Aug 4, 2010

లిటిల్ సోల్జర్స్

సాహిత్యం: సిరివెన్నెల




పల్లవి:

I am very good girl said me old teacher my dear brother
అన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నవ మిస్టర్
I am very good girl said me old teacher my dear brother
అన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నవ మిస్టర్
బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్‌తో
నీళ్ళోసుకుంటే నేను లిరిల్ సోపుతో
బ్రేక్‌ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జాంతో
స్కూల్‌కెళ్ళి పోతే నేను యూనిఫాములో
I am a good girl
I am a good girl
I am a good girl

బన్ని వస్తుంది జాగర్తగుండండి
ఫన్నిగా చూస్తుంది ఏదో చేస్తుంది
రన్ అవే ఫ్రం హెర్ లేకపోతే డేంజర్
గప్‌చుప్‌గా దాక్కోండి ఎక్కడైనా
Bunny is a bad girl we don't want her విన్నవ మిష్టర్
పాడు పళ్ళ దెయ్యం దాన్ని చూస్తే భయ్యం damn ur sister
పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా mischief చెయ్యకుండ వుండలేదుగా
గిచ్చి ఏడిపించకుండ వెళ్ళిపోదుగా అందరిని వెక్కిరించి నవ్వుతుందిగా
she is a bad girl
she is a bad girl
she is a bad girl

చరణం1:

ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా
ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా నీకిది అలవాటా
వద్దంటువున్నా వస్తావే వెంట నా పరువుంటుందా
ఉన్న ఒక్క చెల్లిని ఇంత చిన్న పిల్లని నువ్విలా తిట్టినా కొట్టినా
నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా చక్కని బొమ్మనే ఇవ్వనా
what a really nice plane తీసుకుని దీన్ని థాంక్యూ చెప్పుకో
i am not a naughty girl తెలుసుకో సన్ని ఇప్పుడైనా ఒప్పుకో

చరణం2:

టన్నులకొద్ది పెన్సిలన్ని
టన్నులకొద్ది పెన్సిలన్ని స్వాహా చేస్తావే
తినవే తల్లి అంటూ ఉన్నా అన్నం తినవేమే
బన్ని పేరు చెబితే ఊరిలో అందరూ బాబొయ అంటున్నారే
దాని బ్రదర్ అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే
సన్ని మాట నమ్మకు అన్ని ఉత్త కోతలు ప్రామిస్ మమ్మి
చిన్నదాన్ని కనకే అంత కోపం వొద్దులే please excuse me

నోరు తెరిస్తే డ్రామా
దీన్ని బాగా తందామా
ఇది పేరెంట్స్‌కి పరిక్ష
ఇది బ్రదర్‌కి శిక్ష
దీనికి యాంటి బయాటిక్ లేదా
దీనికి నీరసం రాదా
దీనితో మాట్లాడను
దీనితో ఆట్లాడను
ఇదో సైతాన్ ఇదో తూఫాన్
ఇదో నా బంగారు పాప

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

  1. నాకిష్టమైన పాటల్లో ఒకటి. ఇప్పుడు పెద్దవాడినైపోయినా, చుట్టుపక్కలవాళ్ళు నవ్వినా, యూట్యూబులో ఈ పాట పెడుతూనే వుంటా - నా చిట్టి చెల్లెళ్ళు (అప్పటి వయసు ప్రకారం) గుర్తొస్తారు.

    పాప (అప్పుడు) కావ్య చాలా బాగా చేసిందీ పాటలో. సిరివెన్నెలగారి గురించి నేను చెప్పక్కర్లేదు.

    నాకు తెలిసి ఇది "శ్రీ" స్వరపరచినది - కీరవాణిగారు కాదు.

    ReplyDelete