Dec 4, 2010

అల్లావుద్దీన్ అద్భుత దీపం

తారాగణం: నాగేశ్వరరావు, అంజలీదేవి, రాజసులోచన
గాత్రం: ఏ.ఎం. రాజా, పి. సుశీల
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు, ఎస్. హనుమంతరావు
దర్శకత్వం: టి.ఆర్.రఘునాధ్
సంస్థ: జైశక్తి పిక్చర్స్
విడుదల: 1957




పల్లవి:

అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావ
చిరుగాలి వీచే కెరటాలు లేచే
పరుగిడెరా మన పడవ ఏ సీమకో
అందాల కోనేటిలోన చిందింది ఈ పూలతేనే
మధురాతి మధురం ఆనందభరితం
అనవరతం అనురాగం మనకోసమే

చరణం1:

సాగేటి మన నావపైన వీచేటి చిరుగాలి ప్రేమ
ఆ ఆ సాగేటి మన నావపైన వీచేటి చిరుగాలి ప్రేమ
చుక్కాని నీవే నా చక్కనయ్య
చుక్కాని నీవే నా చక్కనయ్య
అదిగదిగో కనిపించు ఏ తీరమో
అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావ
చిరుగాలి వీచే కెరటాలు లేచే
పరుగిడెరా మన పడవ ఏ సీమకో

చరణం2:

వినిపించును హృదయగీతములే
వినిపించును హృదయగీతములే
కనిపించును అమరలోకములే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఇట మమతలు విరిసి పూసినవే
ఇట మమతలు విరిసి పూసినవే
విరికన్నెలు తలలు ఊపినవే
విరికన్నెలు తలలు ఊపినవే
ఫలియించును జీవనరాగమే
ఫలియించును జీవనరాగమే
ఈ ప్రేమ వనాలలో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఫలియించును జీవనరాగమే
ఫలియించును జీవనరాగమే
ఈ ప్రేమ వనాలలో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చరణం3:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
గిరిపైన పొగమంచు విడిపోయి కాంతులు తోచే
మదిలోన ఆశలు లేచే ఏ ఏ ఏ
చలిలోన ఊగు తీగె ఎలమావి ఊహలింతే ఆ ఆ ఆ ఆ
చలిలోన ఊగు తీగె ఎలమావి ఊహలింతే
ఇక ఏనాటికైనా ఎడబాటులేని ఆనందమిదియేగా
ఇక ఏనాటికైనా ఎడబాటులేని ఆనందమిదియేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గిరిపైన పొగమంచు విడిపోయి కాంతులు తోచే
మదిలోన ఆశలు లేచే ఏ ఏ ఏ

అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావ
చిరుగాలి వీచే కెరటాలు లేచే
పరుగిడెరా మన పడవ ఏ సీమకో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment