తారాగణం: రామారావు, నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద
గాత్రం: సుశీల, వాణి జయరాం
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాత & దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్
సంస్థ: జగపతి ఆర్ట్ పిక్చర్స్
విడుదల: 1978
పల్లవి:
ఆడనా పాడనా
ఆడనా పాడనా
ఆడనా పాడనా
ఆడుతూ స్వర్గాన్ని అందించనా
పాడుతూ నరకాన్ని మరపించనా
ఆడుతూ స్వర్గాన్ని అందించనా
పాడుతూ నరకాన్ని మరపించనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆడనా పాడనా
ఆడనా పాడనా
చరణం1:
నా కాళ్ళల్లో గజ్జెలు మోగుతున్నవరకు
కంఠంలో ప్రాణం ఆడుతున్నవరకు
కళ్ళల్లో నీ రూపు కదులుతున్నవరకు
నా హృదయంలో నీ ప్రేమ మెదులుతున్నవరకు
ఆడనా పాడనా
ఆడనా ఆ ఆ ఆ
ఆడనా పాడనా
చరణం2:
నిప్పును ఆర్పేటందుకు నీరు ఉన్నది
నీకోసం కళ్ళల్లో కన్నీరు ఉన్నది
కన్నీళ్ళకు రాయైనా కరుగుతుంది
కన్నీళ్ళకు రాయైనా కరుగుతుంది
కరగకుంటే కన్నీరే నిప్పవుతుంది
ఆడుతూ స్వర్గాన్ని అందించనా
పాడుతూ నరకాన్ని మరపించనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆడనా పాడనా
ఆడనా పాడనా
ప్రళయకాల కాళిలా
పడగెత్తిన త్రాచులా
పైకి దూకు డేగలా
మసి పట్టిన రేకులా
ఝలిపిస్తూ జడిపిస్తూ
తాగుతూ ఊగుతూ
కత్తిలా మెరుస్తూ
నెత్తురై పారుతూ
ఆడనా పాడనా
ఆడనా పాడనా
ఆడనా పాడనా
ఆడనా పాడనా
ఆడనా ఆ ఆ ఆ ఆ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment