Aug 9, 2010

పద్మవ్యూహం

గాత్రం: బాలు, సుజాత
సాహిత్యం: రాజశ్రీ




పల్లవి:

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందిలే
ఇదియే బ్రతుకు అందునా
విధి చెలగాటమందునా
కదిలే కాలమందునా ఓ మనసా

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందిలే
ఇదియే బ్రతుకు అందునా
విధి చెలగాటమందునా
కదిలే కాలమందునా ఓ మనసా

చరణం1:

కొమ్మలో పువ్వులు కోతవరకేనులే
కురులలో పువ్వులు మగనితో పోవులే
ప్రేమ కథ ఒక్కటేలే సాగు కలకాలమే
వాన పయనాలన్ని నేల వరకేనులే
పడవ పయనాలన్నీ రేవు వరకేనులే
మనిషి పయనాలు అన్ని జీవితాంతంలే

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందిలే
ఇదియే బ్రతుకు అందునా
విధి చెలగాటమందునా
కదిలే కాలమందునా ఓ మనసా

చరణం2:

గాలి వీచిందని ఆకు తెలిపేనులే
వర్షమొచ్చిందనీ తేమ తెలిపేనులే
చిందు కన్నీటి ధార ప్రేమనే తెలిపులే
ఆకులే రాలినా కొమ్మ బ్రతికుందిలే
రేయి తెలవారినా జాబిలీ ఉందిలే
తోడు నిను వీడిపోయినా జీవితం ఉందిలే

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందిలే
ఇదియే బ్రతుకు అందునా
విధి చెలగాటమందునా
కదిలే కాలమందునా ఓ మనసా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment