Oct 29, 2010

తోడు నీడ

తారాగణం: శోభన్‌బాబు, సరిత, రాధిక, నళిని
గాత్రం: బాలు, సుశీల
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: జనార్ధన్
నిర్మాత: వెంకన్న బాబు
సంస్థ: మహేశ్వరి ఫిలింస్
విడుదల: 1983




పల్లవి:

నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీతోనే, నా సర్వం నీలోనే
చూస్తున్నా నేనే నీవై

నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీతోనే, నా సర్వం నీలోనే
చూస్తున్నా నేనే నీవై

చరణం1:

నీ రూపం కలకాలం నా ఎదలో కదలాడే అపురూప అనురాగ దీపం
నీ నవ్వుల సిరిమువ్వల చిరునాదం ప్రతి ఉదయం వినిపించు భూపాల రాగం
మన లోకం అందాల లోకం
మన గీతం ఆనందగీతం
మన బ్రతుకు తుదిలేని సెలయేటి రాగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీతోనే, నా సర్వం నీలోనే
చూస్తున్నా నేనే నీవై

చరణం2:

నీ చెంపల ఎరుపెక్కే నును కెంపుల సొంపులలో పూచింది మందార కుసుమం
నీ మమతలు విరజిల్లే విరితేనెల మధురిమలో విరిసింది నవ పారిజాతం
ఈ రాగం అతిలోక బంధం
నీ స్నేహం ఎనలేని దాహం
అనుదినమొక అనుభవము రసమయ సంసారం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీతోనే, నా సర్వం నీలోనే
చూస్తున్నా నేనే నీవై

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: