Sep 14, 2007

అంతస్తులు

తారాగణం : నాగేశ్వరరావు,భానుమతి,క్రిష్ణకుమారి,జగ్గయ్య,గుమ్మడి
గాత్రం:భానుమతి
సంగీతం : కెవి.మహదేవన్
దర్శకత్వం :వి.మధుసూధనరావు
నిర్మాత : విబి.రాజేంద్రప్రసాద్
సంస్థ : జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల : 1965



పల్లవి:

దులపర బుల్లొడో హొయ్ హొయ్
దులపర బుల్లొడొ
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కల్లతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
1,2,3 చెప్పి దులపర బుల్లొడో దుమ్ము దులపర బుల్లోడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లోడో హొయ్

చరణం1:

సిరిగల చుక్కల చీర కట్టుకొని జవాది కలిపిన బొట్టు పెట్టుకొని
సిరిగల చుక్కల చీర కట్టుకొని జవాది కలిపిన బొట్టు పెట్టుకొని
వరాల బొమ్మ,ముద్దుల గుమ్మ కాలేజికి కదిలందంటే
వెకిలి వెకిలిగ వెర్రి వెర్రి గ వెంటపడే రౌడి ల పట్టుకొని,పట్టుకొని
తలాంగుతదిగిన తకతొంతొం అని
తలాంగుతదిగిన తకతొంతొం అని
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్

చరణం2:

సంప్రదాయమగు చక్కని పిల్ల,సాయంకాలం సినిమా కొస్తే ,వస్తే
సంప్రదాయమగు చక్కని పిల్ల సాయంకాలం సినిమా కొస్తే
ఇదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులొ బైటాయించుకొని ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే శిఖండి గాళ్ళను ఒడిసి పట్టుకొని
చింత బరికను చేత బట్టుకొని
చింత బరికను చేత బట్టుకొని
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్

చరణం3:

రోడ్ పట్టని కారులున్నవని, మూడంతస్తుల మేడలున్నవని
రోడ్ పట్టని కారులున్నవని,మూడంతస్తుల మేడలున్నవని
డబ్బు చూసి ఎటువంటి ఆడది
తప్పకుండ తమ వళ్ళో పడునని
ఈలలు వేసి,సైగలు చేసె,గోల చెయు సొగ్గాల్లను పట్టి , పట్టి
వీపుకు బాగ సున్నం బెట్టి
వీపుకు బాగ సున్నం బెట్టి
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్

చరణం4:

మాయ మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరనాల్లకు పొతే,పొతే
జనం ఒత్తిడికి సతమతమవుతు దిక్కు తోచక తికమకపడితే, అయ్యయ్యొ
సందు చూసుకొని సరసాలకు దిగు గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమారమణ గోవిందా ఊ రమారమణ గోవిందా హారి

దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్

Get this widget | Track details | eSnips Social DNA

No comments: