31-Aug-2011

శ్రీరామదాసు

తారాగణం: నాగార్జున,స్నేహ,నాగేశ్వరరావు,సుమన్,సుజాత,అర్చన
గాత్రం: ప్రణవి
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం: రాఘవేంద్రరావు
నిర్మాత: కొండా కృష్ణంరాజు
సంస్థ: ఆదిత్య ప్రొడక్షన్స్
విడుదల: 2006



శుద్దబ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా

ప్రియ గుహ వినివేదిత పద రామా
శబరీ దత్త ఫలాశన రామా
ప్రియ గుహ వినివేదిత పద రామా
శబరీ దత్త ఫలాశన రామా

హనుమత్సేవిత నిజపద రామా
సీతా ప్రాణాధారక రామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా

శుద్దబ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

29-Aug-2011

రాము

గాత్రం: పి.సుశీల
సాహిత్యం: దాశరధి



పల్లవి:

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

చరణం1:

నన్నే నీవు అమ్మ అన్న నాడు
మీ నాన్న మనసు గంతులువేసి ఆడు
నన్నే నీవు అమ్మ అన్న నాడు
మీ నాన్న మనసు గంతులువేసి ఆడు
మంచికాలం మరలా రాగా ముళ్ళబాటే పూలతోట
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

చరణం2:

గూటిలోని పావురాలు మూడు
అవి గొంతు కలిపి తీయని పాట పాడు
గూటిలోని పావురాలు మూడు
అవి గొంతు కలిపి తీయని పాట పాడు
మంచుతెరలు తొలగీపోయి పండువెన్నెల కాయునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

26-Aug-2011

ఘర్షణ

తారాగణం: వెంకటేష్,అసిన్
గాత్రం: కె కె,సుచిత్ర
సాహిత్యం: కులశేఖర్
సంగీతం: హారీష్ జయరాజ్
దర్శకత్వం: గౌతం మీనన్
నిర్మాతలు: సి.వెంకటరాజు,శివరాజు
విడుదల: 2004



పల్లవి:

చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
తడిసి పోతున్నా,తడిసి పోతున్నా

చరణం1:

శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చునుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే
జాడ ఐనా తెలియదేమే
ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం
ఎందుకమ్మా నీకీ మౌనం
తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా ఆ ఆ ఆ ఆ ఆ

చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

చరణం2:

గుండెలోన వలపు గాయం
మంటరేపే పిదప కాలం
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం
భారమైన బతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా
కలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి చేరవా నేస్తమా ఆ ఆ ఆ ఆ ఆ

చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
ప్రియతమా ఏ ఏ ఏ

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

24-Aug-2011

శ్రీరామదాసు

గాత్రం: దేవిశ్రీప్రసాద్,కీరవాణి,మాళవిక
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ



పల్లవి:

హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఆ ఆ ఆ

చరణం1:

కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల గుంపులాట గుంపులాట గుంపులాట
ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట
చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి

మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు

చరణం2:

చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటొణ్ణ్ని కాపాడాలని పిచ్చి నాది
మేడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది
రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని కడకెవరో మనసుపడి వస్తున్నట్టు

హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22-Aug-2011

దశావతారం

తారాగణం: కమల్‌హాసన్,అసిన్,మల్లికా షెరావత్,జయప్రద
గాత్రం: సాధనా సర్గం
సాహిత్యం: వేటూరి
సంగీతం: హిమేష్ రేషమ్మియా
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: ఆస్కార్ వి.రవిచంద్రన్
సంస్థ: ఆస్కార్ ఫిలింస్
విడుదల: 2008





పల్లవి:

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

వెన్నదొంగవైనా మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

చరణం1:

నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి
నాట్యమాడి కాళీయుని దర్పమనిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా
అట అర్జునుడొందెను నీ దయ వల్ల గీతోపదేశం
జగతికిసైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లే రాగం తానం రాజీవుడే

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

చరణం2:

మత్స్యమల్లే నీటిన తేలి వేదములను కాచి
కూర్మ రూప ధారివి నీవై భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలన్నెనున్న ఆధారం నేనే
నీ ఒరవడి పట్ట ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19-Aug-2011

ఆవారా

గాత్రం: రాహుల్ నంబియార్, సైంధవి
సాహిత్యం: వెన్నెలకంటి



పల్లవి:

అరెరె వాన జడివాన
అందాల నవ్వులే పూల వాన
అరెరె వాన జడివాన
అందాల నవ్వులే పూల వాన
మళ్లీ మళ్లీ వానొస్తే
మనసు గొడుగు చెలి పడితే
గారం పెరిగింది దూరం తరిగింది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
నెమలికన్నెలాగ చెలి నాట్యమాడుతుంటే
ఎదే పాలపుంతై నా మనసునాడమంది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
అరెరె వాన జడివాన
అందాల నవ్వులే పూల వాన

చరణం1:

ఆటా పాటా ఓ పాడని పాట
వానే పాడింది అరుదైన పాట
నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు
నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు
మంత్రంలాగ ఉంది ఇది తంత్రంలాగ ఉంది
చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతోంది
దేవత ఏది నా దేవత ఏది
తను సంతోషంగా ఆడుతు ఉంది

చరణం2:

నిన్ను మించి వేరెవరూ లేరే
నన్ను మించి నీకెవరూ లేరే
చిన్న చిన్న కళ్ళు రెండు
దేవుడు నాకు ఇచ్చాడంట
కళ్లు రెండు మూసుకున్నా
నీవున్నదే మాయమట
మల్లెపూల పొద్దు నాకు ఇచ్చిపోవె ముద్దు
ముద్దుచాటు సద్దు చెరిపేయమంది హద్దు
పులకించింది ఎద పులకించింది
చెలి అందాలనే చిలికించింది

అరెరె వాన జడివాన
అందాల నవ్వులే అగ్గి వాన
అరెరె వాన జడివాన
అందాల నవ్వులే అగ్గి వాన
మళ్లీ మళ్లీ వానొస్తే పగటి వేళ మెరుపొస్తే
నింగే వంగింది భూమే పొంగింది
నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది
గొడుగు పట్టి ఎవరూ ఈ వాననాపవద్దు
అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు
ఆడాలి ఆడాలి వానతో ఆడాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17-Aug-2011

ఘర్షణ

గాత్రం: హరిణి
సాహిత్యం: కులశేఖర్




పల్లవి:

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమతా నీదిరా
మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ
నీదేలేరా నోరూరుంచే ఆడబొమ్మ
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమతా నీదిరా

చరణం1:

గాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళూంచానయ్యో నీకోసం
నా అందం చందం అంతా నీకోసం
తోడే లేదనీ కాలే కౌగిలి
ఎప్పటి నుంచీ ఉందో నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం
ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమతా నీదిరా

చరణం2:

జారే పైటకీ తూలే మాటకీ
తాపం పెంచిందయ్యో నీ రూపం
ఏనాడు లేనేలేదు ఈ మైకం
నాలో శ్వాసకీ రేగే ఆశకీ
దాహం పెంచిందయ్యో నీ స్నేహం
గుర్తంటూ రానే రాదు ఈ లోకం
నీ జతే చేరితే మామమయ్యే నాలో మౌనం
రాగమై సాగెనే అంతులేని ఆనందం

మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ
నీదేలేరా నోరూరుంచే ఆడబొమ్మ
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Aug-2011

ఒకరికి ఒకరు

తారాగణం: శ్రీరాం,ఆర్తి చాబ్రియా
గాత్రం: శ్రేయాఘోషల్
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: రసూల్ ఎల్లోర్
నిర్మాత: కిరణ్
సంస్థ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్




పల్లవి:

నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష
బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష

చరణం1:

పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు
తారల్లో మిణుకులన్ని దోసిల్లో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా
నీ జ్ఞాపకాలన్ని ఏ జన్మలోనైన నే మరువలేనని
నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా ఓ ప్రియతమా

నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష

చరణం2:

సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపేస్తున్న అలుపెరుగని హృదయ లయలని
ఏ చోట నువ్వునా నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా ఓ ప్రియతమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Aug-2011

ఖుషి

తారాగణం: పవన్ కళ్యాణ్, భూమిక
గాత్రం: శ్రీనివాస్, హరిణి
సాహిత్యం: ఏ.ఎం.రత్నం
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: ఎస్.జె.సూర్య
నిర్మాత: ఏ.ఎం.రత్నం
సంస్థ: సూర్యా మూవీస్
విడుదల: 2001



పల్లవి:

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
కోపాలు తాపాలు మనకేలా
సరదాగా కాలాన్ని గడపాల
సలహాలు కలహాలు మనకేలా
ప్రేమంటే పదిలంగా వుండాల
చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము

చరణం1:

రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే
గాలి తాకంగ పూచెనులే
అయితే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్న
ఉలి తాకంగ వేలిసెనులే
అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంట
వ్యవహారం తీర్చేది ఎవరంట
కళ్ళల్లో కదిలేటి కలలంట
ఊహల్లో ఊగేటి ఊసంట
చెలియ చెలియా..చెలియ చెలియా
చిరు కోపమా

చరణం2:

నీలిమేఘాలు చిరుగాలిని ఢీకొంటే
మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవేననుకోమననా లేక నైజం అనుకోనా
మౌనరాగాలు రెండు కళ్ళను ఢీకొంటే
ప్రేమ వాగల్లే పొంగునులే
దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంట
వ్యవహారం తీర్చేది ఎవరంట
అధరాలు చెప్పేటి కధలంట
హృదయంలో మేదిలేటి వలపంట

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

10-Aug-2011

ఇద్దరు మిత్రులు

తారాగణం: నాగేశ్వరరావు,రాజసులోచన,ఇ.వి.సరోజ
గాత్రం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: దాశరథి
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.మధుసూదనరావు
సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్
విడుదల: 1961



పల్లవి:

ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా

ఓ మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా
నింగి దాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేదిందుకే నిషా కనులవాడా

చరణం1:

ఓ ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో
ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో
హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో
నే వెళితే మరి నీవు మజ్నూవవుతావు
నే వెళితే మరి నీవు మజ్నూవవుతావు
మజ్నూ నేనేతై ఓ లైలా లోకమే చీకటైపోవునే
మజ్నూ నేనేతై ఓ లైలా లోకమే చీకటైపోవునే
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారుగా ఉందాములే నిషా కనులవాడా

చరణం2:

ఓ ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందుమా నేడే
నీలినీలి మేఘాల రథముపై తేలిపోదుమీనాడే
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై ఏకమవుదమా తీయగా
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
హుషారుగా ఉందాములే హమేషా మజాగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Aug-2011

దశావతారం

గాత్రం: హరిహరన్
సాహిత్యం: వెన్నెలకంటి



పల్లవి:


ఓం నమో నారాయణాయ

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవుల్నేం చేస్తారు ఆ యమ కింకరులు

చరణం1:

నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే
వీర శైవుల బెదిరింపులకు
పరమ వైష్ణవం మోగదులే
ప్రభువు ఆనతికి జడిసే నాడు
పడమట సూర్యుడు పొడవడులే
రాజ్యలక్ష్మి నాధుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజలకు రాజు ఈ రంగరాజనే

చరణం2:

నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంటా
దైవం కొసం పోరే సమయం లేదంటా

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

05-Aug-2011

ప్రేమ ఖైది


గాత్రం: షాన్
సాహిత్యం: వెన్నెలకంటి

పల్లవి:

మైనా మైనా గుండెల్లోన గూడు కడితివే
మైనా మైనా మనసే దోచి మంట పెడితివే
చెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దే
చూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే
ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా
నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా
నువులేక ఉండనే లేను నాకోసం వస్తావా
మైనా మైనా

చరణం1:

నిన్ను చూసి పిచ్చివాన్నైపోయా
ప్రేమలోన ఉంది ఏదో మాయ
ఆశే నువ్వంటా గుండె శ్వాసే నువ్వంటా
ఆడుకున్నా ఆట పాడుకున్నా పాట
కళ్ళే పాడే వేళ చూపై పొయె మాట
అదిరే నీ పెదవుల నవ్వైపోనా
అరరే నీ కొంగుని నేనైపోనా

మైనా మైనా గుండెల్లోనా గూడు కడితివే
మైనా మైనా మనసే దోచి మంట పెడితివే

చరణం2:

వెంట వచ్చు తోడు నేను కానా
వీడలేని నీడ లాగా రానా
నీతో ఉంటానే నీ మాటే వింటానే
మైనా పేరు వింటే ఝల్లంటోంది ప్రాణం
నువ్వే జంట లేక మాటే నాకు మౌనం
చెలియా నీకోసం మేలుకునుంటా
కలవై నువ్వొస్తే నిదురే పోతా

మైనా మైనా గుండెల్లోన గూడు కడితివే
మైనా మైనా మనసే దోచి మంట పెడితివే
చెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దే
చూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే
ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా
నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా
నువులేక ఉండనే లేను నాకోసం వస్తావా
మైనా మైనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

03-Aug-2011

కన్నతల్లి

తారాగణం: జి.వరలక్ష్మి,నాగేశ్వరరావు,రాజసులోచన(తొలి చిత్రం)
గాత్రం: ఏ.ఎం.రాజా, సుశీల(తొలి పాట)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాత & దర్శకుడు: ప్రకాశరావు
సంస్థ: ప్రకాష్ ప్రొడక్షన్స్
విడుదల: 1953




పల్లవి:

ఎందుకో పిలిచావెందుకో
ఎందుకో పిలిచావెందుకో
ఈల వేసి సైగ చేసి
ఏమి అసలెరుగనట్లు
ముంగిలాగ మూతి ముడిచి
మూగనోము పట్టావే
ఎందుకో పిలిచావెందుకో

ఎందుకో చెబుతానెందుకో
కన్నతల్లి కన్నుగప్పి
కడవ సంకనేసుకొని
మంచినీళ్ళ పేరు చెప్పి
పొంచి పొంచి వచ్చావే
ఎందుకో చెబుతానెందుకో
ఎందుకో చెబుతానెందుకో

చరణం1:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చదువు సాము కట్టిపెట్టి
చల్లగాలి సాకు చెప్పి
ఆటలతో పాటలతో తోటలంట తిరిగావే
ఎందుకో పిలిచావెందుకో

చరణం2:

చల్లని నీ చూపులోనే
చదువంతా నిండిపోయి
వింతలేవో చెబుతావని
చెంతకి రమ్మన్నానే
ఎందుకో చెబుతానెందుకో

చరణం3:

ఐతే ఈ పొడుపుకథ చెప్పుకో చూద్దాం
నీతో ఉంటుంది కాని చేతిలోనికి రానిదేమి
వేలు అనుకొన్నావేమో కాదు
నాతో ఉండేది నీవె చేతిలోనె చిక్కావే
ఇందుకే పిలిచానిందుకే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

01-Aug-2011

ఒకరికి ఒకరు

గాత్రం: బాలు
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

ఎక్కడున్నావమ్మ ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మ నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో
నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పిచుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకురి
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి సాన
సుబ్బలక్ష్మి కోడూరి
ఎక్కడున్నావమ్మ ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మ నీ చిరునామా

చరణం1:

అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటే తెలుసు ఊరు వాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు ఫొను నెంబెర్ ఏమిటో
అక్కడి చిలకను అడిగితే నువ్వు సప్తసముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లిష్ చిలకా నీ ఆచూకి తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిన్ను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోన
సుబ్బలక్ష్మి నండూరి

ఎక్కడున్నావమ్మ ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మ నీ చిరునామా

చరణం2:

ఫస్ట్ టైం డయలు చెయ్యగా అష్టలక్ష్మి పలికెరా
రెండో సారి రింగు చెయ్యగా రాజ్యలక్ష్మి దొరికెరా
మరో మారు ట్రైలు వెయ్యగా మహలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టెరా
ఎదురు దెబ్బలే తగిలినా
నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టరినవుతాలే
కరిమబ్బులెన్ని నన్ను కమ్మినా
నా నెచ్చెలి నింగికి నిచ్చెన వేసి చేరువవుతాలె
నమ్మకముందమ్మ నిను కలుపును నా ప్రేమ

సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినెని సుబ్బలక్ష్మి మిద్ధె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్ట
సుబ్బలక్ష్మి కైకాల

ఎక్కడున్నావమ్మ ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మ నీ చిరునామా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~