గాత్రం:ఘంటసాల,పి.లీల
సాహిత్యం:పింగళి నాగేంద్రరావు
సంగీతం:ఘంటసాల
దర్శకత్వం:కద్రి వెంకటరెడ్డి
నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డి
సంస్థ:విజయ పిక్చర్స్
విడుదల:1951

పల్లవి:
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలొనే కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూలమంటపమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
చరణం1:
నాలో ఏమొ నవభావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమొ నవభావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో
చరణం2:
నాలో ఏమొ నవరసరాగం పిల్లనగ్రోవి ఊదింది
నాలో ఏమొ నవరసరాగం పిల్లనగ్రోవి ఊదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానం చేసే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలొనే కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
|
No comments:
Post a Comment