Feb 14, 2011

చెలి నా గుండెలో ఉండిపోవే

గాత్రం: రాజ్ కుమార్
సాహిత్యం: సాగర్
సంగీతం: సాకేత్



పల్లవి:

చెలి నా గుండెలో ఉండిపోవే
చైత్ర గీతానివై మేలుకోవే
చెలి నా గుండెలో ఉండిపోవే
చైత్ర గీతానివై మేలుకోవే
నువ్వే నా దానివే వేదానివే
నవ్వే గోదారివే నా దారివే
ప్రాణానివే గానానివే
నా కోటలో రారాణివే
చెలి నా గుండెలో ఉండిపోవే
చైత్ర గీతానివై మేలుకోవే

చరణం1:

లేత చిరుగాలివే స్వాతిముత్యానివే
వేణుగానానివే పైన జాబిల్లివే
నమ్మవే నా చెలి అన్న హృదివేదన
గానమై సాగెనే ప్రేమ అభినందన
నువ్వు కావాలి రావాలి ఓ నేస్తమా
నీతో ఆడాలి పాడాలి నా ప్రియతమా
ప్రేమ నీవేలే నాలోని రాగానివే
ప్రేమ నీవేలే నా గుండె నాదానివే
చెలి నా గుండెలో ఉండిపోవే
చైత్ర గీతానివై మేలుకోవే

చరణం2:

వేల భావాలని నీకు తెలపాలని
గుండెలో భాషని విన్నవించాలని
ఎందుకో మనసులో ఇంత ఈ యాతన
నిన్ను చేరేదెలా చెప్పవే నా చెలి
నిన్ను చేరేటి దారేది ఓ కోయిలా
నిన్ను చూడాలి పాడాలి ప్రతిరోజిలా
అందుకే నీవు కావాలి ఓ అందమా
అందుకో ప్రేమ రాగాలు ప్రియబంధమా

చెలి నా గుండెలో ఉండిపోవే
చైత్ర గీతానివై మేలుకోవే
నువ్వే నా దానివే వేదానివే
నవ్వే గోదారివే నా దారివే
ప్రాణానివే గానానివే
నా కోటలో రారాణివే
చెలి నా గుండెలో ఉండిపోవే
చైత్ర గీతానివై మేలుకోవే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: