29-Apr-2010

నేటి భారతం

తారాగణం :సుమన్,విజయశాంతి
గాత్రం:జానకి
సాహిత్యం:శ్రీ శ్రీ
సంగీతం:చక్రవర్తి
దర్శకత్వం :టి.కృష్ణ
నిర్మాత:పోకూరి బాబురావు
సంస్థ: ఈతరం పిక్చర్స్
విడుదల:1983




పల్లవి:

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం
స్వాగతం స్వాగతం
బ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం
స్వాగతం
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

చరణం1:

కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితంలో
వెలుగులను ప్రసరింపచేసిన కాంతిమూర్తి స్వాగతం
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

చరణం2:

అంతు తెలియని వేతనలతో అలమటించే ఆర్తజనులకు
కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలి
స్నేహశీలి స్వాగతం
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

చరణం3:

పనికిరారని పారవేసిన మోడువారిన జీవితాలకు
చిగురుటాశల దారి చూపిన మార్గదర్శి స్వాగతం
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం
స్వాగతం స్వాగతం
బ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం
స్వాగతం

||

27-Apr-2010

నువ్వు నేను ప్రేమ

సాహిత్యం: వేటూరి
గాత్రం: ఏ.ఆర్.రెహ్మాన్





పల్లవి:

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలి ఓ తుంటరి
రెక్కలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వె
తరిమే క్షణములో ఉరిమే వలపులో

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలి ఓ తుంటరి
రెక్కలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వె
తరిమే క్షణములో తరిమే క్షణములో
ఉరిమే వలపులో

చరణం1:

మాటలతో జోలాలి పాడినా ఉయ్యాల పట్టలేవాయే
దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీ నువు తేవాయే
వింత వింతగ నడక తీసిన నాడు కల నువు రావాయే
మనసులో ఉన్న కలవరం తీర్చ నువ్విక్కడ లేవాయే
నేను ఇచట నీవు అచట ఈ తపనలో క్షణములు యుగములయిన వేళ
నింగిచట నీలమచట ఇరువురికిది మధుర బాధయేగా

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలి ఓ తుంటరి

చరణం2:

తెలిసి తెలియక నూరుసార్లు ప్రతి రోజు నిను తలచు ప్రేమ
తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో ఉంది తేనేనా
జిల్ల్ అంటు భూమి ఏదో జత కలిసిన చలి కాలం సెగలు రేపెనమ్మ
నా జంటై నీవు వస్తే సంద్రాన ఉన్న అగ్గిమంట మంచు రూపమే

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలి ఓ తుంటరి
రెక్కలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వె
తరిమే క్షణములో తరిమే క్షణములో
ఉరిమే వలపులో


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25-Apr-2010

భార్యాబిడ్డలు

తారాగణం: నాగేశ్వరరావు,జయలలిత,కృష్ణకుమారి
గాత్రం: సుశీల
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఎ.వి. సుబ్బారావు
సంస్థ:ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల: 1972



పల్లవి:

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు
నీవు లేక దిక్కులేని చుక్కలైనాము
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు
నీవు లేక దిక్కులేని చుక్కలైనాము

చరణం1:

మొన్న పున్నమి రాతిరి నీ ఒడిని నిద్దురపోతిమి
మొన్న పున్నమి రాతిరి నీ ఒడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యాము
గొల్లుమన్నాము
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు
నీవు లేక దిక్కులేని చుక్కలైనాము

చరణం2:

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నాము
వెతుకుతున్నాము
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు
నీవు లేక దిక్కులేని చుక్కలైనాము

చరణం3:

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువైనావో
రాలేకవున్నావో
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు
నీవు లేక దిక్కులేని చుక్కలైనాము

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23-Apr-2010

రావణుడే రాముడైతే

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు,మురళీమోహన్,జయచిత్ర,లత
గాత్రం: బాలు,జానకి
సాహిత్యం: వేటూరి
సంగీతం: జి.కె.వెంకటేష్
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంస్థ: లక్ష్మి ఫిల్మ్స్ కంబైన్స్
విడుదల: 1979




పల్లవి:

రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో

చరణం1:

ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఎ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ పాటనే పాడనీ
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో

చరణం2:

ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదలాడనీ పాడనీ

రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ఆ ఆ ఆ
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

21-Apr-2010

శ్రీరామదాసు

గాత్రం: సునీత
సాహిత్యం: భారవి



పల్లవి:

తండ్రిమాటను నిలుపగా
రాముండు అడవులకు పయనమయ్యే
నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే
ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అనె రాముడు
నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత


~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

19-Apr-2010

లక్ష్యం

తారాగణం: గోపిచంద్,జగపతిబాబు,అనుష్క,కళ్యాణి
గాత్రం: మధు బాలకృష్ణ
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి)
విడుదల: 2007




పల్లవి:

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా
అలుపే రాని కేరింతలో తను మురిసీ
మరుపే లేని ఈ మమతలో రుచి తెలిసీ
మన రాగాలలో అనురగాలలో తను కూడా
మనలాగే మురిసీ
గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా

చరణం 1:

ఇందరుండడగా ఇరుకైన ఇంటిలో
కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా
కాంతులుండగా ప్రతి వారి కంటిలో
ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా
సెలవులు లేని సంతోషం
అలకలు ఉన్నా అరనిమిషం
ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా

చరణం 2:

అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి
ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి
అన్న గోపురం వదినమ్మ గుమ్మమై
ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి
మనసే ఉన్నా మా ఇల్లు
మమకారాల దోసిళ్ళు
లేవంట ఏ తిధులు లోకాలే అతిధులు

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17-Apr-2010

భలే అమ్మాయిలు

గాత్రం: జిక్కి




పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ బంగరు చిలుకా అహ ఎందుకె అలుకా
ఇలా చూడవు మాటాడవు మోమాటమా
ఒహొ బంగరు చిలుకా అహ ఎందుకె అలుకా
ఇలా చూడవు మాటాడవు మోమాటమా
ఒహొ బంగరు చిలుకా

చరణం1:

చెరువు మీద అలకైతే చెడేదెవ్వరు
పలహారం మాని భాదపడేదెవ్వరు
చెరువు మీద అలకైతే చెడేదెవ్వరు
పలహారం మాని భాదపడేదెవ్వరు
చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా
చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా
ఒకమాటకు వరహాలు ఒలికిపోవునా
వరాలొలికిపోవునా

ఒహొ బంగరు చిలుకా అహ ఎందుకె అలుకా
ఇలా చూడవు మాటాడవు మోమాటమా
ఒహొ బంగరు చిలుకా

చరణం2:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కనికారం లేదా కళ్ళెదుట నిలచినా
అనురాగం రాదా నోరార పిలచినా
కనికారం లేదా కళ్ళెదుట నిలచినా
అనురాగం రాదా నోరార పిలచినా
చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా
ఒకమాటకు వరహాలు ఒలికిపోవునా
వరాలొలికిపోవునా

ఒహొ బంగరు చిలుకా అహ ఎందుకె అలుకా
ఇలా చూడవు మాటాడవు మోమాటమా
ఒహొ బంగరు చిలుకా అహ ఎందుకె అలుకా

||

15-Apr-2010

ఖైది నెంబర్ 786

తారాగణం: చిరంజీవి,భానుప్రియ
గాత్రం: బాలు,జానకి
సాహిత్యం: భువనచంద్ర
సంగీతం: రాజ్-కోటి
దర్శకత్వం: విజయబాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల: 1988







పల్లవి:

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మోగిందిలే వీణపాట
ఆడుకోవాలీ గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మోగిందిలే వీణపాట హా ఆ ఆ

చరణం1:

జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యొ పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిటూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు
చుట్టుకుంటాను సుడిగాలిలా

హొయ్ గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మోగిందిలే వీణపాట హొయ్ హొయ్

చరణం2:

కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందమూ ఉందే నీకోసం
తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం
కొంచమాగాలిలే కొర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వమూ

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మోగిందిలే వీణపాట
ఆడుకోవాలీ గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13-Apr-2010

బొమ్మరిల్లు

గాత్రం: సిద్ధార్థ్




పల్లవి:

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసినీ
మదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీ
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

చరణం1:

తీపికన్నా ఇంకా తీయనైన
తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన
చోటే ఏమిటంటే నువు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే
నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

చరణం2:

నన్ను నేనే చాలా తిట్టుకుంటా
నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా
ఏదో చిన్నమాటే నువ్వు నాతో మాటాడావంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11-Apr-2010

సారంగధర

తారాగణం: రామారావు,భానుమతి,ఎస్వీ.రంగారావు
గాత్రం: భానుమతి
సాహిత్యం: సముద్రాల
సంగీతం: ఘంటసాల
దర్శకత్వం: వి.ఎస్.రాఘవన్
నిర్మాత: టి.నామదేవరెడ్డి
సంస్థ: మినర్వా పిక్చర్స్
విడుదల:1957




పల్లవి:

అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు
అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు

చరణం1:

మదిలో మెదిలే దేవుడే
కనుపించెను కన్నులకే
మదిలో మెదిలే దేవుడే
కనుపించెను కన్నులకే
వ్రతము ఫలించె బ్రతుకు తరించె
వ్రతము ఫలించె బ్రతుకు తరించె
వరుడరుదెంచెనుగా

అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు

చరణం2:

నీ రూపురేఖ నీ నవయవ్వన శోభ ఆ ఆ ఆ ఆ
సఫలమయే శుభవేళ
సమకూరెనుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు

చరణం3:

నీ చెలికానుని దొచుకొనేనని
అలుగకుమా పావురమా
నీ చెలికానుని దొచుకొనేనని
అలుగకుమా పావురమా
నీ ఉపకృతికి బహుకృతిగా
గైకొనుమా నా ప్రేమ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు

||

09-Apr-2010

శత్రువు

గాత్రం:బాలు,చిత్ర



పల్లవి:

పొద్దున్నే పుట్టింది చందమామ,మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంలో పుట్టవా గీతికా హొయ్
స్నేహంలో మీటావా మెల్లగా
తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దురలేచి
ముత్యాల ముగ్గులు పెట్టె వన్నెల వాకిట్లో
పొద్దున్నే పుట్టింది చందమామ,మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

చరణం1:

బుగ్గెట్టా పట్టాలో,నలుగెట్టా పెట్టాలో
లాలెట్టా పోయెలోయమ్మ ఓ రబ్బరుబొమ్మ
లాలించేదెట్టా చెప్పమ్మ
మొగ్గంటి బుగ్గల్లో,అగ్గల్లే న్సిగ్గొస్తే
జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దులకన్నా
కౌగిట్లో జోకొట్టాలయ్య
నాకంటిపాపల్లో ఉయ్యాల వెయ్యాల ఈ కొంటె పాపాయికి
ముందుమునుపులేని ఈ పొద్దిటి వెన్నెల ఆవిరిలో
ముద్దుమురిపాలన్ని పండించేదెట్టాగఓ
ఇక ఏ పేరుపెట్టాలో ఇన్నాళ్ళు ఎరుగని ఈ కొంటె చెక్కిలిగింతల ఉక్కిరిబిక్కిర్కి
పొద్దున్నే పుట్టింది చందమామ,మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

చరణం2:

నీకోసం పుట్టాను,నిలువెల్లా పూచాను గుండెల్లో గూడే కట్టాను
నా బంగరుగువ్వ గుమ్మంలో చూపులు కట్టాను
నీ నేస్తం కట్టాను,నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను
నా పచ్చని కొమ్మ పొమ్మన్నా పక్కకు పోలేను
శృంగార స్నేహాల సంకెళ్ళు వేయాలా సింగారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకుదుడుకు తగ్గించి కొంగున కట్టేసేసె కిటుకేదో చెప్పమ్మా
అది పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదో,రేయేదో తెలియదు లేవయ్యో

పొద్దున్నే పుట్టింది చందమామ,మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంలో పుట్టవా గీతికా హొయ్
స్నేహంలో మీటావా మెల్లగా
తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దురలేచి
ముత్యాల ముగ్గులు పెట్టె వన్నెల వాకిట్లో


||

07-Apr-2010

పెళ్ళినాటి ప్రమాణాలు

తారాగణం :అక్కినేని నాగేశ్వరరావు,జమున,యస్వీ.రంగారావు
గాత్రం;ఘంటసాల,పి.లీల
సంగీతం: ఘంటసాల
దర్శకత్వం :కె.వి.రెడ్డి
సంస్థ:జయంత్ పిక్చర్స్
విడుదల: 1958



పల్లవి:

వెన్నెలలోనే వేడి ఏలనో,వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో,విరహములోనే హాయి ఏలనో
ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి

చరణం1:

మొన్నటికన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా...ఒహొహొహొ
మొన్నటికన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా
నీ సొగసూ నీ వగలూ హాయిహాయిగా వెలసేనే
వెన్నెలలోనే వేడి ఏలనో,వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి

చరణం2:

రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా..ఒహొహొహొ
రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా
నీ కళలూ నీ హొయలూ చల్లచల్లగా విరిసేనే
వెన్నెలలోనే హాయి ఏలనో, వెన్నెలలోనే విరహమేలనో
ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

||

05-Apr-2010

శ్రీరామదాసు

సాహిత్యం: రామదాసు



రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
చారుకుంకుమోపేత చందనానుచర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం
విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్తకామితాయ శుభదమంగళం
రామదాస మృదులహృదయ తామరసనివాసాయ
స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం
దివ్యమంగళం దివ్యమంగళం

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~

03-Apr-2010

గుడి గంటలు

గాత్రం: ఘంటసాల
సాహిత్యం: అనిసెట్టి





పల్లవి:

జన్మమెత్తితిరా అనుభవించితిరా
జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
మంచి తెలిసి మానవుడుగా మారినానురా
జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా

చరణం1:

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవ శక్తి మృగత్వమునే సంహరించెరా
దైవ శక్తి మృగత్వమునే సంహరించెరా
సమర భూమి నా హృదయం శాంతి పొందెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా

చరణం2:

క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసె దివ్య మందిరముగా మారిపోయెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా

చరణం3:

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా
మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడిగంటలె ప్రతిధ్వనించురా
ప్రతి గుండెలో గుడిగంటలె ప్రతిధ్వనించురా
ఆ దివ్య స్వరం న్యాయ పధం చూపగలుగురా

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా


||

01-Apr-2010

ప్రాణం

తారాగణం: నరేష్,సదా
గాత్రం: సోనూ నిగం,,మహలక్ష్మి అయ్యర్
సాహిత్యం: సాయి శ్రీహర్ష
సంగీతం: కమలాకర్
దర్శకత్వం: మల్లి
విడుదల: 2003





పల్లవి:

నేల తల్లి సాక్షిగా...నేల తల్లి సాక్షిగా
నింగి తండ్రి సాక్షిగా...నింగి తండ్రి సాక్షిగా
గాలిదేవర సాక్షిగా...గాలిదేవర సాక్షిగా
అగ్ని దేవుని సాక్షిగా...అగ్ని దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతలు చెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం

చరణం1:

చందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు పుచ్చపూల పున్నమేనులే ఓ ఓ ఓ
రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో
రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు
ఆ దిక్కులే మన ఆస్తులు
సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్కనీ సుట్టి వద్దమా

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు చెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే

చరణం2:

వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే
రాశి లేదు వాసి లేదు తిథులు లేవులే ఓ ఓ ఓ
అథిధులంటు లేరులే మనకు మనమే సాలులే
మాసిపోని బాసలన్ని బాసికాలులే
ఏ ఏలుపు దిగి రాదులే
మన కూడికే మన తోడులే
ఇసుక దోసిలే తలంబ్రాలుగా
తలలు నింపగా మనువు జరిగెలే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~