దర్శకత్వం :ఎ ఎం.రత్నం
నిర్మాత :ఎ ఎం.రత్నం
సంస్థ : శ్రీ సూర్యా ఫిలింస్
గాత్రం : చిత్ర
సంగీతం : రాజ్-కోటి
విడుదల :1992
పల్లవి:
ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే
ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే
అశలరెక్కల హంసల పల్లకి మోసుకు పోవలెనే
అశలరెక్కల హంసల పల్లకి మోసుకు పోవలెనే
మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ
ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ
ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే
అశలరెక్కల హంసల పల్లకి మోసుకు పోవలెనే
చరణం1:
తొలకరిలా వలపంతా మురిసెనులే తీయని ఊహలు చిగురు తొడిగేను
నింగిని తాకే పందిరి వేసి
పచ్చని పల్లెను పీటగ చేసి
నింగిని తాకే పందిరి వేసి
పచ్చని పల్లెను పీటగ చేసి
బంగారు రంగులు వేయించరారే
మురిపాల పెళ్ళి జరిపించరారే
వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసే
కనివిని ఎరుగని కమ్మని భావన కధలుగ కనిపించే
ఆ ఆ ఆ ఆఆఆఅ
ఆ ఆ ఆ ఆఆఆఅ
ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే
అశలరెక్కల హంసల పల్లకి మోసుకు పోవలెనే
చరణం2:
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్ని రాగాలు తీసే
చిలకమ్మలెన్నొ చిత్రాలు చేసే
కదిలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళ
వేచియున్నాడు వరుడే సందె సరసాల కేళ
సరసపు వయసున ఒంపుల సొంపుల సరిగమ వినిపించే
ఆ ఆ ఆ ఆఆఆఅ
ఆ ఆ ఆ ఆఆఆఅ
ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే
అశలరెక్కల హంసల పల్లకి మోసుకు పోవలెనే
మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ
ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ
|
No comments:
Post a Comment