ష్మిదేవినింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Mar-2010

ప్రేమించుకుందాం రా

తారాగణం: వెంకటేష్,అంజలా ఝవేరి
గాత్రం: బాలు,చిత్ర
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: ఎన్.మహేష్
దర్శకత్వం: జయంత్.సి.పరాంజి
నిర్మాత: డి.సురేష్‌బాబు
విడుదల: 1997




పల్లవి:

మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
చేలరేగాలి రమ్మంది హల్లో అంటు ఓళ్ళోవాళె అందాల అప్సరస
మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటు అల్లేసింది నీ మీద నా ఆశ

చరణం1:

తొలిసారి నిన్ను చూసి మనసాగక
పిలిచానే చిలకమ్మ మెల్ల మెల్లగ
తెలుగంత తీయంగ నువ్వు పలికావే స్నేహంగా
చెలిమన్న వలవేసి నను లాగగా
చేరాను నీ నీడ చల చల్లగా
గిలిగింత కలిగేలా తొలి వలపంటె తేలిసేలా
ఆ కునుకన్న మాటే నను చేరక
తిరిగాను తేలుసా ఏం తోచక

మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

చరణం2:

తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా
నిలువెల్ల పుల్లకింత చిగురించగా
దిగుల్లేదొ హయేదో గుర్తు చెరిపింది ఈ వింత
ఒక మత్తు కలిగింది గమత్తుగా
నిజం ఏదో కల ఏదో మరిపించగా
పగలేదో రేయేదో రెండు కలిసాయి నీ చెంత
ప్రేమంటె ఇంతే ఏమో మరి
దానంతు ఏదో చూస్తే సరి

మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటు అల్లేసింది నీ మీద నా ఆశ
మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

10-Mar-2010

ఉండమ్మా బొట్టు పెడతా

గాత్రం: సుశీల
సాహిత్యం: కృష్ణశాస్తి





పల్లవి:

అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది

చరణం1:

ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువనిపించాలి
ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువనిపించాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి తెరలూ పొరలూ తొలగాలి

అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది

చరణం2:

తల్లీ తండ్రీ గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం
తల్లీ తండ్రీ గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం ప్రతి పులుగు ఎగిరే దైవం

అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది

||

08-Mar-2010

ఆడదే ఆధారం

తారాగణం: విసు,చంద్రమోహన్,సీత
గాత్రం: బాలు
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: శంకర్ గణేష్
దర్శకత్వం: విసు
సంస్థ: లక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల: 1988




పల్లవి:

మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు
మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు

చరణం1:

ఆశపుడితే తీరుదాకా ఆగరు ఎలనాగలు
సహనానికి నేలతల్లిని పోలగలరు పొలతులు
అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు
అత్తగా అవతరిస్తే వారే అమ్మతల్లులు
ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు

మహిళలు మహరాణులు
మహిళలూ మహరాణులు

చరణం2:

విద్యలున్నా విత్తమున్నా ఒద్దికెరుగని వనితలు
ఒడ్డుదాటే ఉప్పెనల్లే ముప్పుకారా ముదితలు
పెద్దలను మన్నించే పద్దతే వద్దంటే
మానము మర్యాదా ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణకొద్ది కాపాడే రెప్పలే
కత్తులై పొడిచేస్తే ఆపేదింకెవరులే
వంగివున్న కొమ్మలే బంగారు బొమ్మలు

మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు
మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

06-Mar-2010

చక్రం

తారాగణం: ప్రభాస్,అసిన్,ఛార్మి
గాత్రం: శ్రీ
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: చక్రి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: సి.వెంకటరాజు,జి.శివరాజు
సంస్థ: గీతాచిత్ర ఇంటర్నేషనల్స్
విడుదల: 2005




పల్లవి:

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం1:

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవతరం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని
కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం2:

మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం3:

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

04-Mar-2010

బొమ్మరిల్లు

గాత్రం: మురళి,నవీన్,ప్రియ ప్రకాష్
సాహిత్యం: కులశేఖర్




పల్లవి:

లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ
యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా
ఇటలీ ఇంగ్లాండ్ ఐనా మన హిందు దేశమైనా
ఈ ప్రేమ గాధలొకటే ఊరు వాడ లేవైనా
గోవిందా గోవిందా ఏమైనా బాగుందా
ప్రేమిస్తే పెద్దోల్లంతా తప్పులెంచుతారా
గోపాలా గోపాలా ఏందయ్యో ఈ గోల
ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా
ఐతే ఇప్పుడు ఎంటి అంటార్రా
Love makes life beautiful
Love makes life beautiful
హే లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ
యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా

చరణం1:

కన్ననాడు అడిగామా పెంచడానికడిగామా
గోరుముద్దలు పాల బువ్వలు అడిగి పెట్టినామా
మేము కాదు అన్నామా వేలు ఎత్తి చూపామా
కమ్మనైనని కన్న ప్రేమలో వంకలెదుకుతామా
అంత గౌరవం మాపై వుంటే ఎందుకింత డ్రామా
ప్రేమ మత్తులో కన్న బిడ్డకే మేము గుర్తురామా
పాతికేళ్ళిలా పెంచారంటూ తాళి కట్టి పోమా
వంద ఏళ్ళ మా జీవితాలకే శిక్ష వేసుకోమా

అందుకే Love makes life beautiful
Love makes life beautiful
హేయ్ లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ
యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా

ఉం ఆ ఆ ఆ
వేణుగానలోలా వేగమున రారా
నిలిచెను ఈ రాధ నీకోసమే
వెన్న దొంగ రారా ఆలకించవేరా
పలికెను నోరారా నీ నామమే
పొన్న చెట్టు నీడలోన కన్నె రాధ వేచి వుంది
కన్నె రాధ గుండె లోన చిన్ని ఆశ దాగి వుంది
చిన్ని ఆశ దాగి వుంది

చరణం2:

అరె అరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు
ఈడు వేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు
లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకరేస్తారు
ప్రేమ జంటని పెద్ద మనసుతో మీరు మెచ్చుకోరు
ఎంత చెప్పినా మొండి వైఖరి అసలు మార్చుకోరు
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు
కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము
రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము

Love makes life beautiful
Love makes life beautiful

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

02-Mar-2010

మగధీర

గాత్రం: కీరవాణి,నికిత నిగం
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడ రాదు నిద్దుర
నియమాలు వీడి రాణివాసం ఏలుకొర ఏకవీర ధీరా
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొరా

చరణం1:

సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా
అధిపతినై అదికాస్తా దోచేదా
కోరికైన ప్రేమకైన దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ వుందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకొర ఇంద్రపుత్ర

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొరా
సువరాహియా అ అ అ
సువరాహియా అ అ అ
సువరాహియా అ అ అ
సువరాహియా అ అ అ

చరణం2:

శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడగా
మగసిరితో అందమే అంటు తడిపే అంతేగా
అణువణువు స్వర్గమే అయిపొదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా
చెరసాలలోన ఖైదుకాని కాంక్ష మనదిగా
శత జన్మలైన ఆగిపొని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నన్ను చేరుకుందిరా
గుండెలోని నగార ఇక మోగుతోన్దిరా
నవ సొయగాలు చూడ చూడ రాదు నిద్దుర
ప్రియ పూజలేవో చేసుకొన చేతులార సేదతీర

ధీర ధీర ధీర
ధీర ధీర ధీర

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~