పల్లవి:
ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెల
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా
గీత గోవిందుడు వీనులా విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాకు మాకుమాలయ
నిజానికి ఇదంత ఒట్టి నీదయ
చరణం1:
పువ్వులెన్నొ విచ్చినట్టుగా చెలి నవ్వగానె నచ్చినావులే
చుక్కలెన్నో పుట్టినట్టుగా ప్రియా చూపుతొనే పట్టు కౌగిలి
ఖవాలీల కన్నులతోనే జవానీల జాబులు రాసే
జగడమొకటి సాగించోయమ్మో
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే మాలగా
దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద హంసలేఖ రాసిన
ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెల
నిజానికి ఇదంత ఒట్టి నీదయ
చరణం2:
సమ్ముఖాన రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా అరే అందగత్తె గొప్పకాదులే
పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నొ కవ్విస్తుంటే హృదయమొకటి పుట్టిందోయమ్మ
సరాగాల సంపెంగల్లో పరాగాల పండిస్తుంటే పరువమొకటి వచ్చే వాంఛలా
కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడి
జుంటితేనెపట్టులోన కొంటె వేణువూదిన
గీత గోవిందుడు వీనులా విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాకు మాకుమాలయ
నిజానికి ఇదంత ఒట్టి నీదయ
ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెల
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా
|
Interesting.
ReplyDeleteనిన్ననే ఈ సినిమా టీవీలో వచ్చింది