Feb 21, 2011

మనసే మందిరం

తారాగణం: నాగేశ్వరరావు,జగ్గయ్య,సావిత్రి
గాత్రం: పి.బి.శ్రీనివాస్
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
నిర్మాత: యర్రా అప్పారావు
విడుదల: 1966




పల్లవి:

తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ముగిసిన గాధ మొదలిడదు దేవుని రచనలలో
మొదలిడు గాధ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

చరణం1:

మనసునకెన్నో మార్గాలు
కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
మనసునకెన్నో మార్గాలు
కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
ఎదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం
ఒకరుండగ వేరొకరొచ్చారా లోకం ఒక నరకం

తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

చరణం2:

ప్రేమ పవిత్రం పెళ్ళి పవిత్రం ఎది నిజమౌ బంధం
ఎది అనురాగం ఎది ఆనందం బ్రతుకునకేది గమ్యం
మంచి చెడు మారేదే మనదన్నది మాటేదే
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం

తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment