సంగీతం : సత్యం
గాత్రం : బాలు
సంస్థ: రాధాచిత్ర కంబైన్స్
పల్లవి :
వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

శతాబ్ధాల చరితగల సుందరనగరం గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

చరణం1:
రాజరాజనరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు,నరపతులు ఏలిన వూరు
ఆ కధలన్ని నినదించే గౌతమి హొరు
వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
చరణం2:
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాథకవి నివాసము పెద్దముచ్చట
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాథకవి నివాసము పెద్దముచ్చట
కవిసార్వభౌములకిది ఆలవాలము
కవిసార్వభౌములకిది ఆలవాలము
నవకవితలు వికసించే నందనవనము
వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
చరణం3:
దిట్టమైనశిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనకమేడలు
దిట్టమైనశిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనకమేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగము ఒకడు మిగెలెను చాలు
వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్ధాల చరితగల సుందరనగరం గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
|
1 comment:
The music for this film is composed by Satyam. Plz rectify .
Post a Comment