Jul 6, 2011

సంసారం సాగరం

తారాగణం: ఎస్.వి.రంగారావు, సత్యనారాయణ, శుభ, జయంతి
గాత్రం: బాలు, కోవెల శాంత
సంగీతం: రమేష్‌నాయుడు
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కె. రాఘవ
సంస్థ: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల: 1973



పల్లవి:

ఇంటికి దీపం ఇల్లాలు
ఆ దీపకాంతుల కిరణాలే పిల్లలు పిల్లలు
ఇంటికి దీపం ఇల్లాలు

చరణం1:

ఒకటి ఒకటి రెండు
నింగి నేల రెండు
పగలు రేయి రెండు
కంటి రెప్పలు రెండు
ఇంటికి ఇద్దరు నిండు
ఆ ఇంటికి దీపం ఇల్లాలు
ఆ దీపకాంతుల కిరణాలే పిల్లలు పిల్లలు
ఇంటికి దీపం ఇల్లాలు

చరణం2:

ఎదిగే పిల్లల కదిలే పెదవులు
ఎదలో ఆశలు చిలకాలి
ఎదిగే పిల్లల కదిలే పెదవులు
ఎదలో ఆశలు చిలకాలి
ఆశల బడిలో అ ఆలు నేర్చి
ఆశయాల గుడి కట్టాలి
ఇంటి పేరు నిలబెట్టాలి
ఆ ఇంటికి దీపం ఇల్లాలు
ఆ దీపకాంతుల కిరణాలే పిల్లలు పిల్లలు
ఇంటికి దీపం ఇల్లాలు

చరణం3:

ఆలుమగల అనురాగం ఆనందానికి ప్రతిరూపం
ఆనందం నిండిన ఈ బ్రతుకే
కలకాలమిలా నిలవాలి
ఇల్లే స్వర్గం కావాలి
ఆ ఇంటికి దీపం ఇల్లాలు
ఆ దీపకాంతుల కిరణాలే పిల్లలు పిల్లలు
ఇంటికి దీపం ఇల్లాలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: