తారాగణం: ప్రభుదేవా , సిమ్రాన్
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వనమాలి
దర్శకత్వం: గీతాకృష్ణ
నిర్మాణ సంస్థ: లైఫ్ లైన్ ఫిల్మ్స్
విడుదల: 1999
పల్లవి:
ప్రేమేనంటావా ప్రేమేనంటావా
నీకై ఇన్నాళ్ళు వేచానంటావా
ఫలించిన స్వప్నమే స్మరించె నీ రూపమే
ఉషస్సులా సందిటే రచించెనె రంగులే
వసంతమే ఎద వనాలనే నీ ఇంటనే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా
నీకై ఇన్నాళ్ళు వేచానంటావా
దివి భువి దీవెనై ఫలించెనీ సంగమం
నివాళిగా ఈ క్షణం లిఖించెనే సంతకం
వసంతమే ఎద వనాలని నీ ఇంటినే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా
చరణం1:
ఊసులాడుతుంటే చిరు నీగుండెలో దోచేది ఏమిటో
ఊపిరున్నదాక నిన్ను వీడని ఈ తోడు చాలని
ఈ జంట గుండెలొక్కటాయెనే మన ప్రేమలో
కాకమ్మ కబుర్లు కవితలాయెనే మన ప్రేమలో
కేలండరే ఉసూరని నిటూర్చదా రోజూ
విన్నానులే దూరాన ఓ సన్నాయినే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా
నీకై ఇన్నాళ్ళు వేచానంటావా
దివి భువి దీవెనై ఫలించెనీ సంగమం
నివాళిగా ఈ క్షణం లిఖించెనే సంతకం
వసంతమే ఎద వనాలనే నీ ఇంటనే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా
నీకై ఇన్నాళ్ళు వేచానంటావా
చరణం2:
అలల సంగతేంటి... కౌగిలింతలే నీ కొంటె దూకుడే
తమరి కానుకేంటి... ఛీ పాడు చెప్పలేనమ్మ
కల్లోని చిలిపి అల్లరి ఎదురుగా నే చెయ్యనా
కల్లోని తీపి పెదవి తడులు ఇంకా వున్నవి
దోబూచులే ఎన్నాళ్ళిలా దోచేదుందా ఈడు
దొంగాటలే సయ్యటలై దరిచేర్చులే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా
నీకై ఇన్నాళ్ళు వేచానంటావా
దివి భువి దీవెనై ఫలించెనీ సంగమం
నివాళిగా ఈ క్షణం లిఖించెనే సంతకం
వసంతమే ఎద వనాలనే నీ ఇంటనే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా
నీకై ఇన్నాళ్ళు వేచానంటావా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment