Feb 23, 2011

గోదావరి

గాత్రం: శ్రేయా ఘోషల్
సాహిత్యం: వేటూరి



పల్లవి:

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి చిందులు
జిల్లుజిల్లున జల్లు పొద్దులు
చేసిపోయె ముద్దముద్దగా
మబ్బుమబ్బున మెరుపుతీగ పొద్దులు
కళ్ళలోన కన్నుగీటగా
వానలో వేడిలా చినుకుమన్న జాడలా
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి చిందులు

చరణం1:

గాలీ వాన తోడై వచ్చి ఉయ్యాలూపగా
వాన రేవు పిల్లా పెద్ద సయ్యటాడగా
గూటిపడవలో కోక చాటులో
కూత పెట్టు లేత వలపులు
లంగరేసినా అంది చావని
రంగసాని చాటు పిలుపులు
రాకడ పోకడ రాములోరికెరుకలే

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి చిందులు

చరణం2:

ఏరు నీరు ఓ దారైతే ఎదురీదాలిలే
ఎండా వాన కొండా కోన నీళ్ళాడాలిలే
ఘల్లుఘల్లున సాని కిన్నెర
ఓటమింక రెచ్చగొట్టేలే
నింగినంటని గంగవంటిది
పండు ముసలి శబరి తల్లిలే
ఆదరాబాదరా భాదలేని వానలా

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి చిందులు
జిల్లుజిల్లున జల్లు పొద్దులు
చేసిపోయె ముద్దముద్దగా
మబ్బుమబ్బున మెరుపుతీగ పొద్దులు
కళ్ళలోన కన్నుగీటగా
వానలో వేడిలా చినుకుమన్న జాడలా
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి చిందులు

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment