Sep 20, 2007

చిన్నబ్బాయి

తారాగణం:వెంకటేష్,రమ్యకృష్ణ,రవళి,ఇంద్రజ,శ్రీవిద్య
గాత్రం:బాలు,చిత్ర
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:కె.విశ్వనాథ్
విడుదల:1997




పల్లవి:

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే యా
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
హే జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు
సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే
సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే
సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే
సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటె
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరుపాలు
నిన్ను చూడాలంటె చాలవంట వేయి కళ్ళు
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే

చరణం1:

గువ్వ గూడుదాటి నీ పక్కకోస్తె గుండె మువ్వమీటి కట్టేసుకోవా
ఓ ధగధగ దందందం ధగధగ దందందం
వన్నె ఒంపులన్ని ఒడికెత్తుకుంటే కన్నెకెంపులన్ని ముడిపెట్టుకోనా
నీ కొంటె చూపులన్ని పోగుచేసి ఓ ఓ ఓ
నీ కొంటె చూపులన్ని పోగుచేసి సరికోత్త కోకనేసి ఇచ్చుకుంటే
మధుపర్కాలే కావా అవి ముద్దుల బుల్లెమ్మ
మనసున చల్లగ మ్రోగే తోలి మంగళవాద్యాలమ్మ
జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే

చరణం2:

సిగ్గుపగ్గాలన్ని తెంచేసుకుంటే బుగ్గ నిగ్గులన్ని పంచేసుకోనా
హా ధగధగ దందందం ధగధగ దందందం
వెన్ను మీది వాలి ఊయాలవైతే
వెన్న పూసలంటి వయ్యారవీణ
చలి మంట వేసుకున్న చందమామ ఆ ఆ ఓ ఓ ఓ
చలి మంట వేసుకున్న చందమామ తొలి ముద్దు పాయసాలు కాచివమ్మ
చుక్కల చెక్కిలి తాకే చిరు మబ్భువి నీవంట
అక్కున తానాలాడే పసి చినుకుని నేనంటా
జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే

సందెపొద్దే ఓ మంచి మాట చెప్పిపోతే
సాగరాలే సందిత్లో పొంగి సాక్షులైతే
నడిపించు నన్ను ఏడడుగులు నీతో నే నడిచివచ్చేను ఏడేడుజన్మలు
జాజిమల్లి జాజిమల్లి హా
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు

||

No comments: