Aug 2, 2010

శ్రీరామదాసు

గాత్రం: బాలు,చిత్ర
సాహిత్యం: శ్రీవేదవ్యాస



పల్లవి:

దాశరధి కరుణా పయోనిధి
నువ్వే దిక్కని నమ్మడమా
నీ అలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామకోటి రచియించడమా
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శనమియ్యవిదేమి
దాశరధి కరుణా పయోనిధి

చరణం1:

గుహుడు నీకు చుట్టమా
గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా
ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా
నీ దర్శనమే ఇమ్మంటిని కానీ
ఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావూ

సీతారామస్వామీ
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శనమియ్యవిదేమి

చరణం2:

రామ రసరమ్య ధామ రమణియ నామ
రఘువంశసోమ రణరంగభీమ రాక్షసవిరామ
కననీయ కామ సౌందర్య సీమ నీరదశ్యామ
నిజభుజోద్దామ భూజనలలామ భువనజయ రామ
పాహి భద్రాద్రి రామ పాహీ

దక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
డాండడడాండడనినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమరసాంతరంగ హృదయంగమ శుంగ శుభంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ
సుసంగ సత్య సారంగ సుశృతి విహంగ పాపపుధుసంగ విభంగా
భూతల పతంగా మధు మంగళరూపము చూపవేమిరా
గరుడగమన రారా గరుడగమన రారా

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment