Sep 9, 2011

ప్రేమ ఖైది

తారాగణం: విదార్థ్,అమల పౌల్
గాత్రం: బెన్ని, శ్రేయా ఘోషల్
సంగీతం: ఇమాన్
నిర్మాతలు: బి.సుబ్రహ్మణ్యం, వై.రూపేష్
దర్శకత్వం: ప్రభు సాల్మన్
సంస్థ: లక్ష్మిగణపతి ఫిలింస్
విడుదల: 2011



పల్లవి:

నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి
గువ్వల్లాగా గూడే కట్టి నవ్వుతు బతకాలి
నీతో నన్ను నీడలాగ సాగిపోనీ
నీలో ఎన్ని జన్మలైన ఉండిపోనీ
ఈ లోకమే తలుపులు తెరిచెను మనకోసం
ఆ దైవమే వరముగా ఇచ్చెను సంతోషం
పండగంటి జీవితమే మనకిక మధుమాసం
ఓ ఓ నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి
హే ఏ గువ్వల్లాగా గూడే కట్టి నవ్వుతు బతకాలి

చరణం1:

మనమనుకున్నదంతా జరిగింది
ఇక తీరని కోరికేది
మన కోర్కెలు తీర్చిన ఈ బతుకే
ఎన్నో జన్మలు కావాలి
ఈ ఆశ తీరుతుంది
ఆ రోజు ముందరుంది
ఆ ఆకాశమే మనకందేనంట
ఆనందాలే చిందేనంట

ఓ ఓ నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి
ఓ ఓ నువ్వు నేను

చరణం2:

అరె కూటికి లేని జీవితమే నేడు కోటికి చేరినది
ఈ భూమిని కూడా బంతాడే ఆ రహస్యం తెలిసినది
హే ఏ కలిసి వచ్చె కలిమి
అది ప్రేమకున్న బలిమి
ఇక ఆ చుక్కలే నీ సిగపూలుగా
తెచ్చి ఇస్తాను చూడే పిల్లా

నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి
గువ్వల్లాగా గూడే కట్టి నవ్వుతు బతకాలి
ఈ లోకమే తలుపులు తెరిచెను మనకోసం
ఆ దైవమే వరముగా ఇచ్చెను సంతోషం
ఓ ఓ పండగంటి జీవితమే మనకిక మధుమాసం
నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: