30-Sep-2011

విజృంభణ

తారాగణం: శోభన్‌బాబు, జయసుధ, శోభన, సీత
గాత్రం: బాలు, చిత్ర (తొలి పాట)
సంగీతం: సత్యం
నిర్మాతలు: కోనేరు రవీంద్రనాథ్,పాలపర్తి కోటేశ్వరరావు
దర్శకత్వం: రాజాచంద్ర
సంస్థ: విజయశ్రీ ఆర్ట్స్
విడుదల: 1986



పల్లవి:

గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ

చరణం1:

కమ్మని మనసులు కళకళలాడే కాపురం
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా
తడబడక వడి వడిగా నడిచేదే జీవితం

జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ

చరణం2:

చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం
మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం
చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం
మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం
పదుగురు ఏమన్నా విధి పగపడుతున్నా
ఎదసాచి ఎదిరించి కదిలేదే జీవితం

జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం...జీవితం
ప్రతిపదం...ప్రతిపదం సమరమై సాగనీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28-Sep-2011

ఒక్కడు

గాత్రం: హరిహరన్,శ్రేయాఘోషల్,ప్రియ సిస్టర్స్
సాహిత్యం: సీతారామశాస్త్రి



పల్లవి:

ముత్తైదులంతా ముదమార ఈ బాలకి
మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్ష అని క్షీరాబ్ధి కన్యకి
ముమ్మారు దిష్టి తీసి దీవించరే

మనసు పడే మొగుడొస్తాడని మేనంతా మెరిసింది
మిడిసి పడే మదిలో సందడి మేళాలై మ్రోగింది
నీకు నాకు ముందే రాసుందే జోడి
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా

చరణం1:

గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా
దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా

ముస్తాబు చెయ్యరాటే ఈ ముద్దుల గుమ్మని
సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే
పట్టు చీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి
తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే
వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిళ్ళలో
నగలన్నీ వెల వెల బోవ చేరండే నీ ఓళ్ళో
నాకే సొంతం కానీ నీ సొమ్ములన్నీ

హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా

చరణం2:

ఒట్టేసి చెపుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనానా ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా

ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లుగా అక్షింతలు వేయాలే
ముచ్చట తేరేలా అంతా రండి
ఏనాడు ఎవరొచ్హరని ఏకాంతం వెతకాలి
ఏ కన్ను ఎప్పుడు చూడని లోకంలో బతకాలి
పగలు రేయి లేని జగమేలుకోని

హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

26-Sep-2011

చల్లని నీడ

తారాగణం: హరనాథ్, జమున, గుమ్మడి, అంజలీదేవి, గీతాంజలి
గాయకులు: జానకి
సంగీతం: టి. చలపతిరావు
నిర్మాతలు: కె.వి.సుబ్బయ్య, చలపతిరావు
దర్శకత్వం: తాతినేని రామారావు
సంస్థ: జనరంజని ఫిలింస్
విడుదల: 1968



పల్లవి:

మీరెవరో ఏ వూరో ఏ పేరో
ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా
మీరెవరో ఏ వూరో ఏ పేరో
ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా
మీరెవరో

చరణం1:

ముద్దుల మూటలు కట్టుకుని
ముచ్చటలెన్నో మోసుకొని
రవ్వలు కురిసే చిరునవ్వులతో
ఎవ్వరికోసం వచ్చారో
మీరెవరో ఏ వూరో ఏ పేరో
ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా
మీరెవరో

చరణం2:

చుక్కల పల్లకిలో సాగి
మబ్బుల దారుల ఊరేగి
ఏ చెలి కోసం తెచ్చారో
మీరెవరో ఏ వూరో ఏ పేరో
ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా
మీరెవరో

చరణం3:

వచ్చిన ప్రియునికి ఎదురేగి
వెచ్చని కౌగిలినే కోరి
సిగ్గుల తెరలో దాగిన చెలికి
కోరినవన్ని ఇచ్చారో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23-Sep-2011

ఆవారా

తారాగణం: కార్తి, తమన్నా
గాత్రం: హరిచరణ్, తన్వి
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
దర్శకత్వం: లింగుసామి
నిర్మాత: K.E. జ్ఞానవేల్ రాజా
సంస్థ: స్టూడియో గ్రీన్
విడుదల: 2010



పల్లవి:

చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయావే
నువ్వే ప్రేమబాణం నువ్వే ప్రేమకోణం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకెళ్లావే
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయావే

చరణం1:

దేవత తనే ఒక దేవత
ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనే కదా పరిమళం
చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా
సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ
గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్లే ముద్దల్తోనే తడిమెయ్యాల
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

చరణం2:

తోడుగా ప్రతిక్షణం వీడక
అనుక్షణం ఆమెతో సాగనా
ఆమె నా స్పందన
నేలపై పడేయక నీడనే
చకా చకా చేరనా ఆపనా గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే
గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే
నాలో నేను మౌనంగానే మాటాడేస్తే
మొత్తం తను వింటూ ఉందే తియ్యగా వేదిస్తుందే
ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయావే
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయావే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

16-Sep-2011

డాన్

తారాగణం: నాగార్జున,అనుష్క
గాత్రం: హరీష్ రాఘవేంద్ర
సాహిత్యం: చిన్ని చరణ్
సంగీతం: రాఘవ లారెన్స్
దర్శకత్వం: రాఘవ లారెన్స్
నిర్మాత: ఎం.ఎల్.కుమార్ చౌదరి
సంస్థ: శ్రీ కీర్తి క్రియేషన్స్
విడుదల: 2007



పల్లవి:

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు
నా కన్నులలోన నీ రూపం
నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి
ఈ అనుభవమే నాకు తొలిసారి
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు

చరణం1:

నిన్ను చూస్తే నిన్నలేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓ లలన
ఎందుకో నా గుండెలోన ఏదో హైరానా హైరానా
ఎంతమంది ఎదుటవున్న ఒంటరినౌతున్నా
ఈ అల్లరి నీదేనా నను అల్లిన తిల్లానా
అనుకున్నానా మరి నాలోన ఈ నమ్మని కమ్మని కధ మొదలౌనని
అందం అందం

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు

అయిపోయాడు డ్రీం బాయ్
అయిపోయాడు డ్రీం బాయ్
అయిపోయాడు డ్రీం బాయ్

చరణం2:

మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా
నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా
ఊహలన్ని వాస్తావాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా
అ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా
అనుకున్నానా మరి నాలోన ఈ నమ్మని కమ్మని కధ మొదలౌనని
అందం అందం

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు...ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు...నీ చిరునవ్వు
నా కన్నులలోన నీ రూపం
నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి
ఈ అనుభవమే నాకు తొలిసారి


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14-Sep-2011

యజ్ఞం

తారాగణం: గోపిచంద్, సమీరా బెనర్జీ
గాత్రం: బాలు, శ్రేయా ఘోషల్
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
నిర్మాత: పోకూరి బాబురావు
దర్శకత్వం: రవికుమార్ చౌదరి
సంస్థ: ఈతరం ఫిలింస్
విడుదల: 2004



పల్లవి:

చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ ఓ ఓ
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఓ ఓ ఓ
రమ్మనే తన అల్లరి
ఝుమ్మనే నా ఊపిరి ఓ ఓ ఓ
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ ఓ ఓ

చరణం1:

సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి దాడిలో వాడికి
ఎప్పుడూ ఆ ధాటి కనలేదని
చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి చెలిమిలో చలువకి
ఎన్నడూ తన సాటి కాలేనని
చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి
సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి
మాటల్లో మంటలు మనసంతా మల్లెలు
స్నేహానికి అర్థమే తానుగా
రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకెనే ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చరణం2:

తరలి రావా ఆ తారలూ రేయి నడిజాములో వాలుజడ సీమలో
జాజులై తల దాచుకుంటామని
మురిసిపోవా రాదారులు వాయు వేగాలతో వేయి సరదాలతో
తానిలా వస్తున్న కబురే విని
మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా
మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా
కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు
ముందే చెలి రాకనే చూపగా
ఝుమ్మనే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ ఓ ఓ
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఓ ఓ ఓ
రమ్మనే తన అల్లరి
ఝుమ్మనే నా ఊపిరి ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Sep-2011

బంగారు తిమ్మరాజు

గాత్రం: జమునారాణి
సాహిత్యం: వీటూరి



పల్లవి:

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన
నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన
ఎరవేసి హ గురిచూసి హ పట్టాలి మావా
ఎరవేసి గురిచూసి పట్టాలి మావా పట్టాలి మావా

చరణం1:

చూపుల్లో కైపుంది మావా సొగసైన రూపుంది మావా
చూపుల్లో కైపుంది సొగసైన రూపుంది
వయ్యారం ఒలికిస్తుంది వన్నెలు చిన్నెలు నేర్చింది
ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది
దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది మావోయ్

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన
ఎరవేసి హ గురిచూసి హ పట్టాలి మావా పట్టాలి మావా

చరణం2:

నడకల్లో హొయలుంది మావా నాట్యంలో నేర్పుంది మావా
నడకల్లో హొయలుంది నాట్యంలో నేర్పుంది
మలిసందె చీకట్లోన నీటికి ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాసావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే దగా చేస్తది మావోయ్

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన
ఎరవేసి హ గురిచూసి హ పట్టాలి మావా
ఎరవేసి గురిచూసి పట్టాలి మావా పట్టాలి మావా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

09-Sep-2011

ప్రేమ ఖైది

తారాగణం: విదార్థ్,అమల పౌల్
గాత్రం: బెన్ని, శ్రేయా ఘోషల్
సంగీతం: ఇమాన్
నిర్మాతలు: బి.సుబ్రహ్మణ్యం, వై.రూపేష్
దర్శకత్వం: ప్రభు సాల్మన్
సంస్థ: లక్ష్మిగణపతి ఫిలింస్
విడుదల: 2011



పల్లవి:

నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి
గువ్వల్లాగా గూడే కట్టి నవ్వుతు బతకాలి
నీతో నన్ను నీడలాగ సాగిపోనీ
నీలో ఎన్ని జన్మలైన ఉండిపోనీ
ఈ లోకమే తలుపులు తెరిచెను మనకోసం
ఆ దైవమే వరముగా ఇచ్చెను సంతోషం
పండగంటి జీవితమే మనకిక మధుమాసం
ఓ ఓ నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి
హే ఏ గువ్వల్లాగా గూడే కట్టి నవ్వుతు బతకాలి

చరణం1:

మనమనుకున్నదంతా జరిగింది
ఇక తీరని కోరికేది
మన కోర్కెలు తీర్చిన ఈ బతుకే
ఎన్నో జన్మలు కావాలి
ఈ ఆశ తీరుతుంది
ఆ రోజు ముందరుంది
ఆ ఆకాశమే మనకందేనంట
ఆనందాలే చిందేనంట

ఓ ఓ నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి
ఓ ఓ నువ్వు నేను

చరణం2:

అరె కూటికి లేని జీవితమే నేడు కోటికి చేరినది
ఈ భూమిని కూడా బంతాడే ఆ రహస్యం తెలిసినది
హే ఏ కలిసి వచ్చె కలిమి
అది ప్రేమకున్న బలిమి
ఇక ఆ చుక్కలే నీ సిగపూలుగా
తెచ్చి ఇస్తాను చూడే పిల్లా

నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి
గువ్వల్లాగా గూడే కట్టి నవ్వుతు బతకాలి
ఈ లోకమే తలుపులు తెరిచెను మనకోసం
ఆ దైవమే వరముగా ఇచ్చెను సంతోషం
ఓ ఓ పండగంటి జీవితమే మనకిక మధుమాసం
నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

07-Sep-2011

లంకేశ్వరుడు

తారాగణం: చిరంజీవి, రాధ
గాత్రం: మనో, జానకి
సాహిత్యం: దాసరి నారాయణరావు
సంగీతం: రాజ్-కోటి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
విడుదల: 1989



పల్లవి:

జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమగీతం
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే నీకేలే అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది

చరణం1:

ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావో
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి

కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది

చరణం2:

మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచె పూలగాలి
పూవుల్లో దాగున్న అందాలనే మన ముందుంచె గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి

జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

05-Sep-2011

చల్లని నీడ

గాత్రం: జానకి



పల్లవి:

మల్లెల కన్నా జాబిల్లి కన్నా
మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి లాలీజో
చల్లని పాపాయి లాలీజో

చరణం1:

లోకాలు నిదురుంచు వేళాయెరా
కలలందు విహరించ రావేలరా
లోకాలు నిదురుంచు వేళాయెరా
కలలందు విహరించ రావేలరా
తారలతో ఆడుకోవాలిరా
మేఘాలలో తేలిపోవాలిరా

మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి లాలీజో
చల్లని పాపాయి లాలీజో

చరణం2:

అందాలు చిందించు నీ మోమున
కస్తూరి తిలకమ్ము తీర్చేనురా
అందాలు చిందించు నీ మోమున
కస్తూరి తిలకమ్ము తీర్చేనురా
నీ మీద ఏ నీడ పడబోదురా
ఏ గాలి ఏ ధూళి రాబోదురా

మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి రావోయి
చల్లని పాపాయి రావోయి

నీ వారు లేరన్న భయమేలరా
నేనుండగా నీకు లోటేమిరా
నీ వారు లేరన్న భయమేలరా
నేనుండగా నీకు లోటేమిరా
కన్నులలో దాచుకుంటానురా
కనుపాపలా చూచుకుంటానురా

మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి రావోయి
చల్లని పాపాయి రావోయి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

02-Sep-2011

ఆవారా

గాత్రం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: వెన్నెలకంటి



పల్లవి:

నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే ఏ ఏ హే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్ధాలు చెప్పలేనులే
నీ జతలోన నీ జతలోన
ఈ ఎండాకాలం నాకు వానాకాలం
నీ కలలోన నీ కలలోన
మది అలలాగ చేరు ప్రేమ తీరం

నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే హే హే

చరణం1:

చిరుగాలి తరగంటి నీ మాటకే
ఎద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే
తనువూగేను తొలి పల్లవై
ప్రేమ పుట్టాక నా కళ్లలో
దొంగచూపేదో పురివిప్పెనే
కొంచెం నటనున్నది
కొంచెం నిజమున్నది
ఈ సయ్యాట బాగున్నది
నువ్వు వల వేస్తే నువ్వు వల వేస్తే
నా ఎద మారె నా కథ మారె
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచె చెలి స్నేహం

చరణం2:

ఒకసారి మౌనంగా నను చూడవే
ఈ నిమిషమే యుగమౌనులే
నీ కళ్లలో నన్ను బంధించవే
ఆ చెర నాకు సుఖమౌనులే
నిన్ను చూసేటి నా చూపులో
కరిగే ఎన్నెన్ని మునిమాపులో
పసిపాపై ఇలా నా కనుపాపలే
నీ జాడల్లో దోగాడెనే
తొలి సందెలలో తొలి సందెలలో
ఎరుపే కాదా నీకు సిందూరం
మలి సందెలలో మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్రమందారం

నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే ఏ ఏ హే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్ధాలు చెప్పలేనులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~