Nov 1, 2010

తల్లా? పెళ్ళామా?

తారాగణం: రామారావు, చంద్రకళ, శాంతకుమారి,హరికృష్ణ
గాత్రం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: టి.వి.రాజు
దర్శకత్వం: రామారావు
నిర్మాత: నందమూరి త్రివిక్రమరావు
విడుదల: 1970





పల్లవి:

తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది
తెలంగాణా నాది రాయలసీమ నాది
సరారు నాది నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం1:

ప్రాంతాలు వేరైనా మన అంతరంగ మొకటేనన్నా
యాసలు వేరుగవున్నా మనభాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా వచ్చాడన్నా ఆ
వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం2:

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్నా
ఈ రెంటిలోన ఏది కాదన్నా
ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్న
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం3:

పోచంపాడు ఎవరిది, నాగార్జునసాగరమెవరిది
పోచంపాడు ఎవరిది, నాగార్జునసాగరమెవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కారుపంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలౌ అయిదు కోట్ల తెలుగువారిది
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం4:

సిపాయి కలహం విజృంభించ నరసింహలై గర్జించాము...స్వతంత్ర భారతి జై
గాంధి నెహ్రుల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేసాము...వందేమాతరం,వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమ్మును సాధించాము...జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి ధీటే లేదనిపించాము
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం5:

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇళ్ళెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గెడ్డను పగలగొట్టవద్దు
పాలు పొంగు మన తెలుగు గెడ్డను పగలగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులు పాలు చెయ్యొద్దు

తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది
తెలంగాణా మనది రాయలసీమ మనది
సరారు మనది నెల్లూరు మనది
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: