Feb 27, 2012

ఇది కథ కాదు

గాత్రం: బాలు
సాహిత్యం: ఆత్రేయ



పల్లవి:

తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం

చరణం1:

ఈలోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణము
ఈలోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణము
ఆడించువాడెవ్వడైనా ఆడాలి ఈ కీలుబొమ్మ
ఆడించువాడెవ్వడైనా ఆడాలి ఈ కీలుబొమ్మ
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం

తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం

చరణం2:

వెళ్తారు వెళ్ళేటివాళ్ళు చెప్పేసెయ్ తుది వీడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు

చరణం3:

ఏనాడు గెలిచింది వలపు తానోడుటే దాని గెలుపు
ఏనాడు గెలిచింది వలపు తానోడుటే దాని గెలుపు
గాయాన్ని మాన్పేది మరుపు ప్రాణాన్ని నిలిపేది రేపు
గాయాన్ని మాన్పేది మరుపు ప్రాణాన్ని నిలిపేది రేపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు

తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: