Sep 16, 2007

పూజాఫలం

తారాగణం :నాగేశ్వరరావు ,సావిత్రి ,జగ్గయ్య,జమున ,గుమ్మడి
గాత్రం: ఎస్.జానకి
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
దర్శకత్వం :బి.ఎన్.రెడ్డి
నిర్మాత :డి.లక్ష్మీనారయణ చౌదరి
విడుదల :1964



పల్లవి:

ఆఆఆఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే ఏ ఏ ఏ
పగలే వెన్నెల జగమే ఊయల

చరణం1:

నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోన కలువభామ పొంగి పూచే ఏ ఏ ఏ ఏ
ఈ అనురాగమే జీవనరాగమై
ఈ అనురాగమే జీవనరాగమై ఎదలో తేనెజల్లు కురిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల

చరణం1:

కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసే మురళి పాట విన్న నాగు శిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపి పోదా

పగలే వెన్నెల జగమే ఊయల

చరణం2:


నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె పూలఋతువు సైగచూచి పిఖము పాడే
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె పూలఋతువు సైగచూచి పిఖము పాడే
మనసే వీణగా ఝనఝన మ్రొయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే ఏ ఏ ఏ
పగలే వెన్నెల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: