Feb 6, 2012

జగన్మోహిని

తారాగణం: నరసింహరాజు,ప్రభ,జయమాలిని,సావిత్రి
గాత్రం: బాలు, సుశీల
సంగీతం: విజయకృష్ణమూర్తి
నిర్మాత & దర్శకత్వం: బి.విఠలాచార్య
సంస్థ: విఠల్ ప్రొడక్షన్స్
విడుదల: 1978



పల్లవి:

సాగే అలలపైన ఊగే చందమామ
సాగే అలలపైన ఊగే చందమామ
మనసు కనులలో చూడు దాగున్నాడు ఈ చందమామ
మనసు కనులలో చూడు దాగున్నాడు ఈ చందమామ
సాగే అలలపైన ఊగే చందమామ

చరణం1:

ఎగిసే చినుకులలో అర తడిసిన వెన్నెలలో
ఎగిసే చినుకులలో అర తడిసిన వెన్నెలలో
ఆ తడిసిన వెన్నెల ముడిలేయించిన సడలని కౌగిలిలో
చలిలో నులివేడి కలలు కందామా
సాగే అలలపైన ఊగే చందమామ

చరణం2:

వలచిన గుండెలలో వెలికుబికిన పొంగులలో
వలచిన గుండెలలో వెలికుబికిన పొంగులలో
ఆ ఒబికిన పొంగుల మాటున దాగని ఊహల అలజడిలో
జడిలో చెలరేగి రేగి పోదామా

సాగే అలలపైన ఊగే చందమామ
మనసు కనులలో చూడు దాగున్నాడు ఈ చందమామ
సాగే అలలపైన ఊగే చందమామ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment