29-Jun-2011

శ్రీరామదాసు

గాత్రం: బాలు
సాహిత్యం: రామదాసు



పల్లవి:

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతురా జననీ జానకమ్మా
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే

చరణం1:

లోకాంతరంగుడు శ్రీకాంత నిను గూడి
ఏకాంతమున ఏక శయ్యానున్నా వేళ
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే

చరణం2:

ఆద్రీజావినుతుడు భధ్రగిరీశుడు
నిద్ర మేల్కొనూ వేళ నెరతలో భోధించి
నను బ్రోవమనీ నను బ్రోవమనీ
నను బ్రోవమని చెప్పవే

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

27-Jun-2011

ఇద్దరు మిత్రులు

గాత్రం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: శ్రీ శ్రీ



పల్లవి:

ఒహో ఒహో నిన్నే కోరెగా
కుహు కుహూ అని కోయిల
ఒహో ఒహో నిన్నే కోరెగా
కుహుకుహూ అని కోయిల
వసంత వేళల పసందు మీరగా
అపూర్వగానమే ఆలపించే తీయగా
ఒహో ఒహో నిన్నే కోరెగా
కుహు కుహూ అని కోయిల

చరణం1:

అదా కోరికా వయ్యారి కోయిల
జగాలే నీ చూపులో జలదిరించెలే
అదా కోరికా వయ్యారి కోయిల
జగాలే నీ చూపులో జలదిరించెలే
వరాల నవ్వులే గులాబి పువ్వులై
వలపు తేనె నాలోన చిలకరించెనే

ఒహో ఒహో నిన్నే కోరెగా
కుహు కుహూ అని కోయిల

చరణం2:

ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో సోలిపో హాయి హాయిగా
ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో సోలిపో హాయి హాయిగా
ఉయ్యాలలూగే నా మది చిటారుకొమ్మల
నివాళి అందుకో ఈవేళ పండుగ
సదా సుధా తరంగాల తేలిపోదమా

ఒహో ఒహో నిన్నే కోరితి
కుహు కుహూ అని పాడితి

~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

24-Jun-2011

ఇదే నా మొదటి ప్రేమలేఖ

తారాగణం: జయరాం,రిమ్మీసేన్
గాత్రం: బాలు
సంగీతం: ఘంటాడి కృష్ణ
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
సంస్థ: హర్ష క్రియేషన్స్
విడుదల: 2001



పల్లవి:

చెలియా నీవే నా ఎదలో దాగావే
ఈ ఎదలో ఉండి నను వేధిస్తున్నావే
కనులు మూసినా కనులు తెరిచినా
కనుల ముందరే కదులుతున్నావే
ఏ దిక్కున చూసిన నువ్వే
కనురెప్పలు మూసినా నువ్వే
ఏ దిక్కున చూసిన నువ్వే
కనురెప్పలు మూసినా నువ్వే
నను పిలుస్తువున్నావే
చెలియా నీవే నా ఎదలో దాగావే
ఈ ఎదలో ఉండి నను వేధిస్తున్నావే

చరణం1:

నమ్మవుగానీ చెలియా నీతో నిజమే చెబుతున్నా
నాలో నేనే నిమిషం కూడా నిలువలేక ఉన్నా
నమ్మవుగానీ చెలియా నీతో నిజమే చెబుతున్నా
నాలో నేనే నిమిషం కూడా నిలువలేక ఉన్నా
ఎప్పుడు ఎక్కడ ఏమి చేసినా పక్కనే ఉండి ఓ చెలి
చెక్కిలిగింతలు పెడుతున్నావు నీకు న్యాయమా నా సఖి
నిదురిస్తున్నా సరే నీ నవ్వే జ్ఞాపకం
నీ తలపే చాలులే ఎద నిండా సంబరం

చెలియా నీవే నా ఎదలో దాగావే
ఈ ఎదలో ఉండి నను వేధిస్తున్నావే

చరణం2:

ఇన్నినాళ్ళుగా తెలియలేదులే ప్రేమలోని బాధ
నిన్ను చూడగా మొదలయ్యిందే తీయని ఈ బాధ
ఆ ఇన్నినాళ్ళుగా తెలియలేదులే ప్రేమలోని బాధ
నిన్ను చూడగా మొదలయ్యిందే తీయని ఈ బాధ
అద్దంలోను నా బదులు నువు కనిపిస్తుంటే ఓ చెలి
నాలో నేను మురిసిపోయి నేనయిపోయానే ఓ కవి
నీ ధ్యాసే లేనిదే క్షణమైనా గడవదే
నా నీడే నను వీడి నీ సిగ పూవాయెనే

చెలియా నీవే నా ఎదలో దాగావే
ఈ ఎదలో ఉండి నను వేధిస్తున్నావే
కనులు మూసినా కనులు తెరిచినా
కనుల ముందరే కదులుతున్నావే
ఏ దిక్కున చూసిన నువ్వే
కనురెప్పలు మూసినా నువ్వే
ఏ దిక్కున చూసిన నువ్వే
కనురెప్పలు మూసినా నువ్వే
నను పిలుస్తువున్నావే
చెలియా నీవే నా ఎదలో దాగావే
ఈ ఎదలో ఉండి నను వేధిస్తున్నావే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

22-Jun-2011

దశావతారం

గాత్రం: షాన్,మహాలక్ష్మి అయ్యర్
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
ప్రాణం భూమికే పంచుదాం హొ
పాటై భూమినే దాటుదాం

ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ

పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
ప్రాణం భూమికే పంచుదాం
పాటై భూమినే దాటుదాం

ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ


చరణం1:

నీ దారిలో ముళ్ళున్నా
నా దారిలో రాళ్ళున్నా
ఏరెయ్యవా పాటలే
ఏ గుండెలో మృగమున్నా
ఏ చుపులో విషమున్నా
మార్చెయ్యవా పాటలే
మాటలాడు ఆ దైవమే
మాతృబాష సంగితమే
మట్టిలో జీవితం కొంత కాలం
పాటతో జ్ఞాపకం ఎంతో కాలం
ఇది తెలుసుకో సోదరా
ఎద గలముతో పాడరా

ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఒహొ

చరణం2:

ఆ పువ్వు కి ఆయుస్సు మూన్నాళ్ళలో ముగిసెను
అందించదా తేనెలే
ఈ జన్మకి ఇది చాలు నీ బాటలో నడిచొస్తు
నే పాడన లాలినే
లయలో శృతి కలుపుదాం
బ్రతుకును బ్రతికించుదాం
కాలమే గొంతుని మూసేస్తుంది
గాలిలో గీతమే మోగిస్తుంది
నీ గానమే అద్భుతం
నీ మౌనమే అమృతం

ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ
ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ


~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~

20-Jun-2011

ఆస్తిపరులు

గాత్రం: సుశీల
సాహిత్యం: కొసరాజు



పల్లవి:

సోగ్గాడే చిన్ని నాయనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడు

చరణం1:

కట్టె తుపాకెత్తుకుని కట్ట మీద నడుస్తుంటే కాలు జారి పడ్డాడే సోగ్గాడు
కట్టె తుపాకెత్తుకుని కట్ట మీద నడుస్తుంటే కాలు జారి పడ్డాడే సోగ్గాడు
పగటి వేషగాడల్లే పల్లెటూళ్ళు తిరుగుతుంటే కుక్కపిల్ల భౌ అంది హే
పడుచు పిల్ల పక్కుమంది హు హు హు హ
సోగ్గాడే చిన్ని నాయనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడు

చరణం2:

కళ్ళజోడు ఏసుకొని గళ్ళకోటు తొడుక్కొని పిల్లగాలికొచ్చాడే సోగ్గాడు
కళ్ళజోడు ఏసుకొని గళ్ళకోటు తొడుక్కొని పిల్లగాలికొచ్చాడే సోగ్గాడు
చిట్టి వలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేను
చిట్టి వలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేను బిక్కమొఖమేశాడు చుక్కులొంక చూశాడు
బిక్కమొఖమేశాడు చుక్కులొంక చూశాడు
సోగ్గాడే చిన్ని నాయనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడు

చరణం3:

మూతి మీసం గొరుక్కొని బోసిమొహం పెట్టుకొని వేటకోసం వచ్చాడే సోగ్గాడు
మూతి మీసం గొరుక్కొని బోసిమొహం పెట్టుకొని వేటకోసం వచ్చాడే సోగ్గాడు
బుల్లిదొర వచ్చెనని కుక్కపిల్ల ఎక్కిరిస్తే ఎర్రిముహం వేశాడు హొయ్
మిర్రి మిర్రి చూశాడు హ హొయ్

సోగ్గాడే చిన్ని నాయనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17-Jun-2011

శ్రీరామదాసు

గాత్రం: హరిహరన్, చిత్ర
సాహిత్యం: రామదాసు



రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
వేద వినుత రాజమండలా శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా
వేద వినుత రాజమండలా శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా
సతత రామ దాస పోషకా శ్రీ రామచంద్ర వితత భద్రగిరి నివేశకా
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
బాహు మధ్య విలసితేంద్రియా
బాహు మధ్య విలసితేంద్రియా


కోదండరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ
కోదందరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ
నీ దండ నాకు నీరెండు ఓకు వాదేల నీకు వద్దు పరాకు
కోదందరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ
తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే
కోదండరామా కోదండరామా రామ రామ కోందండరామ

దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా
దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా
దశరధ రామా గోవిందా
దశముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖ చక్రధరా
దశరధ రామా గోవిందా

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ
ఒక తోడుగా భగవంతుండు మును చక్రధారియై చెంతనె ఉండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ
తక్కువేమి మనకకు రాముండొక్కడుండు వరకూ

జై జై రామ జై జై రామ జగదభిరామ జానకి రామ
జై జై రామ జై జై రామ జగదభిరామ జానకి రామ
జై జై రామ జై జై రామ జగదభిరామ జానకి రామ
జై జై రామ జై జై రామ జగదభిరామ జానకి రామ

పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో

శ్రీమన్మహాగుణ స్తోమాభి రామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామప్రభో
సుందరాకార మన్మందిరాద్ధార సీతేందిరా సంయుతానంద రామప్రభో
పాహి రామప్రభో,పాహి రామప్రభో,పాహి రామప్రభో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Jun-2011

ఖుషి

గాత్రం: మురళీధర్
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు



పల్లవి:

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

చరణం1:

అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయరమ్మనిలే
అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయరమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

చరణం2:

విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13-Jun-2011

ఒకరికి ఒకరు

గాత్రం: కీరవాణి,గంగ
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో
జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో
మిధిలానగరిని జానకి అల్లో నేరెళ్ళో
ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో

అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో
జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో
మిధిలానగరిని జానకి అల్లో నేరెళ్ళో
ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో

అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో హొ హొ

చరణం1:

ఏటిపాయల పాపిటకి కుంకుమబొట్టే ఆభరణం
ఎదురుచూపుల కన్నులకి కాటుకరేఖే ఆభరణం
పుడమినంటని పదములకి పసుపువన్నెలే ఆభరణం
పెదవిదాటని మాటలకి మౌనరాగమే ఆభరణం
మగువ మనసుకి ఏనాడూ మనసైనవాడే ఆభరణం

అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో

చరణం2:

చేయి జారిన చందమామని అందుకోగలనా ఆ ఆ ఆ
రాయలేని నా ప్రేమలేఖని అందచేయగలనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా
చేరువై నా మనోవేదన మనవి చేయగలనా
నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా

అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10-Jun-2011

ప్రేమ తరంగాలు

తారాగణం: కృష్ణంరాజు, చిరంజీవి, సుజాత
గాత్రం: బాలు, ఎస్.పి.శైలజ
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: ఎస్.పి.చిట్టిబాబు
సంస్థ: ప్రభు చిత్ర
విడుదల: 1980



పల్లవి:

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

చరణం1:

ఈ తోటలో ఏ తేటిదో
తొలిపాటగా వినిపించెను ఎద కదిలించెను
ఆ పాటనే నీకోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా
వికసింతువా వసంతమా

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

చరణం2:

ఈ చీకటి నా లోకము
నీ రాకతో మారాలిరా కథ మారాలిరా
ఆ మార్పులో నా తూర్పువై
ఈ మాపునే వెలిగింతువా నేస్తమా
వికసింతువా వసంతమా

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం
ఆహా ఆ ఆ అహాహ ఆ ఆ ఆహాహ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~





~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Jun-2011

ఘర్షణ

గాత్రం: టిప్పు,షాలిని సింగ్
సాహిత్యం: కులశేఖర్




పల్లవి:

చెలిమను పరిమళం
మనసుకు తొలివరం
బతుకున అతిశయం
వాన వాన చినుకులే
ఇరువురి పరిచయం
తెలియని పరవశం
పరువపు పరుగులే

నన్నే నన్నే చూసూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యొద్దే

నీకో నిజమే చెప్పనా
నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిల్లానా
నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నా లేనిది
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
హా ఒహువహ ఒహువహ ఏమిటంటారు ఈ మాయల్ని
ఒహువహ ఒహువహ ఎవరినడగాలో ప్రేమేనా అని

నన్నే నన్నే చూసూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యొద్దే


చరణం1:

ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణ
బిడియము లెరుగని గడసరి సొగసుకు
తమకము లెగసెను నరాలలోన హ లోన
ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం మారిందీ
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది

నన్నే నన్నే మార్చి
నీ మాటల్తో ఏమార్చి
ప్రేమిచే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్

చెలిమను పరిమళం
మనసుకు తొలివరం
బతుకున అతిశయం
వాన వాన చినుకులే
ఇరువురి పరిచయం
తెలియని పరవశం
పరువపు పరుగులే

చరణం2:

మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన వయ్యారి జాణ ఆ జాణ
ఈలోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టీంది
నీవల్లే ఇంతగా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టింది

నన్నే నన్నే చూసూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యొద్దే
నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిల్లానా
నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నా లేనిది
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
హా ఒహువహ ఒహువహ ఏమిటంటారు ఈ మాయల్ని
ఒహువహ ఒహువహ ఎవరినడగాలో ప్రేమేనా అని
ప్రేమేనా అని ప్రేమేనా ఆని ప్రేమేనా అని


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

06-Jun-2011

రాము

గాత్రం: సుశీల
సాహిత్యం: దాశరథి



పల్లవి:

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

చరణం1:

చల్లని పలుకుల తల్లి
చక్కని నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట నేనే సుమా
చల్లని పలుకుల తల్లి
చక్కని నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట నేనే సుమా
ఇద్దరి బుగ్గల మీదా ముద్దుల మూటలు కడితే
ఇంపుగ నిదుర పోవాలి జో జో జో
ఇద్దరి బుగ్గల మీదా ముద్దుల మూటలు కడితే
ఇంపుగ నిదుర పోవాలి జో జో జో

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

చరణం2:

చిట్టి చిలక పలకా
చిలక తల్లి కులకా
చిలక రాజు చెట్లచాటున వెతకాలి
చిట్టి చిలక పలకా
చిలక తల్లి కులకా
చిలక రాజు చెట్లచాటున వెతకాలి
చల్లగ మురిసే వేళ చాటుగ మసలే వేళ
ఎల్లరు కలకలలాడాలి జో జో జో
చల్లగ మురిసే వేళ చాటుగ మసలే వేళ
ఎల్లరు కలకలలాడాలి జో జో జో

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

03-Jun-2011

ఆత్మబంధువు

తారాగణం: శివాజి గణేషణ్, రాధ
గాత్రం: బాలు,జానకి
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: ఇళయరాజా
దర్శకత్వం: భారతీరాజా
విడుదల: 1985



పల్లవి:

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

చరణం1:

ఒక చిలక ఒద్దికైంది మరు చిలక మచ్చికైంది
వయసేమో మరిచింది మనసొకటై కలిసింది
కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా
ప్రేమలేని నాడీనేల పూవులిన్ని పూచేనా
మనిషిలేని నాడు దేవుడైనా లేడు
మంచిని కాచే వాడు దేవుడికి తోడు

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

చరణం2:

వయసు వయసు కలుసుకుంటే పూరి గుడిసే రాచనగరు
ఇచ్చుకోను పుచ్చుకోను ముద్దులుంటే పొద్దుచాలదు
ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు
గువ్వ గూడు కట్టే చోట కుంపటెత్తి పోరాదు
ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం
జాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసం

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

01-Jun-2011

ఇదే నా మొదటి ప్రేమలేఖ

గాత్రం: హరిహరన్



పల్లవి:

ఇదే నా ,ఇదే నా
ఇదే నా మొదటి ప్రేమలేఖ
రాసానే, రాసానే
రాసానే మనసు దాచలేక
నా మనసు చిరునామని నీ మనసునడగాలని
నీ గుండె సవ్వళ్ళతో నా శ్వాస చేరాలని
ఆశగా ఉందే ఓ చెలి ఆ ఆ ఆ
ఇదే నా ,ఇదే నా
ఇదే నా మొదటి ప్రేమలేఖ
రాసానే, రాసానే
రాసానే మనసు దాచలేక

చరణం1:

మనసులోని ప్రతి మాటని పరిచాను నీ వాకిటే
పలుకలేని భావాలని పోశాను నీ దోసిటే
ఇది కవులే రాసే కావ్యం కాదంటా
నా కలలే చూపే కాగితమేనంటా
పొరపాటే ఉంటే మన్నించాలంటా
మన్నించానంటూ మనసివ్వాలంటా
ఉత్తరాలల్లో నింపా నా ఉసుని
అక్షరాలల్లో ఉంచా నా ఆశని
ఎద సంతకాన్నే చూడమ్మా ఓ ఓ ఓ

ఇదే నా ,ఇదే నా
ఇదే నా మొదటి ప్రేమలేఖ
రాసానే, రాసానే
రాసానే మనసు దాచలేక

చరణం2:

దాచుకున్న దరఖాస్తులే ఉన్నాయి ఈ లేఖలో
వేచియున్న శుభలేఖలే నిలిచాయి ఈ లేఖలో
ఈ సంగతులన్ని నువ్వే చదవాలి
నా సంగతి ఏంటో నువ్వే చూడాలి
ఇది అందిందంటూ తిరుగే రాయాలీ
ఆ రాతే నా తలరాతను మార్చాలి
వేయి జన్మాలకైనా ఓ జాబిలి
వేచి ఉంటాను నేనే నీ జాబుకై
దయచేసి బదులే ఇవ్వమ్మా

ఇదే నా ,ఇదే నా
ఇదే నా మొదటి ప్రేమలేఖ
రాసానే, రాసానే
రాసానే మనసు దాచలేక
నా మనసు చిరునామని నీ మనసునడగాలని
నీ గుండె సవ్వళ్ళతో నా శ్వాస చేరాలని
ఆశగా ఉందే ఓ చెలి ఆ ఆ ఆ
ఆశగా ఉందే ఓ చెలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~