గాత్రం: జేసుదాసు
సాహిత్యం: డి.నారాయణవర్మ
సంగీతం: మాధవపెద్ది సురేష్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: ఆర్.సీతారామరాజు
సంస్థ: పవన పుత్ర ప్రొడక్షన్స్
విడుదల: 1999

పల్లవి:
ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష
ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష
శార్దూల వాహనుడు మణికంట మోహనుడు కరుణించి కావగా దీక్ష
నియమాల మాలతో దీక్ష
ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష
చరణం1:
కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష
కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష
శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలము పూజల దీక్ష
ఓ ధర్మశాస్త ఓ అభయహస్త ఇహపరము తరియించు ముక్తిఫల దీక్ష
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
చరణం2:
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర
పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా కోట్లాది పాదముల యాత్ర
పంబ నది యాత్ర పరమాత్మ యాత్ర ఇరుములను బాపగా ఇరుముడుల యాత్ర
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష
శార్దూల వాహనుడు మణికంట మోహనుడు కరుణించి కావగా దీక్ష
నియమాల మాలతో దీక్ష
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment