Nov 30, 2011

బాటసారి

గాత్రం: పి.లీల



పల్లవి:

శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి

చరణం1:

నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
పసుపుకుంకుమ నిలుపగదమ్మ రాజరాజేశ్వరి

శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి

చరణం2:

మాపై జాలిని పూనగలేవా
ఆపద తీరుపజాలవా
మాపై జాలిని పూనగలేవా
ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలేనా
కథ వ్యధగా ముగిసేనా

మాపై జాలిని పూనవా
ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలా
కథ వ్యధగా ముగిసేనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 28, 2011

వాన

గాత్రం: రంజిత్,చిత్ర
సాహిత్యం: సీతారామశాస్త్రి



పల్లవి:

సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి
వడగళ్ళ వాన ఉరిమింది ఐనా వినిపించదే జంటకి
తడిసే తరుణాన గొడుగై నే లేనా
సిరిమల్లె
సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి

చరణం1:

వల అనుకోనా వలపనుకోనా కలిపిన ఈ బంధం
వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నే సొంతం
చినుకై వచ్చావే వరదై ముంచావే
సిరిమల్లె
సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి

చరణం2:

చిలిపిగ ఆడి చెలిమికి ఓడి గెలిచా నీపైన
తగువుకు చేరి తలపుగ మారి నిలిచా నీలోన
మనసే ఈ వింత మునుపే చూసిందా
సిరిమల్లె
సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి
వడగళ్ళ వాన ఉరిమింది ఐనా వినిపించదే జంటకి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 21, 2011

చింతామణి

గాత్రం: భానుమతి



పల్లవి:

తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా

చరణం1:

మురళీధర నా మొర వినవేరా
మురళీధర నా మొర వినవేరా
తరుణనుగనరా వరములనీరా
చరణమె నమ్మితి రారా
శరణని వేడితిరా

తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా

చరణం2:

పతివని నమ్మితి పరాకదేల
పతివని నమ్మితి పరాకదేల
దయగొని రావా దరిశనమీవా
పతితను బ్రోవగ రావా
గతియని వేడితిరా

తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా

||

Nov 18, 2011

ఇల్లాలు ప్రియురాలు

తారాగణం: శోభన్‌బాబు, సుహాసిని, ప్రీతి, మాస్టర్ అర్జున్
గాత్రం: బాలు
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: జి.బాబురావు
విడుదల: 1984



పల్లవి:

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది

చరణం1:

నా బాధ ఇంక తీరేనా
నా గాధ నీకు తెలిసేనా
నీ కంటి లేత కన్నీళ్ళు
నా చేతులార తుడిచేనా
మమతే మనది
ఇక నాలోన నే దాగనా
మూగవీ ఆశలు గుడ్డివీ ప్రేమలు జాలిగా చూడకు
అలా చూడకు చూడకు

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది

చరణం2:

అనుకోని ఘటన ఆనాడు
అందించె నిన్ను ఈనాడు
మా దీపమై నీవు వస్తే
ఈ కోవెలే తలుపులేసే
బ్రతుకే అలిగే ఈ బంధాల కోశారమై
సాగనీ జాతకం ఆడనీ నాటకం
జాలిగా చూడకు అలా చూడకు చూడకు

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 16, 2011

పౌర్ణమి

గాత్రం: షాన్
సాహిత్యం: సీతారామశాస్త్రి




పల్లవి:

కోయో కోయో ఓ
కోయో కోయో హూ

life is so beautiful
never never make it sorrowfull
ఎక్కడ ఉందో ఏమో నీ మంజిల్
అట్టే అలోచించక ఆగే చల్
ఓరి దేవుడో ఎలాగని
ఊరుకోకురో ఉసూరని
ఆటపాటగా ప్రతీ పనీ
సాధించేయ్ ఏమైనాగానీ

కోయో కోయో ఓ
కోయో కోయో
కోయో కోయో ఓ
కోయో కోయో
life is so beautiful
never never make it sorrowfull
ఎక్కడ ఉందో ఏమో నీ మంజిల్
అట్టే అలోచించక ఆగే చల్
కోయో కోయో

చరణం1:

హే కొండలో కోనలో ఎవో ఎదురైనా
ఎండలో వానలో మన వేగం క్షణమైనా నిలిచేనా
చేరాలా కలలకోట
రణమేరా రాజ్యబాట

ఓరి దేవుడో ఎలాగని
ఊరుకోకురో ఉసూరని
ఆటపాటగా ప్రతీ పనీ
సాధించేయ్ ఏమైనాగానీ

కోయో కోయో ఓ
కోయో కోయో
కోయో కోయో ఓ
కోయో కోయో
life is so beautiful
never never make it sorrowfull
ఎక్కడ ఉందో ఏమో నీ మంజిల్
అట్టే అలోచించక ఆగే చల్
చల్ చల్ చల్

చరణం2:

హే భాదని చేదని ఏదో ఒక పేరా
బతకడం బరువని అడుగడుగు తడబడుతూ నడవాలా
రేపంటే రేపు అంటూ ముళ్ళున్నా దాని చుట్టూ

ఓరి దేవుడో ఎలాగని
ఊరుకోకురో ఉసూరని
ఆటపాటగా ప్రతీ పనీ
సాధించేయ్ ఏమైనాగానీ

కోయో కోయో ఓ
కోయో కోయో
కోయో కోయో ఓ
కోయో కోయో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 14, 2011

అభిమానవంతులు

తారాగణం: కృష్ణంరాజు, శారద, ఎస్.వి.రంగారావు,అంజలీదేవి
గాత్రం: సుశీల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
నిర్మాత: ఎం.రామకృష్ణారెడ్డి, బి. నరసింహారావు
దర్శకత్వం: కె.ఎస్.రామిరెడ్డి
సంస్థ: శ్రీరామకృష్ణ ఫిలింస్
విడుదల: 1973



పల్లవి:

ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం
మీటితే మ్రోగేది రాగం
ఎలమాటుగా పెరిగేది అనురాగం
ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం

చరణం1:

కలిమిలోన మిడిసిపడనిది
లేమిలోన కలతపడనిది
ఇరువురి నడుమ ఎల్లలులేనిది
ఇరువురి నడుమ ఎల్లలులేనిది
వలచిన హృదయాల తొలికలయిక ఆ ఆ ఆ ఆ

ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం

చరణం2:

కనిపించు ఆతని చిరునవ్వులోన
కవితలకందని మధురభావన ఆ ఆ ఆ ఆ
కనిపించు ఆతని చిరునవ్వులోన
కవితలకందని మధురభావన
ఆ భావనయే ఆరాధనగా
ఆ భావనయే ఆరాధనగా
అతనికి నేనే ఒక కానుక ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 11, 2011

తెలుగు సినిమా వజ్రోత్సవ గీతం



పల్లవి:

ప్రజల కంటి చూపు వెలుగు రూపాలం మేము
తెలుగు సినీ కళామతల్లి దీపాలం మేము
ప్రేక్షకులే దేవుళ్ళు అని కదులుతున్న యాత్రికులం
మా కళలే నైవేద్యంగా చేసే అర్చకులం
మా ఊపిరి మీరు, మీ కోసమే మేము
అపుడు ఇపుడు ఎపుడు మనమొక్కటే

we are one we will be one
we are one we will be one

చరణం1:

అలసిన మీ మనసుల అలరించేందుకే మేము
కళల తల్లి కరుణతో సినీ జన్మ పొందినాము
మము తారలుగా పెంచిన మహనీయులు మీరేలే
మా గుండెలు ఆడేందుకు ప్రాణవాయువు మీరే
నిర్మాణమే ప్రాణంగా మీ దీవెనే గమ్యంగా

we are one we will be one
we are one we will be one

చరణం2:

కంటిరెప్పలై మమ్ముల కాచే మీ చేతులలో
ఎదుగుతున్న బిడ్డలమై కనుల ముందు నిలిచినాము
సంతోషములోనే కాదు మీ భాదలలో కూడా
భాద్యతలను మోసే మేము మీ తనయులమే కాదా
వెండితెరే సాక్షిగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 9, 2011

చింతామణి

గాత్రం: ఏ.ఎం.రాజా, భానుమతి



పల్లవి:

అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే శృంగారమేమో
అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే భోగమే ప్రేమ
అందాలు చిందేటి ఆనందసీమ

చరణం1:

వెన్నెల రేయి పున్నమి రేడు
కల్వల వన్నెచిన్నెలెన్నో చెల్వమేమో
వెన్నెల రేయి పున్నమి రేడు
కల్వల వన్నెచిన్నెలెన్నో చెల్వమేమో
ఎన్నలేని ప్రేమ యవ్వన సీమ
ఎన్నలేని ప్రేమ యవ్వన సీమ
తేనెలూరు పూల వ్రాలు తేటికేటి తనువో

అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే శృంగారమేమో
అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే భోగమే ప్రేమ
అందాలు చిందేటి ఆనందసీమ

చరణం2:

ఆమని రాగా అలరుల దాగి
ఏమని కోకిలమ్ము ఆలాపించునోయి
ఆమని రాగా అలరుల దాగి
ఏమని కోకిలమ్ము ఆలాపించునోయి
అనురాగ గీతి నందించు రీతి
అనురాగ గీతి నందించు రీతి
ఎంత హాయి నేటి రేయి అందవోయి ప్రేమ
ఎంత హాయి నేటి రేయి అందవోయి ప్రేమ

అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే భోగమే ప్రేమ
అందాలు చిందేటి ఆనందసీమ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

||

Nov 7, 2011

త్రిమూర్తులు

గాత్రం: బాలు, సుశీల



పల్లవి:

ఓ ఓ ఓ ఓ శీతాకాలం శృంగారాలు
సాయంకాలం సంగీతాలు
పులకింతల పూదోటలో
కవ్వింతల కాపురం పెట్టుకుందామా చుట్టుకుందామా

చరణం1:

గోరంత నీ ముద్దు తాకే గోరింట నా నోట పండే
నా ఈడూ సూరీడులాగ ఎండెక్కే వేడిలో
కొండంత నీ ఎత్తు చూసా కోనంటి నీ లోతు చూసా
నీ ఎత్తులే చిత్తు చేసే కౌగిట్లో వాలనా
కసి కట్నమే చదివించనా కానిస్తే ఆ లాంచనం
రెచ్చిపోదామా రేగిపోదామా

చరణం2:

రెండితల బంతులాట రేయంత పూబంతులాట
చెక్కిళ్ళ చేమంతులాట ఆడిస్తా వాటంగా హోయ్
కూసంత నడుమిచ్చుకుంటా పువ్వంత మనసిచ్చుకుంటా
నీ సొంతమై తోడు ఉంటా అన్నిట్లో జంటగా
చలిమంటలే రగిలించనా సయ్యాటతో ఈ దినం
వద్దు అంటానా, అంటే వింటానా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 2, 2011

ఆవిడే శ్యామల

తారాగణం: ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ
గాత్రం: జేసుదాసు
సాహిత్యం: డి.నారాయణవర్మ
సంగీతం: మాధవపెద్ది సురేష్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: ఆర్.సీతారామరాజు
సంస్థ: పవన పుత్ర ప్రొడక్షన్స్
విడుదల: 1999



పల్లవి:

ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష
ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష
శార్దూల వాహనుడు మణికంట మోహనుడు కరుణించి కావగా దీక్ష
నియమాల మాలతో దీక్ష
ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష

చరణం1:

కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష
కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష
శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలము పూజల దీక్ష
ఓ ధర్మశాస్త ఓ అభయహస్త ఇహపరము తరియించు ముక్తిఫల దీక్ష
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

చరణం2:

అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర
పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా కోట్లాది పాదముల యాత్ర
పంబ నది యాత్ర పరమాత్మ యాత్ర ఇరుములను బాపగా ఇరుముడుల యాత్ర
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష
శార్దూల వాహనుడు మణికంట మోహనుడు కరుణించి కావగా దీక్ష
నియమాల మాలతో దీక్ష

స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~