
పల్లవి:
ఉప్పొంగిపోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
ఉప్పొంగిపోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
కొండల్లో ఉరికింది గోదావరి
తానె కోనల్లో నిండింది గోదావరి
కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది
ఆకాశగంగతో హస్తాలు కలిపింది
ఉప్పొంగిపోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
చరణం1:
మడులలో సుడులలో గరువాల నడలలో
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది
అడవి చెట్లని నీలి జెడలోన తురిమింది
పూల దండలు గుచ్చి మెళ్ళోన దాల్చింది
ఉప్పొంగిపోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment