Mar 14, 2011

బొమ్మల పెళ్ళి

తారాగణం: శివాజి గణేషన్, నాగయ్య, జమున, శాంతకుమారి
గాత్రం: పి.బి.శ్రీనివాస్, జిక్కి
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం: ఆర్.ఎం.కృష్ణస్వామి
సంస్థ: అరుణ ఫిలింస్
విడుదల: 1958




పల్లవి:

హాయిగా తీయగా,హాయిగా తీయగా
అనురాగం పండగా,ఆనందం నిండగా
అనురాగం పండగా,ఆనందం నిండగా
చేదామీ కాపురము చెలిమిపొంగు ఇల్లుగా
హాయిగా తీయగా,హాయిగా తీయగా

చరణం1:

ఈ కన్నులందు వెన్నెల ఉన్నరోజు పున్నమి
చిన్నెలన్ని వెన్నెలై పూయని
చక్కనైన నావకు చుక్కాని నీవుగా
అలలపై కలలపై కలకాలం సాగనీ
అలలపై కలలపై కలకాలం సాగనీ
చేదామీ కాపురము చెలిమిపొంగు ఇల్లుగా
హాయిగా తీయగా,హాయిగా తీయగా

చరణం2:

నువ్వు నేను పువ్వులై, పువ్వులలో నవ్వులై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నువ్వు నేను పువ్వులై, పువ్వులలో నవ్వులై
సరాగాల తోటలో పరాగాల బాటలో
సరాగాల తోటలో పరాగాల బాటలో
చేదామీ కాపురము చెలిమిపొంగు ఇల్లుగా
హాయిగా తీయగా,హాయిగా తీయగా

చరణం3:

పెనవేసిన మాలతి నీవై
మనసంతా చిగురించిన మావివి నీవై
మనకుందే అందమై,కనువిందై ఉందని
ఈడుగా జోడుగా వెలుగునీడ జాడగా
ఈడుగా జోడుగా వెలుగునీడ జాడగా
చేదామీ కాపురము చెలిమిపొంగు ఇల్లుగా
హాయిగా తీయగా,హాయిగా తీయగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: