Feb 9, 2012

వాన

తారాగణం: వినయ్,మీరాచోప్రా
గాత్రం: కార్తీక్
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: కమలాకర్
నిర్మాత & దర్శకత్వం: ఎం.ఎస్.రాజు
సంస్థ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల: 2008



పల్లవి:

ఆకాశగంగా దూకావె పెంకితనంగా
ఆకాశగంగా జలజల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా

చరణం1:

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావె
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావె
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే
చిటపటలాడి వెలసిన వానా
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడి

ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా

చరణం2:

ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపేస్తున్నా
నీ ప్రతి మలుపూ తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా

ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా జలజల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment