Dec 8, 2010

శుభవేళ

తారాగణం:రవికాంత్,అనసూయ
గాత్రం:దీప్తి,నిత్య
సంగీతం:ఆర్.పి.పత్నాయక్
సాహిత్యం:కులశేఖర్
నిర్మాత:రామోజీరావు
దర్శకత్వం:రమణ
సంస్థ:ఉషాకిరణ్ మూవీస్
విడుదల: 2000



పల్లవి:

శ్రీరామ నవమి తిరనాళ్ళు నాకప్పుడేమో ఆరేళ్ళు
నేనడగగానే ఈ బొమ్మ ముచ్చటగ కొంది మా బామ్మ
అప్పుడు దీని ఖరీదెంతో తెలుసా?
పది రూపాయలు
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం

చరణం1:

నా వయసు అపుడు పది కామోసు
మేమంతా వెళ్ళాం మదరాసు
పాండిబజారను మాయాబజారులో
ఈ జడ కుచ్చులు పాపిట బిళ్ళలు చెవి జూకాలు రవ్వల గాజులు
ఎన్నో కొన్నది వెన్నంటి మనసు అమ్మది
అప్పుడు వీటి ఖరీదెంతో తెలుసా?
మరో రెండు సున్నాలు
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం

చరణం2:

నా కప్పుడేమో టీనేజి
పక్కూరిలోనే కాలేజి
నా కప్పుడేమో టీనేజి
పక్కూరిలోనే కాలేజి
వెళ్ళి రావటానికి రాలి సైకిలు
వేసుకోవటానికి కొత్త చెప్పులు
పట్టు పావడాలు చోళీ గాగ్రాలు
ఎన్నో కొన్నారు మా మంచి నాన్నారు
అప్పుడు వీటి ఖరీదెంతో తెలుసా? మరో సున్నా
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం

చరణం3:

పెళ్ళీడు కొచ్చావన్నారు
కుర్రాడ్ని తీసుకొచ్చారు
నచ్చాడా అని అడిగారు
కాబోయే మొగుడన్నారు
కట్నం గా పది లక్షలంట
నగా నట్రా పొలం గట్రా ఇవ్వాలంట
తీరా అన్ని ఇచ్చాక
నేను కూడా వారి వెంట పుట్టిల్లు వదిలి వెళ్ళాలంట

చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
మొగుడికోసం బొల్డు డబ్బు పోసాం
రాను అంటే ఎందుకూరుకుంటాం
ఇదేమి రూలు ఇదేమి న్యాయం
చూసారా ఈ విడ్డూరం
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
ఎన్ని చెప్పినా నేను తాళి కడతా
అత్తారింటికి నిన్ను తీసుకెళ్తాం


||

No comments:

Post a Comment