Aug 15, 2010

మేజర్ చంద్రకాంత్

తారాగణం: రామారావు, మోహన్‌బాబు,శారద, నగ్మా
గాత్రం: బాలు
సాహిత్యం: జాలాది
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నిర్మాత: మోహన్‌బాబు
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
సంస్థ: శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్
విడుదల: 1993





పల్లవి:

పుణ్యభూమి నాదేశం నమో నమామీ
ధన్య భూమి నాదేశం సదా స్మరామీ
పుణ్యభూమి నాదేశం నమో నమామీ
ధన్య భూమి నాదేశం సదా స్మరామీ
నన్ను కన్న నాదేశం నమో నమామీ
అన్నపూర్ణ నాదేశం సదా స్మరామీ
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం
పుణ్యభూమి నాదేశం నమో నమామీ
ధన్య భూమి నాదేశం సదా స్మరామీ

చరణం1:

అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝుళిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృభూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడూ

చరణం2:

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
వచనం:
ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు
నారు పోశావా నీరు పెట్టావా
కోత కోశావా కుప్ప నుర్చావా
ఒరేయ్ తెల్లకుక్కా కష్టజీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా
అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు

పుణ్యభూమి నాదేశం నమో నమామీ
ధన్య భూమి నాదేశం సదా స్మరామీ
నన్ను కన్న నాదేశం నమో నమామీ,
అన్నపూర్ణ నాదేశం సదా స్మరామీ

చరణం3;

అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి...అగ్గి పిడుగు అల్లూరి
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా
అన్న ఆ మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి
మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం అన్నది ఆ ఆకాశం

చరణం4:

ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ
అఖండ భరతజాతి కన్న మరో శివాజీ
సాయుధ సంగ్రామమే న్యాయమనీ
స్వతంత్ర భారతావని మన స్వర్గమనీ
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
హిందు ఫౌజు జైహిందని నడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్

గాంధీజి కలలు కన్న స్వరాజ్యం
సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే
దృవతారలు కన్నది ఈ దేశం
చరితార్దులకన్నది నా భారతదేశం నా దేశం

పుణ్యభూమి నాదేశం నమో నమామీ
ధన్య భూమి నాదేశం సదా స్మరామీ
నన్ను కన్న నాదేశం నమో నమామీ,
అన్నపూర్ణ నాదేశం సదా స్మరామీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: