శుద్దబ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
ప్రియ గుహ వినివేదిత పద రామా
శబరీ దత్త ఫలాశన రామా
ప్రియ గుహ వినివేదిత పద రామా
శబరీ దత్త ఫలాశన రామా
హనుమత్సేవిత నిజపద రామా
సీతా ప్రాణాధారక రామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే
మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే
చరణం1:
నన్నే నీవు అమ్మ అన్న నాడు
మీ నాన్న మనసు గంతులువేసి ఆడు
నన్నే నీవు అమ్మ అన్న నాడు
మీ నాన్న మనసు గంతులువేసి ఆడు
మంచికాలం మరలా రాగా ముళ్ళబాటే పూలతోట
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే
మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే
చరణం2:
గూటిలోని పావురాలు మూడు
అవి గొంతు కలిపి తీయని పాట పాడు
గూటిలోని పావురాలు మూడు
అవి గొంతు కలిపి తీయని పాట పాడు
మంచుతెరలు తొలగీపోయి పండువెన్నెల కాయునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
తడిసి పోతున్నా,తడిసి పోతున్నా
చరణం1:
శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చునుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే
జాడ ఐనా తెలియదేమే
ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం
ఎందుకమ్మా నీకీ మౌనం
తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా ఆ ఆ ఆ ఆ ఆ
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చరణం2:
గుండెలోన వలపు గాయం
మంటరేపే పిదప కాలం
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం
భారమైన బతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా
కలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి చేరవా నేస్తమా ఆ ఆ ఆ ఆ ఆ
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
ప్రియతమా ఏ ఏ ఏ
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
వెన్నదొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
చరణం1:
నీలాల నింగి కింద తేలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమనిచాడు నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా అట అర్జునుడొందెను నీ దయ వల్ల గీతోపదేశం జగతికిసైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లే రాగం తానం రాజీవుడే
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
చరణం2:
మత్స్యమల్లే నీటిన తేలి వేదములను కాచి కూర్మ రూప ధారివి నీవై భువిని మోసినావే వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు ఇక నీ అవతారాలన్నెనున్న ఆధారం నేనే నీ ఒరవడి పట్ట ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే మదిలోని ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
అరెరె వాన జడివాన అందాల నవ్వులే పూల వాన అరెరె వాన జడివాన అందాల నవ్వులే పూల వాన మళ్లీ మళ్లీ వానొస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది నెమలికన్నెలాగ చెలి నాట్యమాడుతుంటే ఎదే పాలపుంతై నా మనసునాడమంది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది అరెరె వాన జడివాన అందాల నవ్వులే పూల వాన
చరణం1:
ఆటా పాటా ఓ పాడని పాట వానే పాడింది అరుదైన పాట నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు మంత్రంలాగ ఉంది ఇది తంత్రంలాగ ఉంది చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతోంది దేవత ఏది నా దేవత ఏది తను సంతోషంగా ఆడుతు ఉంది
చరణం2:
నిన్ను మించి వేరెవరూ లేరే నన్ను మించి నీకెవరూ లేరే చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట కళ్లు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట మల్లెపూల పొద్దు నాకు ఇచ్చిపోవె ముద్దు ముద్దుచాటు సద్దు చెరిపేయమంది హద్దు పులకించింది ఎద పులకించింది చెలి అందాలనే చిలికించింది
అరెరె వాన జడివాన అందాల నవ్వులే అగ్గి వాన అరెరె వాన జడివాన అందాల నవ్వులే అగ్గి వాన మళ్లీ మళ్లీ వానొస్తే పగటి వేళ మెరుపొస్తే నింగే వంగింది భూమే పొంగింది నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది గొడుగు పట్టి ఎవరూ ఈ వాననాపవద్దు అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు ఆడాలి ఆడాలి వానతో ఆడాలి
గాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళూంచానయ్యో నీకోసం నా అందం చందం అంతా నీకోసం తోడే లేదనీ కాలే కౌగిలి ఎప్పటి నుంచీ ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం
జారే పైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీ రూపం ఏనాడు లేనేలేదు ఈ మైకం నాలో శ్వాసకీ రేగే ఆశకీ దాహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానే రాదు ఈ లోకం నీ జతే చేరితే మామమయ్యే నాలో మౌనం రాగమై సాగెనే అంతులేని ఆనందం
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
చరణం1:
పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు తారల్లో మిణుకులన్ని దోసిల్లో నింపావు మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్ని ఏ జన్మలోనైన నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
చరణం2:
సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపేస్తున్న అలుపెరుగని హృదయ లయలని ఏ చోట నువ్వునా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా
తారాగణం: నాగేశ్వరరావు,రాజసులోచన,ఇ.వి.సరోజ గాత్రం: ఘంటసాల, సుశీల సాహిత్యం: దాశరథి సంగీతం: ఎస్.రాజేశ్వరరావు దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు నిర్మాత: డి.మధుసూదనరావు సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్ విడుదల: 1961
పల్లవి:
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా
ఓ మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా నింగి దాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేదిందుకే నిషా కనులవాడా
చరణం1:
ఓ ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో నే వెళితే మరి నీవు మజ్నూవవుతావు నే వెళితే మరి నీవు మజ్నూవవుతావు మజ్నూ నేనేతై ఓ లైలా లోకమే చీకటైపోవునే మజ్నూ నేనేతై ఓ లైలా లోకమే చీకటైపోవునే ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే నిషా కనులవాడా
చరణం2:
ఓ ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందుమా నేడే నీలినీలి మేఘాల రథముపై తేలిపోదుమీనాడే చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా నేను వీణనై నీవు నాదమై ఏకమవుదమా తీయగా ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే హమేషా మజాగా
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవుల్నేం చేస్తారు ఆ యమ కింకరులు
చరణం1:
నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మోగదులే ప్రభువు ఆనతికి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవడులే రాజ్యలక్ష్మి నాధుడు శ్రీనివాసుడే శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణుదాసుడే దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే రాజలకు రాజు ఈ రంగరాజనే
చరణం2:
నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంటా దైవం కొసం పోరే సమయం లేదంటా
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
మైనా మైనా గుండెల్లోన గూడు కడితివే
మైనా మైనా మనసే దోచి మంట పెడితివే
చెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దే
చూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే
ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా
నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా
నువులేక ఉండనే లేను నాకోసం వస్తావా
మైనా మైనా
చరణం1:
నిన్ను చూసి పిచ్చివాన్నైపోయా
ప్రేమలోన ఉంది ఏదో మాయ
ఆశే నువ్వంటా గుండె శ్వాసే నువ్వంటా
ఆడుకున్నా ఆట పాడుకున్నా పాట
కళ్ళే పాడే వేళ చూపై పొయె మాట
అదిరే నీ పెదవుల నవ్వైపోనా
అరరే నీ కొంగుని నేనైపోనా
వెంట వచ్చు తోడు నేను కానా
వీడలేని నీడ లాగా రానా
నీతో ఉంటానే నీ మాటే వింటానే
మైనా పేరు వింటే ఝల్లంటోంది ప్రాణం
నువ్వే జంట లేక మాటే నాకు మౌనం
చెలియా నీకోసం మేలుకునుంటా
కలవై నువ్వొస్తే నిదురే పోతా
మైనా మైనా గుండెల్లోన గూడు కడితివే
మైనా మైనా మనసే దోచి మంట పెడితివే
చెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దే
చూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే
ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా
నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా
నువులేక ఉండనే లేను నాకోసం వస్తావా
మైనా మైనా
ఎక్కడున్నావమ్మ ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మ నీ చిరునామా దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో ఎప్పుడు ఎదురొస్తావో నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పిచుక సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకురి సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి సాన సుబ్బలక్ష్మి కోడూరి ఎక్కడున్నావమ్మ ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మ నీ చిరునామా
చరణం1:
అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో రూపు రేఖలొకటే తెలుసు ఊరు వాడ ఏమిటో మాట మధురిమొకటే తెలుసు ఫొను నెంబెర్ ఏమిటో అక్కడి చిలకను అడిగితే నువ్వు సప్తసముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లిష్ చిలకా నీ ఆచూకి తెలుపగ లేకుందే ఎవరిని అడగాలి ఎలా నిన్ను చేరాలి సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోన సుబ్బలక్ష్మి నండూరి
ఎక్కడున్నావమ్మ ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మ నీ చిరునామా
చరణం2:
ఫస్ట్ టైం డయలు చెయ్యగా అష్టలక్ష్మి పలికెరా రెండో సారి రింగు చెయ్యగా రాజ్యలక్ష్మి దొరికెరా మరో మారు ట్రైలు వెయ్యగా మహలక్ష్మి నవ్వెరా సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టెరా ఎదురు దెబ్బలే తగిలినా నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టరినవుతాలే కరిమబ్బులెన్ని నన్ను కమ్మినా నా నెచ్చెలి నింగికి నిచ్చెన వేసి చేరువవుతాలె నమ్మకముందమ్మ నిను కలుపును నా ప్రేమ