పల్లవి:
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
ఆ మాటే చాలు నెలవంక రా ఇక
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక
విలాసాల దారికాసా
సరాగాల గాలమేసా
కులాసాల పూలుకోసా
వయ్యరాల మాల వేసా
మరో నవ్వు రువ్వరాదటే
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
చరణం1:
మల్లెపూల మంచమేసి హుషారించనా
జమాయించి జాజిమొగ్గ నిషా చూడనా
తెల్లచీర టెక్కులేవో చెలాయించనా
విర్రవీగు కుర్రవాణ్ణి నిభాయించనా
అతివకు ఆత్రము తగదటగా ఆ
తుంటరి చేతులు విడువవుగా మనసుపడే అడుసు ఒడి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
చరణం2:
కోరమీసమున్నవాడి కసే చూడనా
దోరదోర జామపళ్ళ రుచే చూపనా
కొంగుచాటు హంగులన్ని పటాయించనా ఆ
రెచ్చి రేగు కుర్రదాన్ని ఘుమాయించనా
పరువముపరుపుల పరమటగ
వయసున సరసము సులువటగ
తదిగినతోం మొదలెడదాం
ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
విలాసాల దారికాసా
సరాగాల గాలమేసా
కులాసాల పూలుకోసా
వయ్యరాల మాల వేసా
మరో నవ్వు రువ్వరాదటే
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ఆ మాటే చాలు నెలవంక రా ఇక
|
No comments:
Post a Comment