Sep 14, 2007

అప్పుచేసి పప్పుకూడు

తారాగణం : రామారావు,జగ్గయ్య,సావిత్రి,జమున,రేలంగి,గిరిజ
నిర్మాతలు :చక్రపాణి,నాగిరెడ్డి
దర్శకత్వం : ఎల్వి.ప్రసాద్
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సంస్థ : విజయా పిక్చర్స్
విడుదల :1958


ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ....
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ ....
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా, మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి

జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా ఆ ఆ ఆ ....
మనసు మీద హాయిగా
తీయగా, మాయగా మత్తుమందు జల్లుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి

హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ
హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ . ..
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా, మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఈ చల్లని గాలి.

||

1 comment:

Unknown said...

hello vihari,
mi pata patalu alochana chala bagundi
naku cinema peru telidu kani"atta vadi puvu vale mettanamma ane pata" sahityam pata kuda kavali. naku net lo dorakaledu. miru try cheyyandi
thanks