Dec 2, 2010

ఆనంద్

గాత్రం: శ్రేయాఘోషల్
సాహిత్యం: వేటూరి



పల్లవి:

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివాన లాలి పాడేస్తారా

చరణం1:

పిల్లపాపలా వాన
బుల్లిపడవలా వాన
చదువు బాధలే తీర్చి
సెలవలిచ్చిన వాన
గాలివాన కబాఢ్డీ
వేడి వేడి పకోడి
ఈడుజోడి ఢీ ఢీ ఢీ
తోడుండాలి ఓ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకుమనే ఎన్ని రంగులో
ఇంతి సొగసులే తడసినవి నీటి కొంగులో
శ్రావణమాసాలా జల తరంగం
జీవన రాగాలకిది ఓ మృదంగం

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా

చరణం2:

కోరివచ్చినా ఈ వాన
గోరు వెచ్చెనై నాలోన
ముగ్గులా సిగ్గు ముసిరేస్తే
ముద్దులాటిదే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలు
గాలివానలా పందిళ్ళు
కౌగిలింతలా పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికిపడే ఎవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికెలతో ఎదురుచూపులో
నల్లని మేఘాలా మెరుపులందం
తీరని దాహంలా వలపు పందెం

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివాన లాలి పాడేస్తారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివాన లాలి పాడేస్తారా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment